ఖుషి అనుకున్నట్టుగానే యష్, వేద ఏకాంతంగా ఉంటారు. రెడీ అయిందంతా వెస్ట్ అయిపోయిందే అని వేద అంటుంటే యష్ తల బాదుకుంటాడు. కాసేపు టీవీ చూద్దామనుకుని యష్ టీవీ పెడితే అన్ని ఛానల్స్ లోనూ రొమాంటిక్ సాంగ్స్ వస్తూ ఉంటాయి దాంతో వేద కోపంగా టీవీ ఆపేస్తుంది. వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు వస్తారో ఇప్పుడు ఎలా అని వేద దిగాలుగా మొహం పెట్టేస్తుంది. తర్వాత ఇదంతా యష్ చేసి ఉంటాడని వేద అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావ్ ఇదంతా నేనే చేశానని, మనం ఇద్దరం ఇంట్లో ఉన్నప్పుడు బయట తాళం వేసి వెళ్ళమని వసంత్ కి నేనే చెప్పానని అనుకుంటున్నావా అని యష్ అంటుంటే ఏమో.. ఏమో.. అంటూ వేద అనుమానంగా సమాధానం చెప్తుంది. నీకు అంతా సీన్ లేదులే పొమ్మని యష్ అంటాడు.


Also Read: జానకి వాయనం తీసుకోకుండా వెళ్ళిన జ్ఞానంబ- సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన గోవిందరాజులు


అభిమన్యు, మాళవిక ఖైలాష్ దగ్గరకి వస్తారు. నువ్వు కాంచన భర్తవి కదా.. యశోధర్ కి నీకు అసలు ఏం జరిగింది అని ఖైలాష్ ని అడుగుతాడు అభి. తెలుసుకుని ఏం చెయ్యాలో అని వెటకారంగా అడుగుతాడు. సీన్ మళ్ళీ వేద, యష్ దగ్గరకి వెళ్తుంది. "లైఫ్ ఈజ్ బ్యూటిఫిల్ అంటారు కదా నిజంగా లైఫ్ ఈజ్ సో బ్యూటీఫుల్.. ఎక్కడో పుడతాం, ఎక్కడో పెరుగుతాం, ముక్కు మొహం తెలియని ఒక అమ్మాయి ఒక అబ్బాయి అప్పుడే కలుసుకుని భార్యాభర్తలు అవుతారు విచిత్రం కదా" అని యష్ అంటాడు. 'ఆడపిల్ల జీవితం మరి విచిత్రం. తన భర్త గురించి ఎన్నో కలలు కంటుంది. కానీ అమ్మ వాళ్ళు చూపించిన వ్యక్తిని పెళ్ళాడి తానే సర్వస్వం అనుకుంటుంది. పుట్టింటిని వదిలి పెట్టి తన కోసం వచ్చేస్తుంది చాలా విచిత్రం కదా' అని వేద అంటుంది. 'ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు వేద ఎవరో ఒకరిద్దరు మాళవిక లాంటి వాళ్ళు ఉంటారు. కానీ తన భర్త కోసం అత్తవారింటి కోసం ఎంత తాపత్రయపడుతుంది, ఎన్ని త్యాగాలు చేస్తుంది విమెన్ ఆర్ గ్రేట్ వేద.. నువ్వు గ్రేట్ వేద' అని అంటాడు.


“కేవలం ఖుషికి అమ్మని అవడం కోసం ఒక ఒప్పందం చేసుకుని యశోధర్ ని పెళ్లి చేసుకున్నాను కానీ ఎంటో ఈ రోజు యశోధర్ తో మానసిక అనుబంధం ఎందుకు ఏర్పడుతుంది. తల్లిగా ఆలోచించాల్సిన నేను భార్యగా ఎందుకు ఆలోచిస్తున్నాను, భార్యగా ఎందుకు తాపత్రయపడుతున్నాను. మనసు గాయపడి పుట్టింటికి వెళ్ళాను కానీ క్షణ క్షణం నేను ఎందుకు నా భర్తకి దూరం అయిపోయాన అని అనిపించింది. భర్త గురించి ఆరాటపడిపోయాను. ఆ రోజు అద్దం మీద ఐ మిస్ యూ అని రాశాను అది కేవలం అద్దం మీదే రాశానా లేక నా గుండెల మీద రాసుకున్నాన. నా అన్నీ ఫీలింగ్స్ నా భర్త గురించే అసలు నాకేం కావాలి. నా భర్త నుంచి ఏం కోరుకుంటున్నాను” అని వేద మనసులోనే ఆలోచిస్తుంటుంది.


Also Read: రుక్మిణి ఇంటికి వచ్చిన భాగ్యమ్మ- తల్లిని చూసి ఆనందపడిన రుక్కు, ఆదిత్యకి క్లాస్ పీకిన సత్య


“నా లైఫ్ లోనే ఇంకొక ఆడదానికి చోటు ఇవ్వకూడదు అనుకున్నాను. ఎడారిలాంటి నా జీవితంలోకి ఒయాసిస్ లాంటి వేద రావడం ఏంటి నేను పోగొట్టుకున్నవన్ని నాకు తిరిగి కావాలని అనిపించడం ఏంటి.. నా లైఫ్ లో మళ్ళీ ఒక కొత్త హ్యపీనెస్ తీసుకురావడం ఏంటి.. వేద ఖుషికి తల్లి మాత్రమే అని అనుకున్నాను కదా వేద నాకు భార్య కూడా అని కొత్తగా అనిపించడం ఏంటి.. నా మనసుని కదిలించడం ఏంటి నా గుండె కుదిపెయ్యడం ఏంటి మాళవిక వల్ల నాకు కలిగిన బాధకంటే వేద వల్ల వెయ్యి రేట్లు సంతోషం నేను పొందుతున్నాను, వేద నా సొంతం అనిపించేలా ఇంత మార్పు ఎందుకు వస్తుంది. మా ఇద్దరి మధ్య శారీరక సంబంధం లేకపోయినా మానసిక బంధం మొదలైందా మా జీవితాల్లో ఒక కొత్త అధ్యాయానికి పునాది పడిందా” అని యష్ అనుకుంటాడు.


Also Read: సామ్రాట్ ముందు నందుని ఇరికించిన లాస్య- సామ్రాట్ తో కలిసి వంట చేసిన తులసి


మళ్ళీ సీన్ ఖైలాష్ దగ్గరకి వస్తుంది. అసలు నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారని అభి అడుగుతాడు. అమ్మాయిని పటాయించి తీసుకొచ్చాడు అని అక్కడి పోలీస్ చెప్తాడు. ఆ రీజన్ తో కూడా అరెస్ట్ చేస్తారా అది చాలా కష్టమైన జాబ్ అని అభి అంటాడు. వాళ్ళందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను అలాంటి వాడిని కాదు ఖైలాష్ అంటాడు. యష్ ఇంట్లో తమరి టాలెంట్ ఏదో గట్టిగా చూపించి ఉంటారు వాడికి కాలి నిన్ను స్టేషన్లో పెట్టించి ఉంటాడు అని అభి అంటే అవును కొంచెం ఇంచుమించు అదే అని ఖైలాష్ కూడా అంటాడు. ఎస్సై గారు ఇతన్ని నా పేరు మీద రిలీజ్ చెయ్యండి అని అభి అంటే కుదరదు ఇది చాలా టఫ్ కేసు అని పోలీస్ చెప్తాడు. ఆ యశోధర్ మీద నా పగ తీరాలి.. అతన్ని సర్వనాశనం చేసేదాక నిద్రపోను అని ఖైలాష్ కోపంతో రగిలిపోతాడు. నిన్ను నేను ఎలాగైనా బయటకి తీసుకొని వస్తానని అభి అంటాడు.