Today Top Headlines In AP And Telangana: 


బీజేపీలో శంఖారావ ఉత్సాహం


హైందవశంఖారావం లాంటి ప్రోగ్రామ్‌ను మరొకటి ప్లాన్ చేస్తోంది బీజేపీ. విజయవాడలో వీహెచ్‌పీ నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో బీజేపీ ముఖ్యనేతల పాత్ర చాలానే ఉంది. అందుకే ఇప్పుడు నేరుగా వారి ఆధ్వర్యంలో మరో భారీ కార్యక్రమం చేపట్టనున్నారు. అంతే కాకుండా హైందవశంఖారావంలో గళమెత్తినట్టు ఆలయాలను ప్రభుత్వాల నుంచి తప్పించి స్వతంత్ర సంస్థలుగా ఉంచేందుకు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కేంద్రంలో కూడా పూర్తి మెజార్టీ ఉన్నందున ఈ ప్రక్రియ చేపట్టడానికి అభ్యంతరం లేదని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా చదవండి.


రేసు పోయి రోడ్డు వచ్చె


బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెడకు మరో కేసు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన ఫార్ములా ఈ రేసు కేసులో ఇరుక్కొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఏసీబీకి ఫిర్యాదు అందింది. బీసీ రాజకీయ ఐకాస అధ్యక్షుడు యుగంధర్ గౌడ్ ఈ ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఫార్ములా ఈ రేసులో విచారణకు హాజరు కావాలని కేటీఆర్‌కు ఓవైపు ఏసీబీ, మరోవైపు ఈడీ నోటీసులు జారీ చేస్తోంది. ఇంకా చదవండి.


ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపట్టింది. ఇంటర్ ఫస్టియర్ బోర్డ్ ఎగ్జామ్స్‌ను తొలగించింది. ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్లో సంస్కరణలు చేపడుతున్నాం. ఇంటర్ విద్యలో చాలా కాలంగా సంస్కరణలు జరగలేదు. అందులో భాగంగానే ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు రద్దు చేస్తున్నాం. ఇకపై రెండో సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు మాత్రమే బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. నేషనల్‌ కరికులం చట్టాన్ని అనుసరించి ఈ మార్పులు చేస్తున్నారు. ఇంకా చదవండి.


కేంద్రమంత్రి బండి సంజయ్‌ వినతులు 


కరీంనగర్ జిల్లాలో ఒక టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని  కేంద్రాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో ఈ యూనివర్సిటీ కేటాయించాలని కోరారు. ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో సమావేశమైన బండి సంజయ్‌ ఒక వినతి పత్రం ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కోర్సులు చేసే విద్యార్థులకు టెక్నికల్ యూనివర్సిటీ వల్ల నైపుణ్య అభివృద్ధి, టెక్నికల్ విద్య లభిస్తుందని అభిప్రాయపడ్డారు. మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న పీవీ నర్సింహారావు స్వస్థలం వంగరలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కూడా  కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇంకా చదవండి.


కుంభమేళాకు శ్రీనివాసుడు


ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగబోయే మహా కుంభమేళా కోసం తిరుమల శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది. TTD ఛైర్మన్ బీఆర్‌ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక పూజలు చేసి రథాన్ని పంపించారు. జనవరి 13 కుంభమేళా ప్రారంభం రోజు నుంచి ఫిబ్రవరి 26 కుంభమేళా పూర్తయ్యే వరకు ఈ రథం అక్కడే ఉండబోతోంది. ఉత్తరాధి భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం అందించేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేశామని టీటీడీ ఛైర్మన్ బీఆర్‌ నాయుడు చెప్పారు. అక్కడ కూడా తిరుమల తరహాలోనే 170 మందితో శ్రీనివాసుడికి అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామన్నారు. ఇంకా చదవండి.