భాగ్యమ్మ, దేవి కలిసి మాట్లాడుకుంటూ వస్తారు. మాయమ్మ చాలా మంచిది పక్క వారి గురించి తప్ప తన గురించి ఆలోచించదు మాయమ్మని బాగా చూసుకో అని దేవి భాగ్యమ్మకి చెప్తుంది. నిన్ను మీ అమ్మ ఎట్లా చూసుకుంటుందో నేను మీ అమ్మని అలాగే చూసుకుంటా అని భాగ్యమ్మ అంటుంది. మగరాయిడిలాగా ఇట్లా కొట్లాట డ్రస్ వేసుకున్నావ్ ఎందుకు అని అడుగుతుంది. కరాటే నేర్చుకోవాలి నాకు కోట్లటతో మస్త్ పని ఉందని చెప్తుంది. నిన్ను ఎవరైనా అన్నారా చెప్పు బిడ్డ ఉరికించి ఉరికించి కొడతా అని అంటుంది. కాదు నేనే కొట్టాలి అని దేవి అంటే ఎవర్ని అని భాగ్యమ్మ అడుగుతుంది. మా నాయన్ని.. మాయమ్మని మస్త్ కష్టపెట్టాడు, తాగేసి వచ్చి రోజు కొట్టేవాడంటా మాయమ్మ రోజు ఏడుస్తాది అని దేవి బాధగా అంటుంది. ఆ మాటలకి బాధగా అదేంటి బిడ్డ నాయన్ని కొట్టవచ్చా తప్పు కదా అని అంటుంది. మాయమ్మని కొట్టి తిట్టేవాడిని విడిచిపెట్టలా మానాయన్ని ఉరికించి ఉరికించి కొడతా అని కోపంగా అంటుంది. రుక్కవ్య నీ బిడ్డ మనసులో ఇంత విషం నింపాడు ఎట్లా చెప్పాలో అర్థం కావడం లేదని భాగ్యమ్మ బాధపడుతుంది.
దేవుడమ్మ రుక్మిణి ఫోటో చూస్తూ బాధపడుతుంది. ఏంటి రుక్మిణి ఇలా చేస్తున్నావ్ అత్తమ్మ అత్తమ్మ అని బాగా ఉండేదానివి ఇప్పుడు ఏమైపోయింది ఆ ప్రేమ అంతా.. నువ్వే బతికే ఉన్నావు ఈ ఇంటి వారసత్వం నీ వేలు పట్టుకుని నడుస్తుందని తెలిసి ఎంత ఆనందపడ్డానో తెలుసా.. నువ్వు గడప దాటినప్పటి నుంచి ఈ ఇంటి ఆనందం నీతో పాటే వచ్చేసింది, నీకోసం నేను నా బిడ్డ అల్లడిపోతున్నాం, నువ్వు తిరిగి వస్తావని ఆశగా ఎదురు చూస్తున్నాం నువ్వు ఎక్కడ ఉన్నావో కూడా తెలియడం లేదని దేవుడమ్మ చాలా బాధపడుతుంది.
నేను ఎవరి పోలిక చూడటానికి ఎవరిలా ఉంటాను అని దేవి రుక్మిణి అడుగుతుంది. నువ్వు మీ నాయన లెక్క ఉంటావ్.. నీ ముక్కు మొహం అంతా మీ నాయనాలెక్కే ఉంటది.. నిన్ను చూస్తే నా పెనీమిటిని చూసినట్టే ఉంటది అని రుక్మిణి సంతోషంగా చెప్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అడిగావ్ అని దేవిని అడుగుతుంది. నా ముక్కేనా ఇంకేం పోలికలు ఉంటాయి చెప్పమ్మా అని అడుగుతుంది.. కానీ రుక్మిణి చెప్పకుండా అదంతా ఎందుకు అనేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇక సత్య ఆదిత్య అన్న మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటే దేవుడమ్మ వచ్చి ఏమైందని అడుగుతుంది. అమెరికా వెళ్లాలన్న ఆలోచన పూర్తిగా వదిలేద్దామని అనుకున్నా అని సత్య అంటుంది. అదేంటి కొన్నాళ్ళ తర్వాత వెళ్దామని ఆదిత్య చెప్పాడు కదా అంటుంది. వాడి సమస్యలు వాడికి ఉన్నాయి కానీ అవి మనకి చెప్పకుండా లోలోపల బాధపడుతున్నాడని చెప్తుంది. తండ్రి కావాలని వాడికి మాత్రం ఉండదా అంటుంది. వచ్చి ప్రయోజనం ఏంటి డాక్టర్స్ ఇచ్చే మందులు ఆదిత్య మింగాలి కదా.. ఆదిత్యకి ఇంటి ఆలోచనలు బయటే ఉంటున్నాయి, ఇంటి గురించి ఆలోచించడమే లేదు. అందుకే నేను అమెరికా వెళ్లాలని అనుకోవడం లేదని సత్య బాధగా అనేసి వెళ్ళిపోతుంది.
Also Read: సామ్రాట్ ముందు నందుని ఇరికించిన లాస్య- సామ్రాట్ తో కలిసి వంట చేసిన తులసి
నేను ఎన్ని కష్టాలు పడినా నా బిడ్డ మంచిగా ఉంటే చల్లు వాళ్ళ నాయన కాడికి పోతే చాలు అని రుక్మిణి అంటుంది. ఎట్లా పోతాడు బిడ్డ ఆ మాధవగాడు ముల్లా కంచె కట్టాడు అది దాటి ఎప్పుడు బయటపడతారో తెలవట్లేదని భాగ్యమ్మ ఆవేదనగా అంటుంది. మాధవ సారు కిరికిరి పెడితే ఊరుకుంటానా నా బిడ్డని ఎట్లా అయినా నా పెనిమిటి దగ్గరకి పంపిస్తా అంటుంది అప్పుడే దేవి వాళ్ళ దగ్గరకి వస్తుంది. ‘నాయన ఏ ఊర్లో ఉంటాడు, నాయన గురించి ఏమి అడిగినా చెప్పవు, మీరు ఇక్కడికి రాకముందు ఎక్కడ ఉండేవాళ్లు’ అని దేవి రుక్మిణిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. ‘నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని మీ నాయన నీ చుట్టూ తిరుగుతున్నాడు.. నువ్వు అనే మాటలు తట్టుకుంటూ నేనే మీ నాయన్ని అని చెప్పలేక నీ కళ్ల ముందే తిరుగుతున్నాడు.. మీ నాయన నీ కళ్ల ముందే తిరుగుతున్నాడ’ని ఎలా చెప్పాలి అని రుక్మిణి మనసులోనే కుమిలిపోతుంది. నాయన నువ్వు ఏ ఊర్లో ఉన్నారో చెప్పి తీరాలి అని దేవి నిలదిస్తుంది.
Also read: ఏకాంత వేళ మనసులో మాటలు బయటపెట్టిన వేద, యష్- ఖైలాష్ ని విడిపించేందుకు అభి ప్లాన్