దళపతి విజయ్ (Thalapathy Vijay) కథానాయకుడిగా నటించిన సినిమా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' (The Greatest Of All Time Movie). ఇందులో ఆయన డ్యూయల్ రోల్ చేశారు. ఈ రోజు థియేటర్లలో విడుదల అయ్యింది. మరి, ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుంది? ఏ ఓటీటీలో సినిమా స్ట్రీమింగ్ అవుతుంది? అంటే...


నెట్‌ఫ్లిక్స్ ఓటీటీకి 'ది గోట్' స్ట్రీమింగ్ రైట్స్! 
The Goat Movie OTT Platform: ది గోట్... క్లుప్తంగా 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం'కు పెట్టిన పేరు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ఇంటర్నేషనల్ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. 'ది గోట్' ప్రదర్శిస్తున్న థియేటర్లలో తమ ఓటీటీ పార్ట్నర్ నెట్‌ఫ్లిక్స్ అని మూవీ టీం పేర్కొంది.


గాంధీ జయంతి సందర్భంగా ఓటీటీలో విడుదల!
'ది గోట్' సినిమాలో హీరో విజయ్ పేరు గాంధీ. మీరు గనుక ట్రైలర్ చూస్తే... ''చాలా మంది గాంధీ వేషాలు వేయడం చూశా. ఇప్పుడు గాంధీ వేషం వేయడం చూస్తున్నా'' అని విలన్ వేషధారి చెబుతాడు. సినిమాలో మహాత్మా గాంధీ - జవహర్ లాల్ నెహ్రూ - సుభాష్ చంద్ర బోస్ పేర్లు మీద కామెడీ ట్రాక్ కూడా ఉంది. ఇప్పుడీ సినిమాను గాంధీ జయంతికి డిజిటల్ రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలిసింది.


Also Readహీరోయిన్లూ... బాధ్యత ఉండక్కర్లా? అనన్య నాగళ్ళ, స్రవంతిని చూసి సిగ్గు పడండి - కోట్లు కావాలి, ప్రజల కష్టాలు పట్టవా?






థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేసేలా 'ది గోట్' నిర్మాతలు, నెట్‌ఫ్లిక్స్‌ మధ్య డీల్ కుదిరిందట. ఈ కారణంగానే పీవీఆర్, సినీ పోలీస్, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్ యాజమాన్యాలు నార్త్ ఇండియాలోని తమ స్క్రీన్లలో సినిమాను విడుదల చేయలేదు.



'ది గోట్'ను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేసింది. హైదరాబాద్ సిటీలో ఉదయం నాలుగు గంటల నుంచి స్పెషల్ షోలు వేశారు. అయితే, తెలుగు ఆడియన్స్ నుంచి సినిమాకు మిక్స్డ్ టాక్ లభించింది. తమిళనాట విజయ్ ఫ్యాన్స్, కమర్షియల్ మూవీ లవర్స్‌ను సినిమా మెప్పిస్తోంది. ఈ సినిమాలో విజయ్ సరసన స్నేహ, మీనాక్షీ చౌదరి నటించారు. ప్రభుదేవా, 'జీన్స్' ప్రశాంత్, అజ్మల్ అమీర్, జయరామ్, లైలా కీలక పాత్రల్లో కనిపించారు. ప్రేమ్ జి అమరన్, వైభవ్, వీటీవీ గణేష్ నటులు సినిమాలో ఉన్నప్పటికీ... కామెడీ అంతగా కుదరలేదు. బాక్సాఫీస్ బరిలో ఈ సినిమాకు ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.


Also Read'బిగ్ బాస్ 8'లోకి కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ... హైదరాబాద్‌లో పెరిగిన తమిళమ్మాయ్ బ్యాగ్రౌండ్ ఇదే