కేంద్ర సాయుధ బలగాల కోసం ఆయుష్మాన్ భారత్-సీఏపీఎప్(Central Armed Police Forces) పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ పథకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా దశలవారీగా ఈ పథకం అమల్లోకి రానుంది. డిసెంబర్ 2021 నాటికి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 35 లక్షల కేంద్ర సాయుధ బలగాలకు ఆరోగ్యపర సేవలు అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.  


Also Read: డిప్యూటీ సీఎంకు ఐటీ శాఖ షాక్.. రూ.1000 కోట్ల విలువైన ఆస్తులు జప్తు!






అన్ని సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) అధికారులు, సిబ్బంది, అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సశత్రా సీమా బల్ (SSB), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( CISF), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సిబ్బంది, వారి కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న వైద్యులు ఈ డేటాను యాక్సెస్ చేయవచ్చు. వైద్యం అందించేందుకు CAPF వివరాలను తనిఖీ చేయవచ్చు. ఈ పథకం కింద ప్రతీ ఒక్క ఉద్యోగికి గుర్తింపు కార్డు ఇవ్వనున్నారు. ఈ పథకం కింద కేంద్ర సాయుధ బలగాల ఓపీడీ బిల్లులను కేంద్రం భరించనుంది. సాధారణ ప్రజలకు ఈ విధానం అందుబాటులో ఉండదు. ఈ పథకాన్ని అస్సాంలో పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. 


Also Read: 'ఐరిస్'ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆ దేశాలకు అండగా భారత్


కేంద్ర సాయుధ బలగాల ఆసుపత్రి బిల్లులను భారత ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ పథకం కింద సాధారణ ప్రజలకు రూ. 5 లక్షల వరకూ ఆరోగ్య సేవలు పొందవచ్చు. కానీ సీఏపీఎఫ్ లకు నగదు లిమిట్ లేదు. ఆయుష్మాన్ భారత్ సీఏపీఎఫ్ అనేది ఆయుష్మాన్ భారత్ PM-JAY IT ప్లాట్‌ఫారమ్‌లో అమలు చేస్తున్న పథకం. మొత్తం ఏడు సీఏపీఎఫ్ లు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత లేదా రీయింబర్స్‌మెంట్ ఆధారిత ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి ప్రారంభించారు. 


Also Read: కాంగ్రెస్‌కు కెప్టెన్ బైబై.. 'పంజాబ్ లోక్‌ కాంగ్రెస్' పేరుతో కొత్త జర్నీ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి