Oscars 2024 Live Streaming: ఆస్కార్ అనేది సినీ పరిశ్రమలో పనిచేసే ప్రతీ ఒక్కరి కల. ఎలాగైనా ఏదో ఒకరోజు ఆస్కార్ స్టేజ్ ఎక్కాలని, ఆ అవార్డును తమ చేతులతో అందుకోవాలని చాలామందికి అనిపిస్తుంది. ఇక ఈ ఏడాది ఆ కల ఎవరికి నిజమవుతుందో తెలుసుకునే సమయం వచ్చేసింది. 96వ ఆస్కార్ అవార్డుల ప్రకటనకు సర్వం సిద్ధమయ్యింది. మార్చి 10న ఈ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది. అయితే చాలామంది మూవీ లవర్స్‌కు ఆస్కార్స్‌ను లైవ్ చూడాలని కోరిక ఉంటుంది. అలాంటి వారు తమ ఇంట్లో నుండే ఈ ఈవెంట్‌ను లైవ్ చూడవచ్చు. మరి, ఇండియాలో ఆస్కార్స్ వేడుకను ఎక్కడ, ఎలా చూడాలి?
ఈవెంట్ కోసం వెయిటింగ్..
అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో హాలీవుడ్‌కు చెందిన డాల్బి థియేటర్‌లో ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. నాలుగోసారి జిమ్మీ కిమ్మెల్.. ఈ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎంతోమంది హాలీవుడ్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ఈ ఈవెంట్‌కు హాజరు కానున్నారు. ఇప్పటికే క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన ‘ఓపెన్‌హైమర్’పైనే ప్రేక్షకుల దృష్టి ఎక్కువగా ఉంది. మొత్తం 13 కేటగిరిల్లో ఈ సినిమా పోటీపడుతోంది. దీంతో పాటు ‘బార్బీ’, ‘పూర్ థింగ్స్’, ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’కు కూడా పలు అవార్డులు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్ మాత్రమే కాదు.. ఇండియన్ మూవీ లవర్స్ కూడా ఈ వేడుకను వీక్షించాలని ఉత్సాహపడుతున్నారు.
తెల్లవారుజామునే..
అమెరికాలో ఆదివారం రాత్రి ఆస్కార్స్ వేడుక జరనుంది. అంటే సోమవారం తెల్లవారుజామున ఇండియన్స్ ఈ వేడుకను చూడగలరు. అందుకే ఉదయం 4 గంటల నుండే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ అవార్డ్ ఈవెంట్ స్ట్రీమ్ కానుంది. హాట్‌స్టార్‌తో పాటు స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ హెచ్‌డీ, స్టార్ వరల్డ్‌లో కూడా ప్రేక్షకులు ఈ అవార్డ్ వేడుకలను చూడవచ్చు. ఒకవేళ తెల్లవారుజామున ఈవెంట్‌ను చూడడం మిస్ అయినా కూడా అవే ఛానెల్స్‌లో మళ్లీ సాయంత్రం కూడా ఆస్కార్స్ రిపీట్ టెలికాస్ట్ కానుందని తెలుస్తోంది.
సిద్ధంగా ఉండండి..
ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆస్కార్స్ ఈవెంట్ స్ట్రీమింగ్ గురించి పోస్ట్ చేసింది. గ్లామరస్ మార్నింగ్‌కు సిద్ధంగా ఉండండి అంటూ మూవీ లవర్స్‌కు పిలుపునిచ్చింది. ఆస్కార్‌కు నామినేట్ అయిన చిత్రాలు అన్నింటినీ కలిపి ఒక రీల్‌ను క్రియేట్ చేసి షేర్ చేసింది. మార్చి 11న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఆస్కార్స్ 2024 లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది అంటూ ప్రకటించింది. ఇక ఇండియన్ మూవీ లవర్స్ సపోర్ట్ అంతా ఎక్కువగా ‘ఓపెన్‌హైమర్’కే ఉంది. హాలీవుడ్‌లో మాత్రమే కాదు.. ఇండియాలో కూడా క్రిస్టోఫర్ నోలాన్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా ఆయన తెరకెక్కించిన ‘ఓపెన్‌హైమర్’ ఇక్కడ కూడా భారీ కలెక్షన్స్‌ను సాధించింది.
Also Read: అమ్మతో కలిసి వంట చేసిన రామ్ చరణ్ - వీడియో షేర్ చేసిన ఉపాసన