మల్లిక చేతిలోని అమ్మవారి విగ్రహం తీసుకుని జానకి పూజకి సిద్ధం చేస్తుంది. అది చూసి మల్లిక ఏడుస్తుంది. పూజారి పూజ మొదలుపెడదాం ఇంటి పెద్ద కొడుకు, కోడలిని వచ్చి పీటల మీద కూర్చోమని చెప్తాడు. కానీ జ్ఞానంబ మాత్రం చిన్న కొడుకు, కోడలు చేస్తారని అంటుంది. పూజారి మాత్రం పెద్ద కొడుకు, కోడలు చెయ్యడం ఆనవాయితీ అంటాడు. కానీ మల్లిక మాత్రం ఆచారాలేవీ ఆకాశం నుంచి ఊడిపడినవి ఏమి కాదు కదా మేమే చేస్తాం అని విష్ణుని తీసుకుని వచ్చి పీటల మీద కూర్చుంటుంది.  మల్లిక పూజలో కూర్చుని తింగరిగా మాట్లాడుతుంటే జ్ఞానంబ పూజారి చెప్పినట్టు చెయ్యి అని తిడుతుంది. అమ్మవారికి మంగళ స్తోత్రం సమర్పించమని పూజారి అడిగేసరికి మల్లిక బిత్తర మొహం వేస్తుంది. గోవిందరాజులు వెటకారంగా ఎమ్మా రావా అంటాడు. మనకి తాలింపులు మీద ఉన్న శ్రద్ధ దేవుడి మీద ఎందుకు ఉంటుందని కౌంటర్ వేస్తాడు. అమ్మా జానకి వ్రతానికి ఒక పరిపూర్ణత వస్తుంది నువ్వు ఒక పాట పాడమ్మా అని గోవిందరాజులు చెప్తాడు. పూజారి కూడా మంగళ హారతితోనే అమ్మవారు ప్రసన్నురాలు అవుతుంది పాడమని చెప్పడంతో జానకి పాట పాడుతుంది. చాలా అద్భుతంగా పాడావని అందరూ మెచ్చుకుంటారు.


Also Read: రుక్మిణి ఇంటికి వచ్చిన భాగ్యమ్మ- తల్లిని చూసి ఆనందపడిన రుక్కు, ఆదిత్యకి క్లాస్ పీకిన సత్య


చూసి రాసిన పరీక్ష పాసు కానట్టు పెత్తనం నాకు వచ్చినా సరే పేరు మాత్రం పెద్ద కోడలే కొట్టేసిందని మల్లిక కుళ్ళుకుంటుంది. ఇక పూజ పూర్తైన తర్వాత వాయనాలు ఇచ్చి మల్లిక అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. జానకిని కూడా వాయనం ఇవ్వమని గోవిందరాజులు చెప్తాడు. జానకి వాయనం తీసుకోకుండా జ్ఞానంబ పక్కకి వెళ్తుంది. తొమ్మిది మంది ముత్తైదువులకి ఇవ్వాలమ్మా మీ అత్తయ్యకి కూడా వాయనం ఇస్తే తొమ్మిది మందికి ఇచ్చినట్టు అవుతుంది అప్పుడు వ్రత ఫలితం దక్కుతుందని గోవిందరాజులు జానకికి చెప్తాడు. అక్కడ జ్ఞానంబ లేకపోవడంతో గోవిందరాజులు తనదగ్గరకి వస్తాడు. ఇక్కడ ఉన్నావేంటి జ్ఞానం అని అడుగుతాడు. పిల్లలు సుఖసంతోషాలతో ఉండాలని ఇంట్లో వ్రతం చేయించాను అక్కడా నా అవసరం తిరిపోయింది అందుకే వచ్చేశాను అని అంటుంది. లేదు జ్ఞానం నువ్వు జానకి ఇచ్చే వాయనం తీసుకోకుండా ఎలా పూర్తవుతుందని అంటాడు.


Also Read: సామ్రాట్ ముందు నందుని ఇరికించిన లాస్య- సామ్రాట్ తో కలిసి వంట చేసిన తులసి


నీ ఆశీస్సులు వాళ్ళకి అందించాలి. అప్పుడే నీ బాధ్యత పూర్తయినట్టు అని చెప్తాడు. వచ్చిన వారికి వాయనం ఇచ్చింది కదా సరిపోతుంది నేను తీసుకోకపోయినా ఏమి కాదులే అంటుంది. సరిపోదు తొమ్మిది మంది ముత్తైదువులకి ఇస్తేనే వ్రత ఫలితం దక్కుతుంది, అమ్మలా నువ్వు వాళ్ళని ఆశీర్వదించాలి. అప్పుడే వారికి వ్రత ఫలితం దక్కుతుంది అని సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. ‘నువ్వు క్షమిస్తేనే వాళ్ళు ఆ నరకం నుంచి బయటకి రాగలరు. జానకి తన వరలక్ష్మి వ్రతం చేస్తుంది తన శుభాగ్యం కోసం అంటే తన భర్త క్షేమంగా ఉండాలని అంటే నీ కొడుకు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని.. మరి నీ కొడుక్కి నువ్వే ఆశీస్సులు ఇవ్వకపోతే ఎలా.. నీకు బాధగా లేదా, నీకు ప్రాణానికి ప్రాణమైన నీ కొడుకు విషయంలో నీ గుండె అంతగా బండగా మారిపోయిందా అని అడుగుతాడు. నా మనసులో ఎంత బాధ ఉందో నాకే తెలుసు నా బిడ్డని ఆశీర్వదించలేకపోతున్నందుకు ఎంతలా బాధపడుతున్నానో నాకే తెలుసు అని జ్ఞానంబ అంటుంది. మరి అంతగ్గా బాధపడుతున్నాదానివి వాయనం తీసుకుని వాళ్ళని ఆశీర్వదించొచ్చు కదా’ అని అంటాడు. ఎలా ఆశీర్వదించగలను వాళ్ళు నాకు కనిపిస్తేనే వాళ్ళు నాకు చేసిన మోసమే గుర్తుకు వస్తుంది, నేను ఇచ్చే ఆశీస్సులకి విలువే ఉంటే ఇలా చేస్తారా అని అడుగుతుంది. వాళ్ళు చేసింది తప్పే కానీ వల్లఅని క్షమించలేవా అని గోవిందరాజులు నచ్చజెప్పదానికి ప్రయత్నిస్తాడు.