ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాయంత్రం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పలు పెండింగ్‌ అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా వంశధార నదిపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్ట్‌, కొఠియా గ్రామాల అంశాలు చర్చించే అవకాశం ఉంది.ఈ అంశాలపై ఇప్పటికే అధికారులు పూర్తి కసరత్తు చేశారు. నివేదిక రెడీ చేశారు. సీఎం కూడా సమీక్షలు నిర్వహించారు.


 





Also Read : కేంద్రంపై ఈ దూకుడు 14వ తేదీన చూపిస్తారా ? సదరన్ కౌన్సిల్ భే్టీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒక్కటవుతారా ?


ముఖ్యమంత్రి పర్యటన ప్రధాన ఉద్దేశం నేరడి బ్యారేజీ నిర్మాణంగా అధికారవర్గాలుచెబుతున్నాయి. రెండు రాష్ట్రాలకు కలిగే ప్రయోజనాలను నవీన్‌ పట్నాయక్‌కు జగన్ వివరించి ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. నేరడి నిర్మితమైతే రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్ట్ వివాదం రెండు రాష్ట్రాల మధ్య చాలా కాలంగా ఉంది. 1962లో ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మద్య 50 : 50 ప్రాతిపదికన వంశధార బేసిన్‌లో 115 టీఎంసీల నీటిని పంచుకునేందుకు ఒప్పందం జరిగింది. ఈ నీటిని తీసుకునేందుకు నేరడి వద్ద ప్రాజెక్ట్ కట్టాలని భావించారు కానీ  ఒడిశా ప్రభుత్వం నేరడికి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.


Also Read: కుప్పంలో ఎన్నికల టెన్షన్‌.. మున్సిపల్ కమిషనర్ కు పసుపు కుంకుమ అందజేసిన టీడీపీ నేతలు 


ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు వంశధార నదీ జలాలను సమానంగా పంచుతూ 2017 సెప్టెంబర్‌ 13న ట్రి బ్యునల్‌ తీర్పు ఇచ్చింది.  నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 108 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని, ఇందుకు ఏపీ ప్ర భుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ట్రిబ్యునల్‌  ఆదేశించింది.  బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన దామాషా పద్ధతిలో ఇరు రాష్ట్రాలు భరించాలని సూంచింది. అయినప్పటికీ ఈ భారం భరించేందుకు ఒడిశా ప్రభుత్వం సిద్ధంగా లేదు.  సీఎం జగన్ స్వయంగా వెళ్లి నవీన్ పట్నాయక్‌తో మాట్లాడి ఒప్పించాలని భావిస్తున్నారు. 


Also Read : టీటీడీలో కార్పొరేషన్ కలకలం... ఉద్యోగులకు పవన్ కల్యాణ్ బాసట... సుప్రీంతీర్పు ఉల్లంఘనంటూ విమర్శలు


రెండు రాష్ట్రాల మధ్య ఇటీవలి కాలంలో కొఠియా గ్రామాల సమస్య అంతకంతకూ పెరుగుతోంది. దీన్ని పరిష్కరించుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల నుంచి ఏడు గంటల వరకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తో చర్చలు జరిగే అవకాశం ఉంది.  


Also Read : ఎయిడెడ్‌ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి