SLBC Tunnel Breaking News: 10న గ్రూప్ 1, 11న గ్రూప్-2 ఫలితాలు - టీజీపీఎస్సీ కీలక ప్రకటన
Telugu News Updates Today | ఏపీ, తెలంగాణతో పాటు జాతీయ, అంతర్జాతీయ అంశాలు ఇతర అప్ డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
Hyderabad News: హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌లో ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో తీగల కృష్ణారెడ్డి మనవడు, మాజీ బీఆర్ఎస్ కార్పొరేటర్ కుమారుడు మృతి చెందారు. ముసారాంబాగ్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి(19) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. హైదరాబాద్ శివారులోని గొళ్లపల్లి కలాన్ వద్ద ఓఆర్ఆర్‌పై లారీని వెనక నుంచి కనిష్క్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కనిష్క్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Telangana Groups Results Breaking News: తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్స్‌కు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. ఇప్పటికే జారీ చేసిన వివిధ నోటిఫికేషన్స్ ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తున్నారో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-1 ఫలితాలను ఈ నెల 10న, గ్రూప్-2 ఫలితాలను 11న, గ్రూప్-3 ఫలితాలను 14న విడుదల చేయనున్నారు. 17న హాస్టల్ వెల్‌ఫేర్ ఆఫీసర్స్ పోస్టుల ఫలితాలు, 19 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ ఫలితాలు రిలీజ్ చేస్తున్నారు.
SLBC Tunnel Breaking News: తెలంగాణలో పద్నాలుగు రోజులుగా సాగుతున్న ఎస్‌ఎల్‌బీసీ ఆపరేషన్‌లో కీలక ముందడుగు పడింది. కేరళ నుంచి తీసుకొచ్చిన కెడవర్ డాగ్స్ సాయంతో అధికారులు ఆపరేషన్‌లో పురోగతి సాధించారు. సొరంగం లోపలికి వెళ్లిన డాగ్స్ మూడు స్పాట్‌లను గుర్తించాయి. ఆ స్పాట్‌లలో అధికారులు తవ్వకాలు ప్రారంభించారు.
Big Breaking News: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మరో సంచల నిర్ణయంతో అందరి దృష్టిన ఆకర్షించారు. ఎప్పటి నుంచో బద్ద శత్రువైన ఇరాన్‌కు లేఖ రాశారు. పాత పగలు అన్నీ మర్చిపోయి స్నేహంగా ఉందాం అంటూ అందులో పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుందామని ప్రతిపాదించారు.
Andhra Pradesh Government has Ordered a High-Level Inquiry Into Acharya Nagarjuna University's B.Ed Perspectives in Child Development exam question paper: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బిఎడ్ పరీక్షా పత్రం లీకేజి అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్‍మెంట్ పరీక్షా పత్రం నిర్ణీత సమయానికి ముందే లీక్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశఆరు. విచారణ చేయాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయి హెచ్చరించారు. ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
Haryana Breaking News: హర్యానాలో యుద్ధ విమానం కుప్పకూలింది. పంచకులలో ఈ విమానం ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటన నుంచి నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. అంబాలా ఎయిర్‌బేస్ నుంచి బయల్దేరిన కాసేపటికే యుద్ద విమానం ప్రమాదానికి గురైంది. దీనికి కారణాలపై అధికారులు విచారణకు ఆదేశించారు.
Breaking News: తమిళనాడులో తిరుత్తణిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, బస్ ఢీకొన్న దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఇరవై మందికి గాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.
Hyderabad News: మేడ్చల్ జిల్లా కీసర ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా పని చేస్తున్న ఆనంద్ విద్యార్థులను చితకబాదారు. ఒంట్లో బాగాలేదన్నా వినకుండా ఎనిమిది మంది విద్యార్థినిలను కొట్టారు. ఎనిమిదో వ తరగతి చదువుతున్న ప్రణతి, వైశాలి, కావ్య, నవ్య , చరన్య, అర్చన, బ్లేస్సి, కీర్తన గేమ్స్ పీరియడ్‌లో ఆటలు ఆడేందుకు రాలేదని ఏ మాత్రం కనికరం లేకుండా కరెంట్ వైర్‌తో చితకబాదారు. ఇంటికి వచ్చిన విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు స్కూల్ లో జరిగిన విషయం చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్ధినిల ఒంటిపై గాయాలు చూసి షాక్ గురయైన తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
Telangana Breaking News: తెలంగాణలో 21 ఐపీఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది.
ఇంటెలిజెన్స్ ఎస్పీగా- సింధూశర్మ
వరంగల్ సీపీగా- సన్ ప్రీత్ సింగ్
రామగుండం సీపీగా-అంబర్ కిషోర్ ఝా
కామారెడ్డి ఎస్పీగా- రాజేష్ చంద్ర
నిజామాబాద్ సీపీగా - సాయి చైతన్యం
కంరీంనగర్ సీపీగా- గౌస్ ఆలం
ఆదిలాబాద్ ఎస్పీ- అఖిల్ మహాజన్
నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్
భువనగిరి డీసీపీగా- ఆకాంక్ష యాదవ్
సంగారెడ్డి ఎస్పీగా- పంకజ్ పరితోష్
సిరిసిల్లా ఎస్పీగా- గీతే మహేష్ బాబా సాహెబ్
వరంగల్ డీసీపీగా -అంకిత్ కుమార్
మంచిర్యాల డీసీపీగా- భాస్కర్
పెద్దపల్లి డీసీపీగా -కరుణాకర్
సెంట్రల్ జోన్ డీసీపీగా - శిల్పవల్లి
సూర్యపేట్ ఎస్పీగా -నరసింహా
సీఐడీ ఐజీగా- ఎం శ్రీనివాసులు
సీఐడీ ఎస్పీగా- రవీందర్
అదనపు డీజీ (పర్సనల్)గా అనిల్ కుమార్‌కు ఎస్పీఎఫ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు
మహిళ భద్రతా విభాగం ఎస్పీగా చేతన
హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి
ఎస్‌ఐబీ ఎస్పీగా సాయి శేఖర్
అమరావతి: జనసేన నాయకుడు నాగబాబు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు నామినేషన్ కార్యక్రమంలో మంత్రి లోకేష్, నాదెండ్ల మనోహర్, జనసేన ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాగబాబుకు మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు చెప్పారు.
అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేష్ శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ఇండియా టుడే గ్రూప్ కాంక్లేవ్ కు హాజరుకానున్నారు. శనివారం మధ్యాహ్నం జరిగే కాంక్లేవ్ లో మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు.
అమరావతి: వైసీపీ నాయకులు పెంచిన విద్యుత్ చార్జీలపై వాళ్లే ధర్నాలు చేసి, ప్రశ్నలు అడుగుతున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఎద్దేవా చేశారు. ‘2022-23, 2023-24 సంవత్సరాలకు గాను వైసీపీ ప్రభుత్వం రూ.15 వేల కోట్లు భారం మోపిందన్నారు. 2014-19 వరకు మా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు. మిగులు విద్యుత్ తో రాష్ట్రాన్ని వైసీపీ ప్రభుత్వానికి అప్పగించాము. గత ఐదేళ్లలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసింది. జగన్ అనాలోచిత చర్యలతో నాడు 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి భారం మోపారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను కూడా వైసీపీ నాయకులు తరిమి కొట్టారు
గత టీడీపీ హయాంలో 8 గిగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేశారు. అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యుత్ కొనుగోళ్లు భారీగా తగ్గాయి. జెన్ కో నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ... విద్యుత్ కొనుగోళ్లకు చెక్ పెడుతున్నాం. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా విద్యుత్ చార్జీలను పెంచబోదు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ నాయకులు ప్రశ్నలు అడుగుతున్నారని’ చెప్పారు.
ఐపీఎల్ అభిమానులకు సన్ రైజర్స్ గుడ్ న్యూస్ చెప్పింది. మొదటి రెండు మ్యాచ్ లకు టికెట్లు విడుదల చేసింది. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ తో తొలి మ్యాచ్ కు, ఇక్కడి ఉప్పల్ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో సన్ రైజర్స్ తలపడుతోంది. మ్యాచ్ 27న జరగనున్న ఈ మ్యాచ్ టికెట్లు సైతం సన్ రైజర్స్ రిలీజ్ చేసింది. రూ. 750 నుంచి టికెట్ల ధరలు ఉన్నాయి. Clike Here to Book IPL Tickets online
నేడు ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రంలో ఎమ్మెల్యేలతో భేటీ అవనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పై పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించి ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది
అలాగే ఏప్రిల్ 10న హైదరాబాద్ లేదా వరంగల్‌లో సభ నిర్వహించేందుకు పార్టీ నేతలతో చర్చించనున్న బీఆర్ఎస్ అధినేత
కాకినాడ: కుసుమ కళ్యాణ్ అనే వ్యక్తి హైదరాబాద్ ట్యూలిప్స్ గ్రాండ్ హోటల్ లో మూడు వాటర్ బాటిల్స్ కొన్నారు. 27 రూపాయలు అదనంగా వసూలు చేసినందుకు 27 లక్షల ఇరవై ఏడువేలు పెనాల్టీ విధించాము. ఒక్కొక్క వాటర్ బాటిల్ 20 రూపాయలు అయితే, మూడు వాటర్ బాటిల్స్ కి 60కి బదులుగా 87 రూపాయలు తీసుకున్నారు. హోటల్ హైదరాబాదులో ఉన్న వినియోగదారుడు కాకినాడకు చెందిన వ్యక్తి కాబట్టి ఎక్కడైనా కేసులు వేయవచ్చు.
వినియోగదారులను ప్రతినిత్యం దోచుకుంటున్నారు. చిన్న అమౌంట్ అని వదిలేయకూడదు. అన్యాయమని హోటల్ యజమాన్యాన్ని అడిగిన రెస్పాండ్ కాలేదు. నోటీసులు పంపించిన స్పందించలేదు. 27 రూపాయలు అదనంగా వసూలు చేసినందుకు 27 లక్షల ఇరవై ఏడు వేలు పెనాల్టీ కట్టి తీరాలి. 25 లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి, 25000 వినియోగదారుడికి 2000 కోర్టుకి హోటల్ యజమాన్యం చెల్లించాలని కాకినాడ వినియోగదారుల ఫోరం కమిషన్ అధ్యక్షులు రఘుపతి, మెంబర్ సుశి ఆదేశించారు.
ఉ.9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు మండలి ప్రారంభం
ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఉభయ సభలు
విశాఖలో టీడీఆర్ బాండ్ల జారీపై అసెంబ్లీలో ప్రశ్నలు
చేనేత సహకార సంఘాల పునరుద్ధరణతో పాటు..
రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఖాళీలపై ప్రశ్నలు
అసెంబ్లీలో ఈరోజు హౌసింగ్‌పై లఘు చర్చ
పలు శాఖల బడ్జెట్ డిమాండ్లు, గ్రాంట్లపై చర్చ
బిల్డ్ ఏపీ మిషన్ కింద విశాఖతో పాటు..
ఇతర ప్రాంతాల్లో భూముల అమ్మకాలు, తనఖాపై ప్రకటన
అసెంబ్లీలో ప్రకటన చేయనున్న సీఎం చంద్రబాబు
మండలిలో బడ్జెట్‌పై సమాధానం ఇవ్వనున్న పయ్యావుల
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు టిక్కెట్ల విక్రయాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్ 2025 సందడి మొదలైంది. మార్చి 7న ఉదయం 11 గంటల నుంచి ‘జొమాటో డిస్ట్రిక్ట్’ యాప్‌లో ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం తెలిపింది.
Background
వైసీపీ సానుభూతిపరుడు బోరుగడ్డ అనిల్ కుమార్ చేసిన పని రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. బెయిల్ పొందేందుకు ఫేక్ మెడికల్ సర్టిఫికెట్ డాక్యుమెంట్స్ బోరుగడ్డ అనిల్ సబ్మిట్ చేశాని పోలీసులు గుర్తించారు. తల్లికి అనారోగ్యమని చెప్పి, చికిత్స చేపించాలని మధ్యంతర బెయిల్ పొందిన బోరుగడ్డ అనిల్ ప్రస్తుతం ఫోన్లో అందుబాటులోకి రావడం లేదు. ఫోన్లు సైతం స్విచ్ఛాఫ్ చేసుకోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. డాక్యుమెంట్లు వెరిఫై చేయకుండా, జైలు నుంచి బోరుగడ్డను అంత ఈజీగా ఎలా వదిలేశారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
2025-26 సంవత్సరానికి చెందిన బడ్జెట్‌పై కూడా తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశాలు ఎప్పటి నుంచి పెట్టాలనే అంశంపై మంత్రులు చర్చించుకున్నారు. మార్చి 12 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దాదాపు పదిహేను రోజుల పాటు ఈ సమావేశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
తెలంగాణ మంత్రివర్గం ప్రారంభంలోనే ఎస్సీ వర్గీకరణ ముసాయిదాకు ఓకే చెప్పింది. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు (BC Reservation Bill) అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. దీన్ని ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించి కేంద్ర కోర్టులో వేయాలని రేవంత్ సర్కారు చూస్తోంది. బీసీ రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత వస్తే స్థానిక సంస్థల ఎన్నికలు ఇతర జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు లైన్ క్లియర్ అవుతుందని సర్కారు భావిస్తోంది. అందుకే పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోపు ఈ బీసీ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించాలని చూస్తున్నారు.
పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు వచ్చే సోమవారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని సమస్యలతోపాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్న విషయాలపై కూడా ఏం చేయాలో పార్టీ ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు టిక్కెట్ల విక్రయాలను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఐపీఎల్ 2025 సందడి మొదలైంది. మార్చి 7న ఉదయం 11 గంటల నుంచి ‘జొమాటో డిస్ట్రిక్ట్’ యాప్‌లో ఐపీఎల్ టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం తెలిపింది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -