గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ముంబైలో ఉన్నారిప్పుడు. ఒక కూల్ డ్రింక్ యాడ్ షూటింగ్ కోసం బాలీవుడ్ రాజధానికి వెళ్లారు. త్వరలో మళ్లీ హైదరాబాద్ వస్తారు. 'ఉప్పెన' వంటి 100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా తీసిన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేస్తారు. మెగా కాంపౌండ్ సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారు అయింది.


వచ్చే ఏడాది పుట్టిన రోజు కానుకగా 'పెద్ది'?
Ram Charan and Janhvi Kapoor movie release date: రామ్ చరణ్, బుచ్చిబాబు సానా సినిమాకు 'పెద్ది' టైటిల్ ఖరారు చేశారని తెలిసింది. అయితే ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా RC16 టీం అనౌన్స్ చేయలేదు.‌ ఈ సినిమాను రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. 


మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ ఏడాది 'పెద్ది' సినిమా టీం ఒక స్పెషల్ వీడియో గ్లింప్స్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే సినిమాను వచ్చేయడాది చరణ్ పుట్టిన రోజుకు ఒక్కరోజు ముందు మార్చి 26న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని భావిస్తూ ఉందట.‌ అది సంగతి.


Also Read 'జీ తెలుగు'లో చామంతి టాప్... మరి, 'స్టార్ మా'లో? ఈ వీక్ టీఆర్పీ లిస్టులో టాప్ 10 సీరియల్స్ ఏవో తెలుసా?



'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె నయా అతిలోక సుందరి జాన్వి కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణకు ఆవిడ హైదరాబాద్ వచ్చారు. అప్పుడు అత్తమ్మ కిచెన్ ప్రొడక్ట్స్ జాన్వికి అందజేశారు చరణ్ సతీమణి ఉపాసన.


Also Readప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!






రామ్ చరణ్, జాన్వి కపూర్ జంటగా నటిస్తున్న పెద్ది సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, తెలుగు సీనియర్ హీరో జగపతి బాబు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ, సీరియల్ ఆర్టిస్ట్ అర్జున్ అంబటి తదితరులు కీలకపాత్రను పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకం మీద సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.