నిరుపమ్‌, సౌర్యను ఒకే రూంలో బంధించి ఇద్దరి మధ్య ప్రేమ పుట్టేలా ప్లాన్ చేసిన హిమ, ప్రేమ్ ట్రై చేస్తారు. ఉదయం వాళ్లు వచ్చాక తాళం తీయమని చెప్తాడు నిరుపమ్. మొత్తానికి రాయితో పగల గొట్టి వాళ్లను బయటకు తీస్తారు. 


ఇలా నలుగురు కలిసి ఇంటికి వచ్చేసరికి అక్కడ సౌందర్య, ఆనందరావు ఎదురు చూస్తుంటారు. వచ్చిన వెంటనే ఏం జరిగిందని అడుగుతారు. అసలు సౌర్యను ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారని ప్రశ్నిస్తుంది. అంటే.. ఆటో దాన్ని ఎవరు కిడ్నాప్ చేస్తారని అనుమానపడుతున్నావా అని సౌర్య తిక్కగా సమాధానం చెబుతుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావని... ఇప్పుడు నీకు వచ్చిన సమస్యేంటని ఆనందరావు అంటాడు. తాను ఇలానే మాట్లాడతాను అంటుంది సౌర్య. సరే ఆ విషయం గురించి అడగబోనని చెబుతుంది సౌందర్య. ఇంతలో అంతా కలిసి టిఫిన్ కోసం వెళ్తంటే... మెరుపులేని పిడుగులా స్వప్న వస్తుంది. 


ఇంకా ఎన్ని రోజులు తన పిల్లల్ని ఇంట్లో ఉంచుకుంటావని సౌందర్యను ప్రశ్నిస్తుంది. తన బిడ్డలు ఇద్దర్నీ ఏదో చేసేందుకే రెడీ అయ్యారని నిష్టూరుస్తుంది. ఒకరు ప్రేమ పేరుతో పెద్దవాడిని వలలో వేసుకంటే... రెండో వాడిని కూడా రెండోది ఏదో మాయ చేసేలా ఉందని అంటుంది. దీంతో సౌర్య ఘాటుగా స్పందిస్తుంది. ఏమైనా ఉంటే మీరు మీరు చూసుకోండని... తన జోలికి వస్తే మాత్రం రియాక్షన్ గట్టిగానే ఉంటుందంటుంది. 


ఇప్పుడు కిడ్నాప్ జరిగిందని... రేపు ఇంకేదైనా జరగొచ్చని అనుమానపడుతుంది స్వప్న. తాను చస్తే తప్ప ఇది తీరని సమస్యగా మిగులుతుందని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 


కిడ్నాప్ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో మరో ప్లాన్ కోసం ఆలోచిస్తుంది శోభ. తన అప్పులు తీరడానికి ఇంతకంటే వేరే మార్గం లేదని అనుకుంటుంంది. ఇంతలో కోపంతో స్వప్న రావడం చూసి ఏమైందని అడుగుతుంది. 


కిడ్నాప్ ఏమోగాని వాళ్లంతా ఒక్కటి అయిపోతున్నారని స్వప్న కంగారు పడుతుంది. ఎలాగైనా నిరుపమ్, హిమను విడగొట్టాలని అంటుంది. అప్పటికే దీని కోసం ఆలోచిస్తున్న శోభ... స్వప్నకు ఓ ప్లాన్ చెబుతుంది. రెండు రోజులు భోజనం మానేస్తే మా పెళ్లి భోజనం పెట్టొచ్చని సలహా ఇస్తుంది. అలా చేస్తే నిరుపమ్ మారుతాడా అని అడుగుతుంది స్వప్న. తల్లి తిండి తనలేదంటే ఏ కొడుకైనా కరిగిపోతాడని అంటుంది శోభ. 


కిడ్నాప్ ఎవరు చేసి ఉంటారని ఆలోచిస్తున్న ఆనందరావుకు.. సౌందర్య ఓ క్లూ ఇస్తుంది. నిరుపమ్‌, సౌర్యను కలపడానికి ఈ ప్లాన్ హిమ చేసిందేమో అని అనుమానం వ్యక్తం చేస్తుంది. అందుకే వీలైనంత త్వరగా హిమ, నిరుపమ్ పెళ్లి చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అంటుంది. 


బెడ్‌రూంలో కూర్చొని ఉన్న సౌర్యకు... కిడ్నాప్ జరిగిన రోజు నిరుపమ్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. కోపంతో తలగడను విసిరి కొడుతుంది. అంతలో తాతయ్య ఆనందరావు అక్కడకు వస్తాడు. ఏం జరిగిందో ఊహించుకుంటాడు. సౌర్య సారీ చెబుతుంది. ఇంతకీ కోపం ఎవరిపైన అని అడుగుతాడు. తన మనసులో ఉన్న బాధ తెలుసుకనే ప్రయత్నం చేస్తాడు. కానీ సౌర్య ఏమీ చెప్పదు తనను ఒంటరిగా వదిలేయమని చెబుతుంది. 


సౌర్య, నిరుపమ్‌ను కలపడం ఎలా అని ఆలోచిస్తున్న హిమకు సౌందర్య షాక్ ఇస్తుంది. ఏకంగా వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చి ఈసారి కచ్చితంగా పెళ్లి జరగాల్సిందేనంటూ చెప్పేస్తుంది. కాదు అన్న హిమ చెంపపై ఒక్కటిచ్చి ఒప్పుకోమంటుంది. సౌర్య సంగతి చెప్పినా.. పట్టించుకోదు. నిరుపమ్ నిన్నే కోరుకుంటున్నాడని... అందుకే నీతోనే పెళ్లి అని చెప్పేస్తుంది. ఇంతలో సౌర్య వస్తుంది. 


రేపటి ఎపిసోడ్
శోభ చెప్పినట్టు తన నిరాహార దీక్ష చేస్తుంది స్వప్న. విషయం తెలుసుకున్న నిరుపమ్ తల్లి వద్దకు వెళ్లబోతుంటాడు. హిమ, సౌందర్య అడ్డుకుంటారు. ఇది కూడా  సౌర్య చూసి... హిమ, నిరుపమ్ పెళ్లికి ఇంత మంది కష్టపడుతున్నారని అనుకుంటుంది. ఇలాంటి చోట తాను ఉండటం అవసరమా అని అనుకుంటుంది.