Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌ కొత్త స్పీకర్‌గా నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. ఈ స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియకు వైసీపీ దూరంగా ఉంది. స్పీకర్ పదవికి నామినేషన్ ఒకటే దాఖలు అయినందున ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రొటెం స్పీకర్‌ బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. రు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్, మంత్రి సత్యకుమార్‌ ఆయన్ని సభాపతి స్థానంలో కూర్చోబెట్టి ఆల్‌ది బెస్ట్ చెప్పారు. గత ఐదేళ్లు సభ ఎలా నడిపారో చూశాం. వైసీపీ వాళ్లకు విజయం తీసుకునే ధైర్యం అపజయాన్ని తీసుకోవడంలో లేదు. వైసీపీ వైళ్లు దూషణలు, దాడులతో రాష్ట్రాభివృద్ధిని వెనక్కి తీసుకెళ్లారు. దూషణలు, దాడులు ఆగాలి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆ బాధ్యత తీసుకోవాలి. 


పొట్టి శ్రీరాముల త్యాగాన్ని గుర్తు చేసుకొని ప్రజా సంక్షేమానికి మాత్రమే చర్చలు జరగాలి. ఇకపై అలా చేయకుంటే ఆ మహానుభావుడి త్యాగానికి ఫలితం ఉండదు. ఇకపై విలువలతో కూడిన సంప్రదాయానికి తెరలేపారని కోరుతున్నాను. రాబోయే తరానికిగొప్ప భవిష్యత్ ఇచ్చేలా ఉండాలి. రైతులకు అన్నంపెట్టేలా, మహిళలకు భద్రత ఇచ్చేలా, యువతకు ఉపాధి కల్పించేలా రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుతున్నాను 


అయ్యన్న పసుపుయోధుడు, ఫైర్‌బ్రాండ్: చంద్రబాబు


స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఎంపిక కావడం పట్ల సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే"  అందరి ఆమోదంతో 16 వ శాసనసభ స్పీకర్‌గా ఎన్నికైన అయ్యన్నకు శుభాకాంక్షలు.  ఏ పదవి ఇచ్చినా దానికి వన్నెతెచ్చిన వ్యక్తి. ఆరు దశాబ్ధాలు రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం ఆయనది. వాళ్ల తాత నుంచి వచ్చింది. టీడీపీ పెట్టినప్పటి నుంచి నర్సీపట్నంలో ఆయనే పోటీ చేస్తున్నారు. ఎప్పుడూ పోరాటం చేసే వ్యక్తి, రాజీపడని నాయకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఎవర్ని అడిగినా అయ్యన్నగురించి చెబుతారు. ఇప్పుడు కూడా ఫైర్‌ బ్రాండ్‌. చనిపోయే వరకు కూడా ఫైర్‌ బ్రాండ్‌గానే ఉంటారు. కరుడుగట్టిన పసుపుయోధుడుగా ఉన్నారు. ఉంటారు. 42 ఏళ్లు ఒక నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ఏడుసార్లు గెలవడం అనేదిఅరుధైన అనుభవం. 42 ఏళ్లుగా పసుపు జెండా మోస్తున్నారు. పార్టీని కన్నతల్లిగా భావించే వ్యక్తి. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి నీళ్ల కోసం వెనుకబడి అనుమతులు తెచ్చుకున్న వ్యక్తి. ఎప్పుడూ పడని ఇబ్బందులు గత ఐదేళ్లు పడ్డారు. ఇంట్లోకి వందల మంది పోలీసులు ఇంట్లో పడ్డారు. అనేక పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెట్టారు. అరెస్టు చేసి స్టేషన్ టూ స్టేషన్ తిప్పారు. 23 కేసులు పెట్టారు. అరవై రెండు సంవత్సరాలు ఉన్న వ్యకితపై రేప్ కేసు కూడా పెట్టారు.  అయినా మనోనిబ్బరంతో పోరాడారు. ప్రతి నాయకుడిలో స్ఫూర్తి దాయకమైన విషయాలు ఉంటాయి. అందుకే ఎక్కువ సార్లు విజయం సాధిస్తారు. అలాంటి పాజిటివ్ పాయింట్లు అయ్యన్నలో ఉన్నాయి. మనల్ని ఎంపిక చేసిన ప్రజలకు ఏం చేయాలి. తాత్కాలికంగా ఏం చేయాలి. దీర్ఘకాలంలో ఏం చేయాలో ఆలోచించి పని చేయాలి. అందరిపై పవిత్రమైన ఉన్నతమైన బాధ్యత ఉంది. చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన వ్యాఖ్యలు ప్రజలు గమనిస్తుంటారు. ఎమ్మెల్యేగా సమర్థంగా పనిచేస్తే ప్రజలు గౌరవిస్తారు. 


అయ్యన్నది ఒకే పార్టీ, ఒకటే జెండా ప్రజల అజెండా: లోకేష్


స్పీకర్‌గా అయ్యన్నను ఎంపి చేయడంపై ఏపీ అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... "ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి అయ్యన్న. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా చాలా అనుభవం ఉంది. అయ్యన్న అంటే పోరాటం, ఓ పౌరుషం, మీ నాయకత్వంలో అనేక మంచి పనులు జరిగాయి. నాకు ఎప్పుడు సలహా కావాలన్నా మీతో సంప్రదించాను, ఒకే పార్టీ, ఒకటే జెండా ప్రజల అజెండాగా రాజకీయం చేశారు. అనేక అక్రమ కేసులు పెట్టి వేధించినా అయ్యన్న భయపడలేదు" మంత్రి నారా లోకేశ్


సభ హుందాను పెంచుతారు: మంత్రి సత్యకుమార్ 


లోకేష్ తర్వాత మాట్లాడిన బీజేపీ శాసనసభాపక్ష నేత సత్యకుమార్ మాట్లాడుతూ... సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న వాళ్లు చాలా తక్కువగా ఉంటారు. ఈ అనుభవం సభను హుందాగా నడిపించడానికి ఉపయోగపడుతుంది. తొలిసారి సభకు వచ్చిన వారికి అయ్యన్న రాజకీయ జీవితం పాఠంగా మారుతుంది. అల్లరి పెట్టే పిల్లలను అదుపులో పెట్టే ప్రిన్సిపాల్‌గా ఉంటారని భావిస్తున్నా. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ఎన్నో అరాచకాలు చేసింది. రాష్ట్ర అభివృద్ధిని తిరోగమనం దిశగా తీసుకొచ్చింది. అలాంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి సిద్ధమైన చంద్రబాబు, పవన్‌, మోదీ సహకారంతో ముందుకెకెళ్తారు. ఇలాంటి సందర్భంలో తీసుకొచ్చే బిల్లులపై ఆరోగ్యకరమైన చర్చలు జరుగుతాయని భావిస్తున్నాను. రాజకీయ అనుభవం ప్రజాసమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంత ముఖ్యమైన కార్యక్రమంలో ప్రతిపక్షం లేకపోవడం దురదృష్టకరం. వారి బాధ్యతరాహిత్యానికి తార్కాణం. ప్రజలపట్ల, ప్రజాస్వామ్యం పట్ల వారికి ఉన్న నమ్మకం అలాంటిది. అందుకే ప్రజలు తిరస్కరించారని వైసీపీని విమర్శించారు.