Breaking News Live Telugu Updates: పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు- సభ రేపటికి వాయిదా

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు

ABP Desam Last Updated: 19 Sep 2023 05:21 PM
చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్నాక హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రెండు రోజుల్లో తీర్పు వెల్లడించనున్న హైకోర్టు. చంద్రబాబు రిమాండ్ స్కాష్ పిటిషన్ పై తీర్పు ఈ నెల 21 కి వాయిదా.

రాజ్యసభ రేపటికి వాయిదా

రాజ్యసభ వాయిదా పడింది. రాజ్యసభ బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును 2010లోనే రాజ్యసభ ఆమోదించిందని, ఈ బిల్లులో తమకు క్రెడిట్ దక్కుతుందన్నారు మల్లికార్జున ఖర్గే.  

పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు

కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ ఈ బిల్లుకు నారీ శక్తి చట్టం అని నామకరణం చేశారు. అదే సమయంలో లోక్ సభలో కాంగ్రెస్, ప్రతిపక్ష నేతలు గందరగోళం సృష్టించారు. 

'మహిళా రిజర్వేషన్ బిల్లును చాలాసార్లు ప్రవేశపెట్టారు, కానీ దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడు'


కొత్త పార్లమెంటులో తన మొదటి ప్రసంగంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, "మహిళలు చరిత్ర సృష్టించాల్సిన సమయం ఇది. మహిళా రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రోజు మన ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టబోతోంది. లోక్ సభ, విధానసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును చాలాసార్లు ప్రవేశపెట్టారని, కానీ దేవుడు నన్ను అనేక పవిత్ర పనులకు ఎంపిక చేశాడని అన్నారు.

మహిళలకు రిజర్వేషన్ కల్పించే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు: మోదీ

మహిళా సాధికారతపై ఉపన్యాసాలు ఇస్తే సరిపోదున్నారు ప్రధానమంత్రి మోదీ. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌ ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించే భాగ్యం తనకు వచ్చినందుకు దేవుడికి మోదీ కృతజ్ఞత తెలిపారు. 

పండిట్ నెహ్రూ పేరును ప్రస్తావించిన ప్రధాని మోదీ


'కార్మికులకు, ఇంజనీర్లకు మనమందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు నిర్మించిన ఈ భవనం ఎంతో స్ఫూర్తినిస్తుంది. దీని కోసం 30 వేల మందికిపైగా కార్మికులు కష్టపడ్డారు. స్వేచ్ఛకు మొదటి కిరణమైన పవిత్ర సెంగోల్‌కు ఇక్కడ కొలువుదీరింది. భారత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ చేపట్టిన సెంగోల్ ఇది. ఈ సెంగల్ మనల్ని గతంతో కలుపుతుంది."

కొత్త పార్లమెంట్లో ప్రధాని మోదీ తొలి ప్రసంగం

కొత్త పార్లమెంట్ భవనంలో లోక్ సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. కొత్త పార్లమెంటు భవనంలో తన మొదటి ప్రసంగంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, "చంద్రయాన్ -3 విజయం పట్ల భారతదేశం గర్విస్తోంది. కొత్త తీర్మానంతో కొత్త పార్లమెంట్ భవనానికి వచ్చాం. చేదును మరచి ముందుకు సాగాలి. ఈ భవనం కొత్తగా ఉంది. ఏర్పాట్లన్నీ కొత్తగా ఉన్నాయి. 

సీమ కష్టాలు తెలుసు- 253 కోట్లు ఖర్చు పెట్టి హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేశాం: జగన్

హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు సీఎం జగన్. ఈసందర్భంగా హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. అనంతరం డోన్‌ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాయలసీమ నీటి కష్టాలు తనకు తెలుసు అన్నారు. ఇక్కడ వర్షపు నీటితోనే పంటలు పడుతున్నాయని వేరే ఆధారం లేదన్నారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా సాగునీటి కోసం చర్యలు చేపట్టామన్నారు. గతంలో డోన్‌లో ఒక్క ఎకరం కూడా ప్రత్యేక ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ద్వారా పండే పరిస్థితి లేకుండేదన్నారు. 


గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల కష్టాలను పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికలకు 4 నెలల ముందు చంద్రబాబు జీవోలు, శంకుస్థాపనలతో హడావుడి చేశారే తప్ప చిత్తశుద్ధితో పని చేయలేదని ఆరోపించారు. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు వల్ల డోన్‌, పత్తికొండ నియోజకవర్గాల్లో ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం కనీసం భూసేకరణ కూడా చేయకుండా వదిలేసిన ఈ ప్రాజెక్టు కోసం తమ ప్రభుత్వం రూ. 253 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసిందని వివరించారు. నీటి విలువ, సీమ కష్టాలు తెలిసిన ప్రభుత్వంగా చిత్తశుద్ధితో ప్రాజెక్టు జాతికి అంకితం చేశామన్నారు. 

హైదరాబాద్‌లో నకిలీ స్టాంప్స్‌, సర్టిఫికెట్ల ముఠా అరెస్టు- భారీగా ఫేక్‌ డాక్యుమెంట్లు స్వాధీనం

హైదరాబాద్‌ భారీ నకిలీ స్టాంప్స్, సర్టిఫికెట్‌ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ డిపార్ట్మెంట్‌లకు సంబంధించిన నకిలీ రబ్బర్ స్టాంప్స్, సర్టిఫికెట్లను ఈ ముఠా తయారు చేసి విక్రయిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు 18 నిందితులను అరెస్ట్ చేశారు. 


18 మందిని అరెస్టు చేసిన పోలీసులు 1687 ఫేక్ రబ్బర్ స్టాంప్స్, 1180 నకిలీ సర్టిఫికెట్లు,సిపియు, మానిటర్, ల్యాప్‌టాప్ సీజ్ చేశారు. ఈ ఎక్యూప్‌మెంట్‌తో వివిధ రకాల డిపార్ట్‌మెంట్‌లకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు.


జిహెచ్ఎంసి ఆనుమతులతోపాటు ల్యాండ్ డాక్యుమెంట్లను కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. బ్యాంకు ద్వారా రుణాలు పొందడానికి ఈ నకిలీ సర్టిఫికెట్లు ఉపయోగించుకుంటున్నారు. 

ఇన్నర్ రింగ్‌రోడ్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా 


అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. 

ఈ సెంట్రల్ హాల్‌ అనేక చారిత్రాత్మక సంఘటనలకు సాక్ష్యం: ప్రధాని మోదీ ప్రసంగం

పాత భవనాన్ని వదిలి కొత్త భవనంలోకి అడుగు పెట్టడం అందర్ని భావోద్వేగానికి గురిచేస్తుందన్నారు ప్రధానమంత్రి మోదీ.  పాత పార్లమెంట్ భవనంలో ఫొటో సెషన్ తర్వాత మాట్లాడిన ఆయన... పాత పార్లమెంట్ భవనం మన కర్తవ్యానికి స్ఫూర్తినిస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక్కడే 1947లో బ్రిటిష్ ప్రభుత్వం అధికారాన్ని అప్పగించిదని గుర్తు చేశారు. ఈ సెంట్రల్ హాల్ దీనికి సాక్ష్యంగా నిలిచిందన్నారు. ఈ సెంట్రల్ హాల్ మా భావోద్వేగాలతో నిండి ఉందని వివరించారు. 

దేశం విడిచి వెళ్లండి- కెనడా సీనియర్ దౌత్యవేత్తకు భారత్‌ ఆదేశం

ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను భారత్ హతమార్చిందని ఆరోపిస్తూ భారత దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లాలని కెనడా ఆదేశించింది. అదే సమయంలో రాళ్లతో కూడిన ఘటన స్పందించిన భారత్ కొన్ని గంటల తర్వాత కెనడా సీనియర్ దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరఫున ఒక ప్రకటన విడుదల చేసింది. దౌత్యవేత్త 5 రోజుల్లోగా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది

రాజ్ ఘాట్ వద్ద నారాలోకేష్‌ మౌనదీక్ష- పాల్గొన్న టీడీపీ ఎంపీలు, సీనియర్ నేతలు

రాజ్ ఘాట్ ను సందర్శించి మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టిడిపి ఎంపీలు, మాజీ ఎంపీలు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రాజ్ ఘాట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన దీక్ష చేపట్టారు.

కర్నూలు జిల్లాలో సిపిఐ నేతల ముందస్తు అరెస్టులను ఖండించిన రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన వేళ సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి రామచంద్రయ్య, కర్నూలు నంద్యాల జిల్లాల కార్యదర్శులు బి గిడ్డయ్య, ఎన్ రంగనాయుడు తదితరులను ముందస్తుగా అరెస్టు చేశారు. దీన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఖండించారు. ఇలా ముందస్తు అరెస్టు దుర్మార్గమన్నారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతూ, అతిగా ప్రవర్తించటం మంచిదికాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నిరంకుశ రాచరిక పాలనలో ఉన్నామా? అనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాతంత్ర వాదులంతా రాష్ట్ర ప్రభుత్వ, పోలీసు విపరీత చర్యలను ఖండించాలని కోరారు రామకృష్ణ.

కర్నూలు జిల్లాలో సిపిఐ నేతల ముందస్తు అరెస్టులను ఖండించిన రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన వేళ సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి రామచంద్రయ్య, కర్నూలు నంద్యాల జిల్లాల కార్యదర్శులు బి గిడ్డయ్య, ఎన్ రంగనాయుడు తదితరులను ముందస్తుగా అరెస్టు చేశారు. దీన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఖండించారు. ఇలా ముందస్తు అరెస్టు దుర్మార్గమన్నారు. అధికార పార్టీకి పోలీసులు వత్తాసు పలుకుతూ, అతిగా ప్రవర్తించటం మంచిదికాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక నిరంకుశ రాచరిక పాలనలో ఉన్నామా? అనే ప్రశ్న తలెత్తుతోందన్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాతంత్ర వాదులంతా రాష్ట్ర ప్రభుత్వ, పోలీసు విపరీత చర్యలను ఖండించాలని కోరారు రామకృష్ణ.

పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా- కొత్త పార్లమెంట్‌ భవనానికి నామకరణం 

కొత్తగా నిర్మించిన పార్లమెంట్ బిల్డింగ్‌కి "పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా"గా నామకరణం చేసింది కేంద్రం. మంగళవారం నుంచి పార్లమెంట్ కొత్త భవనంలో సమావేశాలు జరుగుతాయని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు.


 

విజయవాడలో టీడీపీ నేతల హౌస్‌ అరెస్ట్‌లు- పాదయాత్రగా దుర్గగుడికి వెళ్లకుండా నిర్బంధం

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆయన క్షేమంగా విడుదల కావాలని టీడీపీ నేతలు దుర్గగుడికి వెళ్లాలనున్నారు. పాదయాత్ర ద్వారా విజయవాడ దుర్గగుడికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. అధికారులు మాత్రం ఆ కార్యక్రమానికి అనుమతి లేదని చెబుతున్నారు. అందుకే విజయవాడలోని కీలక నేతలను ముందస్తు అరెస్టు చేశారు. బొండా ఉమాతోపాటు చాలా మంది నేతలను నిర్బంధించారు. దీనిపై తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు.

Background

దాదాపు ౩ దశాబ్దాలుగాా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇవాళ (సెప్టెంబర్ 19) కొత్త పార్లమెంట్ భవనంలో ప్రారంభం కాబోయే సమావేశాల్లో తొలి బిల్లుగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుకు సభలో ఆమోదం లభించి చట్టంగా మారితే.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభించనుంది. లోక్‌సభ, రాష్ట్రాల్లోని శాసనసభల్లోని మొత్తం సీట్లలో 33 శాతం లేదా మూడింట ఒక వంతు మహిళలకు కేటాయించాలని ప్రతిపాదిస్తుంది. దేవెగౌడ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 81వ రాజ్యాంగ సవరణ బిల్లుగా దీనిని లోక్ సభలో మొదటిసారిగా ప్రవేశపెట్టింది. ఆ సమయంలో బిల్లు రద్దు అయింది. ఆ తర్వాత్ 1999, 2002, 2003 లో ఈ బిల్లును తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ మద్దతు లభించలేదు. యూపీఏ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందగా లోక్‌సభలో మాత్రం పరిశీలనకు తీసుకోలేదు. 


పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తొలిరోజే మహిళా రిజర్వేషన్‌ బిల్లు అంశం ప్రస్తావనకు వచ్చింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లును లోక్‌సభ ఆమోదించాలని కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌  రంజన్‌ చౌదరి కోరారు. దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది ఈ బిల్లు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకావానికి ముందు రోజు జరిగిన అఖిలపక్ష  సమావేశంలో అధికార, ప్రతిపక్ష కూటమికి చెందిన పార్టీల నుంచి ఈ బిల్లుకు మద్దతు లభించింది. మహిళా రిజర్వేషన్ బిల్లును... ఐదు రోజుల ప్రత్యేక సెషన్‌లో ప్రభుత్వ  అజెండా జాబితాలో చేర్చనప్పటికీ... తగిన సమయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. 2010లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని  కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదించబడింది. అది ఇప్పటికీ లాప్‌ కాలేదు. దీంతో లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడమే మిగిలింది.


మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏమిటి?


దేశంలో లింగ విబేధం లేకుండా అందరికి సమాన హక్కులు కలిగి ఉండాలని.. అన్ని మతాలు, వర్గాలు, సంస్కృతులు సమానంగా ఉండాలన్న ఆంక్షతో స్వాతంత్ర్యం  సాధించుకున్నాం. కానీ... పురుషుల ఆధిపత్యం ఎక్కువై.. మహిళల ప్రాధాన్యత తగ్గుతూ ఉండటంతో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రాధాన్యత పెరిగింది. మహిళా రిజర్వేషన్  బిల్లు అంటే... లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లోని మొత్తం సీట్లలో 33శాతం లేదా మూడింట ఒక వంతు మహిళలకు రిజర్వ్ చేయాలని ప్రతిపాదిస్తుంది. 33శాతం కోటాలో ఎస్సీ,  ఎస్టీలు, ఆంగ్లో-ఇండియన్ల సబ్ రిజర్వేషన్లను కూడా బిల్లు ప్రతిపాదిస్తుంది. ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత రిజర్వ్‌డ్ సీట్లను మార్చాలని బిల్లు ప్రతిపాదిస్తోంది.









దేవెగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం సెప్టెంబర్ 12, 1996న 81వ సవరణ బిల్లుగా లోక్‌సభలో తొలిసారిగా దీనికి ప్రవేశపెట్టింది. అయితే, ఈ బిల్లు సభ ఆమోదం  పొందలేదు. లోక్‌సభలో బిల్లు రద్దయ్యింది. వాజ్‌పేయి ప్రభుత్వంలో 1999, 2002, 2003లో తిరిగి మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టారు. కానీ  అప్పుడూ బిల్లు పాస్‌ కాలేదు. దాదాపు ఐదేళ్ల తర్వాత, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపీఏ-1 హయాంలో రాజ్యసభ ఆమోదం పొందినా.. లోక్ సభ పరిశీలనకు తీసుకోలేదు.


పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం ఎంత?


17వ లోక్‌సభలో ఇప్పటివరకు అత్యధికంగా 82 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. ఇది మొత్తం లోక్‌సభ బలంలో దాదాపు 15.21 శాతం. 2022లో ప్రభుత్వ డేటా ప్రకారం  రాజ్యసభలో మహిళల ప్రాతినిధ్యం దాదాపు 14 శాతం. 2014లో అంటే 16వ లోక్‌సభలో మొత్తం 11.87 శాతం అంటే 68మంది మహిళా ఎంపీలు ఉన్నారు. 2019 లోక్‌సభ  ఎన్నికల ప్రకారం 47.27 కోట్ల మంది పురుషులు, 43.78 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2019 ఎన్నికలలో, పురుషుల భాగస్వామ్యం కంటే 67.18 శాతం  మహిళా  ఓటరు భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.