75th Independence Day: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ భారీ ఉగ్రదాడులు చేసేందుకు లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలు ప్లాన్ చేస్తున్నాయని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. దిల్లీ పోలీసులు హై అలర్ట్‌లో ఉండాలని సూచిస్తూ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉగ్రదాడులు జరిగే అవకాశాలపై 10 పేజీల రహస్య నివేదికను పంపింది.
ఆ ప్రాంతాల్లో
జన సందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలపై నిఘా వేయాలని ఐబీ సూచించింది. దిల్లీ పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ప్రకటించింది. ప్రధాన ప్రాంతాల్లో కీలక నేతలపై దాడులు చేయాలని పాక్ ఐఎస్ఐ.. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదులను కోరినట్లు సమాచారం ఉందని ఐబీ తెలిపింది.
అఫ్ఘానిస్థాన్ ఉగ్రవాది నేతృత్వంలో లష్కరే ఖల్సా పేరిట పాక్ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసిందని, ఆ సంస్థ ఉగ్రవాదులు జమ్ముకశ్మీరులో పెద్ద ఉగ్రదాడికి పాల్పడే అవకాశముందని ఐబీ వివరించింది.
ఇలా దాడులు
లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు పారాగ్లైడర్స్, డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడే అవకాశముందని ఐబీ తెలిపింది. దీంతో బీఎస్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. టిఫిన్ బాంబులతో కూడా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశముందని పేర్కొంది.
మోదీ పిలుపు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్ట్ 2-15వ తేదీ వరకూ సోషల్ మీడియా డీపీలో దేశ జెండాను పెట్టుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. కొందరు ఇప్పటికే ప్రధాని పిలుపు మేరకు డీపీలు మార్చుకున్నారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ కూడా తన ట్విటర్ డీపీ మార్చుకుంది. కేవలం త్రివర్ణ పతాకాన్ని పెట్టుకుంటే చర్చే ఉండేది కాదు. కానీ...నెహ్రూ
జాతీయ జెండాను ఆవిష్కరించినప్పటి ఫోటోను డీపీగా పెట్టుకుంది. సీనియర్ కాంగ్రెస్ నేతలు అందరూ ఇదే డీపీని పెట్టుకుంటున్నారు.
Also Read: Chief Justice of India: తదుపరి CJIగా జస్టిస్ యూయూ లలిత్- ఇక సుప్రీం కోర్టు 9 గంటలకే మొదలా?
Also Read: Rahul Gandhi Karnataka Mutt: రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు: స్వామీజీ జోస్యం