విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు 7 రోజుల పాటు హోం క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కొవిడ్ సహా ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలను కేంద్రం కట్టుదిట్టం చేసింది. ఈ నెల 11 నుంచి ఆదేశాలు అమలులోకి రానున్నట్లు తెలిపింది.






రిస్క్ దేశాలు ఇవే..


ఐరోపా దేశాలు, దక్షిణాఫ్రికా, బ్రెజిల్​, చైనా సహా పలు దేశాలను రిస్క్​ దేశాలుగా కేంద్రం పేర్కొంది. అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా ఈ ఆంక్షలు వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. 


నిబంధనలు ఇవే..


కరోనా ముప్పు ఎక్కువ ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ టెస్ట్‌లు తప్పనిసరి.


ఫలితాల్లో నెగటివ్​ వస్తే వారు ఏడు రోజుల పాటు హోంక్వారంటైన్​లో ఉండాలి.


ఎనిమిదవ రోజు మరోసారి టెస్ట్​ చేయించుకోవాలి. ఆ ఫలితాలను ప్రయాణికులు ఎయిర్​ సువిధా పోర్టల్​లో అప్​లోడ్​ చేయాలి.


టెస్ట్​లో నెగటివ్​ వస్తే 7 రోజుల పాటు స్వీయ పర్యవేక్షణలో ఉండాలి.


ఒకవేళ పాజిటివ్​ వస్తే అధికారులు వారిని ఐసోలేషన్​కు తరలించి చికిత్స అందిస్తారు.


భారీగా పెరిగిన కేసులు..


దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒక్కరోజులో కొత్తగా లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,17,100 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 302 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. 30,836 మంది కరోనా నుంచి కోలుకున్నారు.



  • డైలీ పాజిటివిటీ రేటు: 7.74%.

  • యాక్టివ్ కేసులు: 3,71,363

  • మొత్తం రికవరీలు: 3,43,71,845

  • మొత్తం మరణాలు: 4,83,178 

  • మొత్తం వ్యాక్సినేషన్: 154.32 కోట్లు


Also Read: DigiLocker: యూనివర్సిటీలకు UGC కీలక ఆదేశాలు.. ఇక ఆ సర్టిఫికెట్లకు చెల్లుబాటు


Also Read: Covid Cases Today: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో అక్షరాల లక్ష కేసులు







ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి