Kerala High Court special bench  to hear cases of harassment  : మలయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల కేసుల వ్యవహారం రాను రాను ముదిరిపోతోంది . ప్రభుత్వం నియమించిన హేమ కమిటీ రిపోర్టు  బయటకు వచ్చిన తర్వాత ఆ కమిటీకి వాంగ్మూలం ఇచ్చిన వారు.. ఇవ్వని వారు కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి తమపై ఫలానా విధంగా వేధింపులు చోటు చేసుకున్నాయని ఆరోపించడం ప్రారంభించారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆరోపణలు కావడంతో.. సహజంగానే  జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హేమ కమిటీ రిపోర్టు తర్వతా కేరళ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించేవారు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో  కేరళ హైకోర్టు ప్రత్యేకంగా విచారణకు బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 




ఆ తమిళ దర్శకుడు ప్రైవేటు పార్టుల్లో రాడ్డు పెట్టి శునకానందం పొందేవాడు - కేరళ నటి సౌమ్య సంచలన ఆరోపణలు


హేమ క‌మిటీ రిపోర్టు వెలుగులోకి వచ్చిన తర్వాత  న‌మోదు అయిన ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్రత్యేక బెంచ్ ఉండాలన్న డిమాండ్ వచ్చింది. దీంతో కేరళ  హైకోర్టు మ‌హిళా జ‌డ్జీల‌తో కూడిన ప్ర‌త్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసింది.  నమోదైన కేసులనే కాకుండా... ఇదే అంశంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైతే వాటిపైనా విచారణ జరుపుతారు. కేరళ హైకోర్టులో  తాత్కాలిక చీఫ్ జ‌స్టిస్ ఏ మొహ‌మ్మ‌ద్ ముస్తాక్‌, జ‌స్టిస్ ఎస్ మ‌నుల‌తో కూడిన హైకోర్టు ధ‌ర్మాస‌నం గురువారం ఓ పిటీష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన సమయంలో  మ‌హిళా జ‌డ్జీల‌తో  బెంచ్  ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఏర్పడే బెంచ్‌లో జ‌స్టిస్ ఏకే జ‌య‌శంక‌ర‌న్ నంబిర్‌, జ‌స్టిస్ సీఎస్ సుధా ఉంటారు. ఈ క‌మిటీకి చెందిన పూర్తి వివ‌రాలను ప్రకటించనున్నారు.  


కేరళ సినీ పరిశ్రమలో కొద్ది రోజులుగా కలకలం రేగుతోంది. ఏడేళ్ల కిందట ఓ హీరోయిన్ ను.. మరో హీరో కిడ్నాప్ చేసి వేదించారని ఆరోపణలు వచ్చిన కారణంగా అసలు సినీ పరిశ్రమలో మహిళా నటుల స్థితిగతులు ఎలా ఉన్నాయో పరిశీలన చేసి రిపోర్టు ఇచ్చేందుకు అప్పటి ప్రభుత్వం హేమ కమిటీని నియమించింది. ఏడేళ్ల పాటు సుదీర్ఘంగా అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఇటీవలే హేమ కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక బ యటకు వచ్చిన తర్వాత ఇక అందరిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఈ కమిటీకి అభిప్రాయం చెప్పని వాళ్లు కూడా తమకు గతంలో ఎదురైన అనుభవాలను వివరిస్తున్నారు. 


సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’- కేరళ నాయకురాలి సంచలన వ్యాఖ్యలు


ఈ వివాదాలతో సతమతమవడం.. కొంత మంది నటులపై ఆరోపణలు రావడంతో.  కేరళ ఫిల్మ్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యవర్గం కూడా రాజీనామా చేసింది. ఇలా చేయడంపైనా విమర్శలు వస్తున్నాయి.మంచి  ప్రతిభావంతమైన సినిమాలు తీసే పరిశ్రమగా గుర్తింపు ఉన్న కేరళ ఇండస్ట్రీలో ఇలాంటి ఆరోపణలు రావడంతో.. ఇండస్ట్రీని నాశనం చేయవద్దని ముఖ్యులు కోరుతున్నారు.