Guruvayoor Ambalanadayil Movie Review In Telugu: ఫీల్ గుడ్ సినిమాలు కావాలంటే మాలీవుడ్డే బెస్ట్ అని ఫ్యాన్స్ అంటుంటారు. అలా ఇప్పటికే ఎన్నో మలయాళ సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి కూడా. తాజాగా విడుదలయిన మరో ఫ్యామిలీ కామెడీ డ్రామా కూడా ఈ లిస్ట్‌లోకి యాడ్ అవుతుంది. అదే ‘గురువాయూర్ అంబలనడయిల్’ (Guruvayoor Ambalanadayil). బ్రొమాన్స్, కామెడీ లాంటి అంశాలు మెయిన్ హైలెట్‌గా నిలిచిన ఈ మూవీ ఇటీవల ఓటీటీలో విడుదలయ్యింది. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందంటే.?


కథ..


‘గురువాయూర్ అంబలనడయిల్’ కథ విషయానికొస్తే.. విను (బేసిల్ జోసెఫ్).. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుంటారు. తనకు అంజలి (అనస్వర రాజన్)తో పెళ్లి కుదురుతుంది. పెళ్లి కోసం కేరళకు రావాలని ప్లాన్ చేసుకుంటాడు. అయితే ఈ పెళ్లి జరగడానికి కారణం ఆనందన్ (పృథ్విరాజ్ సుకుమారన్). వినుకు గతంలో ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉందని తెలిసినా తన మనసు మార్చి తన చెల్లి అంజలితో పెళ్లి కుదిరేలా చేస్తాడు ఆనందన్. అందుకే అంజలితోకంటే ఆనందన్‌తోనే ఎక్కువ క్లోజ్‌గా ఉంటాడు విను. అప్పటికే ఆనందన్‌కు పెళ్లయ్యి ఒక బాబు కూడా ఉంటాడు. కానీ ఆనందన్‌తో గతంలో జరిగిన గొడవల వల్ల తన భార్య పార్వతి (నిఖిలా విమల్).. తన పుట్టింటికి వెళ్లిపోతుంది.


తన సంతోషానికి ఆనందనే కారణం అనుకున్న విను.. తనను తన భార్యను కలపాలని అనుకుంటాడు. అంజలి పెళ్లికి పార్వతీతో పాటు తన కుటుంబాన్ని ఆహ్వానించమంటాడు. విను చెప్పిన ఐడియాను ఫాలో అయ్యి పార్వతీని క్షమాపణ అడిగి తిరిగి ఇంటికి తీసుకొస్తాడు ఆనందన్. దుబాయ్ నుండి రాగానే ముందుగా ఆనందన్‌ను కలవడానికే వస్తాడు విను. అప్పుడే తనకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. గతంలో తను ప్రేమించిన అమ్మాయినే ఆనందన్ పెళ్లి చేసుకున్నాడు అని. ఇప్పుడు విను ఏం చేస్తాడు? ఈ పెళ్లిని ఎలా క్యాన్సల్ చేస్తాడు? అసలు ఈ పెళ్లి జరుగుతుందా లేదా? ఇదంతా తెలిసిన ఆనందన్ ఏం చేస్తాడు? అనేది తెరపై చూడాల్సిన కథ.


Also Read: ఆ జంటను వెంటాడే గతం - వారిని చంపాలనుకునే పోలీస్, థ్రిల్లింగ్‌గా సాగే రివెంజ్ డ్రామా ఇది


ప్లస్‌లు..


‘గురువాయూర్ అంబలనడయిల్’లో కామెడీ చాలావరకు వర్కవుట్ అయ్యేలా చేశాడు దర్శకుడు విపిన్ దాస్. మూవీ ఎక్కడైనా కాస్త బోర్ కొడుతుందేమో అని అనిపించేలోపే ఏదో ఒక కామెడీ సీన్‌తో దానిని ముందుకు తీసుకెళ్లాడు. ఇక పృథ్విరాజ్ సుకుమారన్, బేసిల్ జోసెఫ్ లాంటి యాక్టర్ల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంకిత్ మీనన్ అందించిన సంగీతం.. కామెడీ సీన్స్‌ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చాయి. అంజలితో పెళ్లిని క్యాన్సిల్ చేయడానికి విను వేసే ప్లాన్స్ బాగుంటాయి. తర్వాత ఏం జరుగుతుంది అని ప్రేక్షకులను ఆసక్తిగా చూసేలా చేస్తాయి. అలా ‘గురువాయూర్ అంబలనడయిల్’ ఒక రొటీన్ మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రంగా ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది క్లైమాక్స్.


మైనస్..


పృథ్విరాజ్ సుకుమారన్, బేసిల్ జోసెఫ్‌లోని ఇలాంటి పాత్రల్లో ఇప్పటికే చాలాసార్లు చూశాం కదా అనే ఆలోచన ప్రేక్షకులకు రావచ్చు. కామెడీ వర్కవుట్ అయినట్టే అనిపించినా.. చాలా చోట్ల అది కాస్త బోరింగ్ అని కూడా అనిపిస్తుంది. ఇక అనస్వరా రాజన్ లాంటి హీరోయిన్‌ను ఎంపిక చేసి తనకు మినిమమ్ స్కోప్ లేని క్యారెక్టర్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. యోగి బాబు లాంటి స్టార్ కామెడియన్‌ను ‘గురువాయూర్ అంబలనడయిల్’ కోసం రంగంలోకి దించి.. తనను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదేమో అనే ఆలోచన వస్తుంది. సినిమాలో ఉన్నది ఒకే ట్విస్ట్. ఆ ట్విస్ట్‌ను కూడా మొదట్లోనే రివీల్ చేసి తర్వాత అంతా రొటీన్ అనిపించేలా చేశాడు దర్శకుడు విపిన్ దాస్. పలుచోట్ల అనవసరమైన క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేశాడేమో అని కూడా అనిపించవచ్చు. మొత్తానికి కాసేపు నవ్వుకోడానికి ‘గురువాయూర్ అంబలనడయిల్’ చూడొచ్చు. ఈ మూవీ ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌’లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ చూడవచ్చు. 


Also Read: ఇదెక్కడి ప్రేమరా బాబు, పెళ్లయిన మహిళను ప్రేమిస్తాడు - ఏకంగా తన మాంసాన్నే రుచి చూపిస్తాడు, చివరికి..