Bad Newz Trailer Out: త్రిప్తి దిమ్రి, విక్కీ కౌశల్, అమ్మి విరాక్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బ్యాడ్ న్యూస్’. ఈ కామెడీ ఎంటర్ టైనర్ కు ఆనంద్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒకే బిడ్డకు ఇద్దరు తండ్రులు ఉంటే? అనే పాయింట్ ను బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ ఫన్నీ మూవీ అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతుంది.
ఒకే బిడ్డకు ఇద్దరు తండ్రులా?
హీరోయిన్ త్రిప్తి దిమ్రికి ఇద్దరు హీరోలతో శారీరక సంబంధం ఉంటుంది. ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు తేలుతుంది. అయితే, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు? అనే అనుమానం ఆమెలో తలెత్తుతుంది. ఈ నేపథ్యంలోనే పెటర్నిటీ పరీక్షలు చేస్తారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది. ఈ పరీక్షల్లో ఇద్దరూ ఆ బిడ్డకు తండ్రులేనని తేలుతుంది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఏం చేస్తుంది? ఎవరిని వదిలేస్తుంది? ఎవరితో రిలేషన్ షిప్ కొనసాగిస్తుంది. ఇద్దరు తండ్రులని తేలడంతో హీరోలు ఏ నిర్ణయం తీసుకుంటారు? అనేది చాలా ఫన్నీగా తెరకెక్కించారు దర్శకుడు ఆనంద్ తివారీ. కామెడీకి ఎమోషనల్ టచ్ ఇస్తూ రూపొందించిన ఈ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం వెల్లడించింది.
ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న త్రిప్తి
ఇక ‘యానిమల్’ సినిమాతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్న త్రిప్తి దిమ్రి.. ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుంది. ఇప్పటికే ఆమె పలు సినిమాల్లో నటించినా, అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు. ‘యానిమల్’ మూవీతో కనీవినీ ఎరుగని గుర్తింపు తెచ్చుకుంది. రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ఏకంగా రూ. 950 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అందరి చేత శభాష్ అనిపించుకుంది. ఈ సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చాయి.
ఈ సినిమాలో మితిమీరిన హింసపై ఏకంగా పార్లమెంట్ లోనూ దుమారం చలరేగింది. అయినప్పటీకి ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘యానిమల్’ తర్వాత త్రిప్తి నటిస్తున్న ఈ ‘బ్యాడ్ న్యూస్’ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ హిట్ కొడితే, ఆమె కెరీర్ కు మరింత ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అందుకే, ఈ సినిమాపై ఆమె భారీగా ఆశలు పెట్టుకుంది. ఇక ఈ కామెడీ సినిమా ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కింది. జూలై 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
Also Read: నేను బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నా- షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రముఖ నటి హీనా ఖాన్