Facts About Sela Tunnel: ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండు వరసల Sela Tunnel ని ప్రారంభించారు. నిర్మాణ పరంగానే కాకుండా..వ్యూహాత్మకంగానూ ఈ సొరంగ మాత్రం ఎంతో ప్రత్యేకమైంది. దాదాపు 13 వేల అడుగుల ఎత్తులో ఈ సొరంగాన్ని నిర్మించారు. Border Road Organisation (BRO) ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.825 కోట్లు ఖర్చు చేసింది. ఈ ప్రాజెక్ట్‌లో రెండు టన్నెల్స్‌ని నిర్మించారు. Tunnel 1 పొడవు 1,003 మీటర్లు కాగా...Tunnel 2 పొడవు 1595 మీటర్లుగా ఉంది. ఇందులో రెండు రోడ్‌లు ఉన్నాయి. మొత్తం 8.6 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోజుకి కనీసం 2 వేల ట్రక్‌లు, 3 వేల కార్‌లు రాకపోకలు సాగించేలా పటిష్ఠంగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు దూసుకుపోయేలా ఏర్పాట్లు చేశారు. చైనా సరిహద్దు ప్రాంతంలో ఉన్న తవాంగ్‌ని అనుసంధానించనుంది ఈ టన్నెల్. ఏ వాతావరణాన్నైనా తట్టుకుని నిలబడగలగడం దీని స్పెషాల్టీ. తవాంగ్‌కి చేరుకునే సమయాన్ని దాదాపు గంట వరకూ తగ్గించగలుగుతుంది. 






LACకి భారత సైన్యం ఆయుధాల్ని, ఇతరత్రా భారీ పరికరాల్ని తరలించుకునేందుకు ఈ సొరంగ మార్గం ఎంతో ఉపకరించనుంది. అయితే...తవాంగ్‌కి అనుసంధానిస్తూ ఇప్పటికే  Balipara-Charidwar-Tawang Road ఉన్నప్పటికీ...మంచు కురవడం వల్ల ఎప్పుడూ ఆ రోడ్ బ్లాక్ అవుతూ ఉంటుంది. రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే...ప్రభుత్వం ఇలా సొరంగ మార్గ నిర్మాణాన్ని చేపట్టింది. సేలా పాస్‌కి సమీపంలో ఉన్న ఈ Sela Tunnel ప్రాజెక్ట్‌ భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 2019 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్ట్‌కి శంకుస్థాపన చేశారు. ఆ తరవాత కరోనా సంక్షోభం తలెత్తడం వల్ల నిర్మాణం ఆలస్యమైంది. 


ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటనలో భాగంగా కజిరంగ నేషనల్ పార్క్‌ని సందర్శించారు. అక్కడ జీప్‌ సఫారీతో పాటు ఏనుగంబారిపై ఊరేగారు. 1957 తరవాత ఈ నేషనల్ పార్క్‌ని సందర్శించిన తొలి ప్రధాని మోదీయే. కజిరంగ నేషనల్ పార్క్‌కి Unesco World Heritage Site గా గుర్తింపు కూడా దక్కింది. ముందు ఏనుగుపైకి ఎక్కి సవారీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ..ఆ తరవాత జీప్ సఫారీ కూడా చేశారు. ఆయనతో పాటు పార్క్ డైరెక్టర్ సోనాలీ ఘోష్‌, పలువురు అటవీ అధికారులున్నారు. ప్రస్తుతం ఈ సఫారీ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Also Read: బాయ్‌కాట్‌ ట్రెండ్‌తో చాలా నష్టపోయాం, భారత్‌ని క్షమాపణలు కోరుతున్నా - మాల్దీవ్స్ మాజీ అధ్యక్షుడు