Tamil Director Put Rod Into Genitals For Entertainment : సినీ పరిశ్రమలో వేధింపులు ఎదుర్కోని మహిళలు అంటూ ఉండరేమో అన్నంతగా అనేక మంది నటీమణులు తమకు ఎదురైన వేధింపుల అనుభవాల్ని బయట పెడుతున్నారు. మలయాళ, తమిళ పరిశ్రమల్లో నటీమణులు దీనిపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. తాజాగా సీనియర్ నటి సౌమ్య సంచలన ఆరోపణలు చేశారు. తన కెరీర్ ప్రారంభంలో ఓ దర్శకుడు తన శునకానందం కోసం .. తన ప్రైవేటు పార్టులో రాడ్డు పెట్టేవాడని చెప్పారు. ఆ దర్శకుడు తనను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టారని గుర్తు చేసుకున్నారు.
విచారణ కమిటీకి ఆ దర్శకుడి పేరు చెబుతానన్న నటి సౌమ్య
అయితే సౌమ్య ఆ దర్శకుడు ఎవరు అన్నది మాత్రం బయట పెట్టలేదు. సౌమ్య కమిటీ తరహాలో ఏదైనా కమిటీ విచారణకు ఏర్పాటయితే.. వారి ముందు ఖచ్చితంగా వెల్లడిస్తానని చెబుతున్నారు. అయితే ఈ ఘటన ఇటీవల కాలంలో జరిగింది కాదు. మూడున్నర దశాబ్దాల కిందట జరిగింది. కెరీర్ మొదట్లో ఓ సినిమాలో నటించేందుకు సౌమ్య అంగీకరించారు. ఆ సినిమాలో మహిళా దర్శకురాలి పేరు ఉంటుంది. కానీ ఆ సినిమాను నిజంగా డైరక్ట్ చేసేది ఆమె భర్త. అ సినిమాలో సౌమ్యకు చాన్స్ వచ్చింది. చిన్న వయసు కాబట్టి.. తనను కూడా వాళ్లింటికి తీసుకెళ్లేవారని.. లైంగికంగా ఎలా కావాలంటే అలా వేధించేవారని వాపోయింది. తన ఆనందం కోసం.. ప్రైవేటు పార్టుల్లో రాడ్లు పెట్టేవారని కన్నీరు పెట్టుకుంది.
అల్లు అర్జున్ కు మరో ఆప్షన్ లేదా? నెక్ట్స్ మూవీ ఆ డైరెక్టర్ తో చేయక తప్పదా?
ఆ దర్శకుడు కుమార్తెపై ఆత్యాాచారం ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి
తనకు తొలి సినిమాలో చాన్స్ వచ్చినప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమేనని ఇంకా కాలేజీకి వెళ్తున్నానని .. కానీ ఆ దర్శకుడు సినిమా అవకాశం అని వస్తే ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారన్నారు. తన తల్లిదండ్రులకు అప్పట్లో సినిమా పరిశ్రమ గురించి పూర్తిగా తెలియదని సౌమ్య తెలిపారు. తన ఇంటికి సమీపంలోనే నివసించే నటి రేవతిని చూసి స్ఫూర్తి పొందానని సినీ పరిశ్రమలోకి వెళ్తే అమెలా అవ్వొచ్చని ఆశపడ్డానని సౌమ్య చెబుతున్నారు. అదే దర్శకుడు తర్వాత తన సొంత కుమార్తె పై అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొని.. ర్వాత సెటిల్ చేసుకున్నారని హింట్ కూడా ఇచ్చారు.
'ది గోట్' రివ్యూ: తండ్రి పాలిట కన్న కొడుకే విలన్ అయితే... విజయ్ సినిమా హిట్టా? ఫట్టా?
సినీ పరిశ్రమలో పెరుగుతున్న మీ టూ వాయిస్
అప్పట్లో తన అసహాయతను ఆసరాగా చేసుకుని తనను ఓ శృంగార బానిసలా చేసుకునే ప్రయత్నం చేశాడని సౌమ్య గుర్తు చేసుకున్నారు. ఎంత ఆలస్యమైనా తమను లైంగిక వేధింపులకు గురి చేసిన వారిపై నోరెత్తాలని సౌమ్య పిలుపునిచ్చారు.