Corona Cases: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు- కొత్తగా 19 వేల మందికి వైరస్

Corona Cases: దేశంలో కొత్తగా 19,893 కరోనా కేసులు నమోదయ్యాయి. 53 మంది మృతి చెందారు

Continues below advertisement

Corona Cases: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 19,893 కరోనా కేసులు నమోదయ్యాయి. 53 మంది మృతి చెందారు. పాజిటివిటీ రేటు 4.94 శాతంగా నమోదైంది.

Continues below advertisement

కొవిడ్​ నుంచి తాజాగా 20,419 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.50 శాతానికి పెరిగింది. యాక్టివ్ కేసులు 0.31శాతంగా ఉన్నాయి.

  • మొత్తం కేసులు: 4,40,19,811
  • మొత్తం మరణాలు: 5,26,530
  • యాక్టివ్​ కేసులు: 1,36,478
  • మొత్తం రికవరీలు: 4,34,24,029

వ్యాక్సినేషన్

దేశంలో కొత్తగా 38,20,676 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 205.22 కోట్లు దాటింది. మరో 4,03,006 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రిపోర్ట్‌లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని కేంద్రం.. రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వ్యాక్సినేషన్‌లో మరో కొత్త మైలురాయిని చేరింది భారత్. దేశవ్యాప్తంగా 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Also Read: National Herald Case: నేషనల్ హెరాల్డ్ కార్యాలయం సీజ్ చేసిన ఈడీ - మనీలాండరింగ్ కేసులో కీలక అడుగు !

Also Read: Privacy Bill : వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు ఉపసంహరణ - కేంద్రం కీలక నిర్ణయం !

Continues below advertisement
Sponsored Links by Taboola