‘Kalki 2898 AD’ ‘Ta Takkara’ Song Released: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు రూ.190 కోట్లకు పైగా వసూళు చేసిన ఈ చిత్రం రెండో రోజూ ఇంచుమించు అంతే మొత్తంలో కలెక్షన్స్ సాధించింది.


‘కల్కి’ ఫుల్ వీడియో సాంగ్ విడుదల


ఇక ఈ సినిమా విషయంలో నాగ్ అశ్విన్ ప్రేక్షకులకు బోలెడు సర్ ప్రైజ్ లు ఇచ్చారు. అద్భుతమైన ‘బుజ్జి’ కారును రూపొందించడంతో పాటు, ఈ సినిమాలో మూడు ప్రపంచాలను సృష్టించి ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకున్నారు. పూర్తి స్థాయిలో హాలీవుడ్ చిత్రాన్ని తలపించినా, భారతీయ పురాణ మూలలను దాటి పోకుండా ప్రయత్నించారు. అంతేకాదు, ఈ సినిమాలోని పాటలను రిలీజ్ చేయకుండా నేరుగా సినిమాలోనే చూపించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ప్రభాస్ భూమ్మీది నుంచి కంప్లెక్స్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. చివరకు దిశా పటానీతో కలిసి అక్కడికి వెళ్లాక, ఓ రేంజిలో ఎంజాయ్ చేస్తారు. 


కనువిందు చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సాంగ్



ఇక ఈ ‘టా టక్కర’ సాంగ్ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంటుంది. సినిమాలో చూపించిన పాటను పూర్తి స్థాయిలో హెచ్ డీ క్వాలిటీలో విడుదల చేశారు. సంతోషన్ నారణయ్ సంగీతం, నాగ్ అశ్విన్ విజువల్ వండర్ చూసి ప్రేక్షకులు మైమరచిపోతున్నారు. కనువిందు చేసే జలపాతాలు, కళ్లు చెదిరే భవంతులు, కొండ కోనలు ఆహా అనిపిస్తున్నాయి.  విడుదల చేసిన కొద్ది సేపట్లోనే ఈ పాట ఓ రేంజిలో వ్యూస్ దక్కించుకుంటుంది. సాంగే ఈ రేంజిలో ఉంటే సినిమా ఏ రేంజిలో ఉంటుందోనని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ మూవీలో ఈ సాంగ్ కూడా చాలా కీలకమైనది. అప్పటివరకు కాంప్లెక్స్ ఎలా ఉంటుందనేది ప్రేక్షకులు కూడా గెస్ చేయలేరు. ఈ వీడియో సాంగ్ చూసి మూవీకి వెళ్తే.. పెద్దగా మజా రాకపోవచ్చు.


 


రూ. 600 కోట్లతో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’


వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వనీ దత్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. సుమారు రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందింది. ఈ చిత్రంలో దిగ్గజ నటులు అమిత్ బచ్చన్, కమల్ హాసన్, బాలీవుడ్ నటి దీపికా పదుకొణెతో పాటు ఎంతో మంది నటీనటులు కామియో పాత్రలు పోషించారు. నాగ్ అశ్విన్ ఈ మూవీతో  ఇండియన్ సినిమా స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్లారంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ సినిమాను చూసి అద్భుతం అంటూ నాగ్ అశ్విన్ ను అభినందిస్తున్నారు.



Also Read: 'కల్కి2898 AD' చిత్రంలో లార్డ్‌ కృష్ణ పాత్ర పోషించింది ఈ నటుడే - ఎవరో గుర్తుపట్టారా?