ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు
సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్మీట్ పెట్టి ఆరోపించారు. కోనేటి ఆదిమూలంతో కలిసి ఆమె శృంగారంలో పాల్గొన్న దశ్యాలను విడుదల చేశారు. తన కుటంబాన్ని అంతం చేస్తానని బెదిరించి తనను లోబర్చుకున్నారని ఆమె ఆరోపించారు. తాము టీడీపీలో ఉంటామని.. కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే కావడంతో పలుమార్లు కలిశామని .. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని బెదిరించారన్నారు. కుటుంబాన్ని అంతం చేస్తామని బెదిరిచారన్నారు. ఎమ్మెల్యే బెదిరింపులు తట్టుకోలేక తాను పెన్ కెమెరాతో దృశ్యాలను రికార్డు చేశానని చెప్పారు. ఈ వివరాలను చంద్రబాబు,లోకేష్ కు లేఖ కూడా రాశానని అన్నారు. ఆదిమూలం లైంగిక వేధింపలపై సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని తెలియడంతో ఎమ్మెల్యేల పలుమార్లు ఫోన్ చేసి బెదిరించారని అందుకే మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడిస్తున్నానని చెప్పారు. ఇంకా చదవండి
ఏఐ సదస్సులో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
కొత్త ఆవిష్కరణలు ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తాయని.. సరికొత్త ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. హైదరాబాద్‌లోని (Hyderabad) హెచ్ఐసీసీలో రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 'గ్లోబల్ ఏఐ' సదస్సుకు (Global AI Summit) సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐ రోడ్ మ్యాప్ ఆవిష్కరించారు. ఈ సదస్సుకు వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలను పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఏర్పాటులో భాగస్వామ్యంలో సదస్సులో చర్చించారు. ఇంకా చదవండి
ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్
మావోయిస్టులకు గడ్డుకాలం ఉన్నట్టు ఉంది. వరుస ఎన్‌కౌంటర్లు వారికి కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయి. బుధవారం ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పదిమంది వరకు మృతి చెందారు. ఇప్పుడు తెలంగాణలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు హతమయ్యారు. ఇంకా చదవండి
హృదయ విదారకం - నడుము లోతు నీటిలో మృతదేహం తరలింపు
విజయవాడలో (Vijayawada) వరదలతో ఎటు చూసిన హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాలు ఇప్పుడిప్పుడే ముంపు నుంచి బయటపడుతున్నాయి. అటు, చిట్టినగర్ (Chitti Nagar) పరిధిలో ఓ 14 ఏళ్ల బాలుడి మృతదేహాన్ని నడుము లోతు నీటిలో తరలించడం ఆందోళన కలిగించింది. అదృశ్యమైన బాలుడు వరదల్లో విగతజీవిగా మారాడు. బాలుని మృతదేహాన్ని తరలిస్తోన్న సమయంలో ఆ తల్లి గుండెలవిసేలా రోదించిన దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. అటు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వం కోల్పోయి కొందరు పూర్తిగా నిరాశ్రయులయ్యారు. ఎలక్ట్రిక్ వస్తువులు, ఇంటి సామగ్రి పూర్తిగా ధ్వంసమయ్యాయని.. చాలా వరకూ ఫైనాన్స్ మీద తెచ్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ జీరో నుంచే ప్రారంభమయ్యాయని వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇంకా చదవండి
తెలుగు రాష్ట్రాల్లో ఎటు చూసినా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలే
వినాయక చవితి అనగానే వాడవాడలో సందడి నెలకొని ఉంటుంది. పండుగ ప్రారంభం నుంచి నిమజ్జనం చేసే వరకు చిన్నాపెద్ద తారతమ్యం లేకుండా ఆడుతూ పాడుతూ కులమతాలకు అతీతంగా వేడుకలు నిర్వహిస్తారు. అలాంటి వినాయక చవితి వేడుకలకు రెండు తెలుగు రాష్ట్రాలు సిద్దమవుతున్నాయి. ఇంకా చదవండి