Satyavedu MLA suspended : సత్యవేడు ఎమ్మెల్యేపై టీడీపీ చర్యలు - పార్టీ నుంచి సస్పెండ్

TDP MLA : సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఓ మహిళ ఆరోపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Continues below advertisement

Satyavedu MLA Koneti Adimoolam was suspended from TDP :  లైంగిక వేధింపుల వివాదంలో ఇరుక్కున్న సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుుకన్నారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశం పెట్టిన ఓ మహిళ..  సత్యవేడు ఎమ్మెల్యేతో ఏకాంతంగా ఉన్న దృశ్యాలు  బయట పెట్టారు. తనను వేధించి లోబర్చుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే తీరును తీవ్రంగా పరిగణించిన హైకమాండ్.. సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంంది.

Continues below advertisement

ఆరోపణలు వచ్చిన వెంటనే సస్పెండ్ చేసిన టీడీపీ

లైంగిక వేదింపులు చేసిన మహిళ కూడా టీడీపీకి చెందిన కార్యకర్తనేని చెబుతున్నారు. సొంత పార్టీ చెందిన మహిళా కార్యకర్తల్ని లైంగికంగా వేధించడాన్ని తెలుగుదేశంపార్టీ హైకమాండ్ సీరియస్ గా  తీసుకుంది. ముందు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విషయం తెలిసిన వెంటనే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబబుునాయుడు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. వివరణ అయినా .. సస్పెండ్ చేసిన తర్వాతనే తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు వెంటనే పల్లా శ్రీనివాసరావు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. 

గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కోనేటి ఆదిమూలం          

లైంగిక వేధింపుల ఆరోపణలను కోనేటి ఆదిమూలం ఖండిస్తున్నారు.  మహిళ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే.. కొన్ని మీడియా సంస్థలలుు ఆయనను సంప్రదించాయి. తెలుగుదేశం పార్టీ నేతలే తనపై కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. నిజానికి ఆయన తెలుగుదేశం పార్టీ తరుపనే గెలిచినా..  గత ఎన్నికల ముందు వరకూ వైసీపీలో ఉన్నారు. టిక్కెట్ రాకపోవడంతో టీడీపీలో చేరారు. టీడీపీ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. మూడు వేల ఓట్ల స్వల్ప తేడాతో ఆయన రెండో సారి విజయం సాధించారు. అంతకు ముందు రెండు సార్లు వైసీపీ తరపున  పోటీ చేశారు. 2019లో వైసీపీ తరపున గెలిచారు. 

టీడీపీ నేతలే కుట్ర చేశారని ఆదిమూలం ఆరోపణ                

ఆయన టీడీపీలో చేరడం.. సత్యవేడు స్థానిక టీడీపీ నేతలకు ఇష్టం లేకపోయింంది. ఆయనకు వ్యతిరేకంగా పని చేశారన్న ప్రచారం ఉంది. ఇప్పుడు వాళ్లే తనపై కుట్ర చేశారని అంటున్నారు. అంటే టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరాటంతోనే ఈ వివాదం బయటకు వచ్చిందని తెలుస్తోంది. పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా తెలియడంతో కోనేటి ఆదిమూలం  ఆజ్ఞాతంలోకి వెళ్లారు. ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. 

ప్రైవేటు వీడియోలు విడుదల చేసిన మహిళ                              

హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన మహిళ.. కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించి లొంగ దీసుకున్నారని ఆరోపించారు. పెన్ కెమెరా పెట్టుకుని రికార్డు చేశానని చెప్పారు. కొన్ని ప్రైవేటు వీడియోలు కూడా రిలీజ్ చేశారు. అందలో కోనేటి ఆదిమూలం శృంగారం దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ వ్యవహారంలో అసలేం జరిగిందో మొత్తం బయటకు రావాల్సి ఉంది. 

 

 

Continues below advertisement
Sponsored Links by Taboola