MP Avinash Reddy: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిప్డారు. కొదమ సింహం అని చెప్పుకుంటే సరిపోదని.. ప్రజలు చెప్పాలని అవినాష్ రెడ్డి అన్నారు. పదే పదే సింహం అని అనుకుంటే ప్రజలు భయస్థుడని అనుకుంటున్నారని సెటైర్లు వేశారు. పులివెందుల పర్యటనలో చంద్రబాబు అన్ని అబద్ధాలే చెప్పారని అవినాష్ రెడ్డి విమర్శించారు. రాయలసీమలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందే బాబు అన్న అవినాష్ రెడ్డి.. వాటి సందర్శనకు రావడానికి ఆయనకు ఉన్న ధైర్యం ఏంటో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడును 11 వేల క్యూసెక్కులకు వెడల్పు చేసింది వైఎస్సార్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఆరు జిల్లాలకు నీరు ఇచ్చేందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు, వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద మనిషి సాయంతో.. తనను, తన కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని అవినాష్ రెడ్డి ఆరోపించారు. దాంతో ముఖ్యమంత్రి జగన్ ను ఇబ్బంది పెట్టాలనేది చంద్రబాబు లక్ష్యమని ఎంపీ అన్నారు. పులివెందులను వైఎస్ జగన్ సర్కారు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 


కాగా.. తన పర్యటనలో భాగంగా చంద్రబాబు బుధవారం గండికోట రిజర్వాయర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా బాబుకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బాబు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించడం ఇదే తొలిసారి. పులివెందులలోని పూలఅంగళ్ల సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. పులివెందులలో వైఎస్ జగన్ పై తిరుగుబాటు మొదలైందని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల స్థానాన్ని వైఎస్ జగన్ నుంచి టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులను ఉద్దేశించి.. వై నాట్ పులివెందు అంటూ నినాదం చేశారు. రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన సాగునీటి ప్రాజెక్టులపై జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పులివెందుల, గండికోట, పైడిపాలెం, చిత్రావతికి నీళ్లు తెచ్చింది తెలుగుదేశం పార్టీనే అని.. బానకచెర్లకు గోదావరి నీటిని తీసుకువచ్చి సీమకు సరిపడా నీళ్లు అందించడమే తన ఆశయంగా చెప్పారు చంద్రబాబు. 


Also Read: Chikoti Praveen: బీజేపీలోకి క్యాసినో కింగ్! ఢిల్లీలో బండి సంజయ్‌ని, డీకే అరుణను కలిసిన చికోటి ప్రవీణ్


పులివెందుల ప్రజల్లో తిరుగుబాటు బాగా కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు. 'ఈ ముఖ్యమంత్రి కోసం మీరు విశాఖపట్నం వెళ్లాలా? అమరావతి అయితే నాలుగు గంటల్లో వెళ్లి వచ్చేయొచ్చు. పోలవారాన్ని కూడా నాశనం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి. 72 శాతం పూర్తిచేశా. నాకు తెలుసు ఆ బాధ. ఈ ముఖ్యమంత్రి వచ్చి రివర్స్ టెండరింగ్ అని చెప్పి అన్ని మార్చేశాడు. మూడేళ్లలో వర్షాలు తీవ్రంగా వచ్చి డయాఫ్రంవాల్, కాపర్ డ్యాం కూడా కొట్టుకుపోయాయి. కేంద్రం ఇచ్చిన నిధుల్ని ఈ దుర్మార్గుడు గోదాట్లో కలిపేశాడు. నేను వదిలిపెట్టను, నేను పట్టుకుంటే ఉడుం పట్టే. మళ్లీ పోలవరం కడతా. ఆ నీళ్లు బనకచర్లలో పోసి సస్యశ్యామలం చేస్తా. 


ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు గట్టిగా మాట్లాడుతున్నాడు. నీటి పారుదల ప్రాజెక్టులపై నేను వేసిన ప్రశ్నలపై మాట్లాడకుండా.. పవన్ కల్యాణ్ బ్రో సినిమాపై ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నాడు. నువ్వు మంత్రివా? లేదంటే బ్రో సినిమాలో యాక్ట్ చేసే బ్రోకర్ వా అని అడుగుతున్నా? హుందాతనం లేదు. పద్ధతి లేదు. మీరు ఒక సైకోని ఇచ్చారు. ఆయన సైకోల్ని తయారు చేస్తున్నాడు’’ అని చంద్రబాబు అన్నారు.