Rahul Gandhi Karnataka Mutt: రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు: స్వామీజీ జోస్యం

ABP Desam   |  Murali Krishna   |  04 Aug 2022 12:48 PM (IST)

Rahul Gandhi Karnataka Mutt: రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కర్ణాటకకు చెందిన హవేరి హోసముట్ స్వామీజీ జోస్యం చెప్పారు.

(Image Source: Twitter/@RahulGandhi)

Rahul Gandhi Karnataka Mutt: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కర్ణాటకకు చెందిన ఓ స్వామీజీ. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని హవేరి హోసముట్​ స్వామీజీ జోస్యం చెప్పారు. కర్ణాటక చిత్రదుర్గలోని శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠ్‌ను రాహుల్‌ గాంధీ సందర్శించిన సందర్భంగా ఆ స్వామీజీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇందిరా గాంధీ ప్రధానిగా పనిచేశారు. రాజీవ్​ గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. ఇప్పుడు రాహుల్ ​గాంధీ లింగాయత్​ శాఖలోకి ప్రవేశించారు కాబట్టి ఈయన కూడా పీఎం అవుతారు.                                   - హవేరి హోసముట్​ స్వామీజీ 

అయితే ఇంతలోనే జోక్యం చేసుకున్న మఠాధిపతి శివమూర్తి.. అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్వామీజీని అడ్డుకున్నారు. ఇది రాజకీయ వేదిక కాదని, ప్రజలే దానిని నిర్ణయిస్తారని చెప్పారు.

రాహుల్ దీక్ష

రాహుల్‌ గాంధీ శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠ్‌ను సందర్శించి మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుఘ శరణరు నుంచి 'ఇష్టలింగ దీక్ష' ను స్వీకరించారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ ట్విట్టర్‌లో వెల్లడించారు. అయితే సాధారణంగా లింగాయత్ ​సామాజిక వర్గానికి చెందినవారు మాత్రమే ఈ ఆచారాన్ని పాటిస్తారు.

హుబ్బళ్లిలో కాంగ్రెస్​ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశం కోసం రాహుల్ గాంధీ మంగళవారమే కర్ణాటక చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ జగద్గురు మురుగరాజేంద్ర విద్యాపీఠ్‌ను సందర్శించారు.

Also Read: Corona Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- కొత్తగా 19 వేల మందికి వైరస్

Also Read: National Herald Case: నేషనల్ హెరాల్డ్ కార్యాలయం సీజ్ చేసిన ఈడీ - మనీలాండరింగ్ కేసులో కీలక అడుగు !

Published at: 04 Aug 2022 11:37 AM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.