జాన్ విక్ (John Wick Franchise)... హాలీవుడ్ సినిమాలు రెగ్యులర్‌గా ఫాలో అయ్యే ప్రేక్షకులకు పరిచయమైన పేరే. ఈ ఫ్రాంఛైజీలో నాలుగో సినిమా (John Wick 4) నేడు థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతానికి ఈ సినిమాతో ఆపేస్తున్నామన్నట్లు ఓ ప్రకటన కూడా చేశారు. అది నిజమేనా!? 'జాన్ విక్ 4' ఎలా ఉంది? ముందు వచ్చిన మూడు సినిమాల కంటే బావుందా? లేదా? 


కథ (John Wick Chapter 4 Story) : 'జాక్ విక్ 3'లో కథ ఎక్కడ అయితే ముగిసిందో... ఈ సినిమాలో అక్కడ మొదలవుతుంది. ఫ్రీడమ్ కోసం జోనాథన్ (జాన్) విక్ హై ఎడారి దేశంలో హై టేబుల్ సభ్యుడు ఒకరిని చంపేస్తాడు. అతడికి సాయం చేసినందుకు , అతడితో స్నేహం చేసినందుకు న్యూయార్క్ సిటీలో ఓ కాంటినెంటల్ హోటల్ మేనేజర్ నష్టపోతాడు. ఆ హోటల్ ధ్వంసం అవుతుంది. జపాన్ దేశంలో జాన్ విక్ స్నేహితుడికి సైతం అదే పరిస్థితి ఎదురవుతుంది. మరోవైపు జాన్ విక్ కోసం వేట మొదలవుతుంది. అతడిని చంపిన వ్యక్తికి 40 మిలియన్ అమెరికన్ డాలర్లు ప్రైజ్ మనీ ప్రకటిస్తారు. ఫ్రీడమ్ కోసం జాన్ విక్ ఎటువంటి పోరాటం చేశాడు? చివరికి ఏమైంది? అనేది సినిమా. 


విశ్లేషణ (John Wick 4 Telugu Review) : యాక్షన్... యాక్షన్... యాక్షన్... 'జాన్ విక్' ఫ్రాంఛైజీలోని మొదటి మూడు సినిమాల్లో నచ్చినది! 'జాన్ విక్ 4'లోనూ యాక్షన్ ఉంది. అయితే, ఈసారి యాక్షన్ (John Wick 4 Action Director)ను నెక్స్ట్ లెవల్ కు తీసుకు వెళ్ళారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్, అంతకు ముందు టాప్ వ్యూలో తీసిన ఓ యాక్షన్ సీక్వెన్స్, జపాన్ ఎపిసోడ్ యాక్షన్ అయితే 'వావ్.. జస్ట్ వావ్' అన్నట్లు ఉన్నాయి.


దర్శకుడు Chad Stahelski స్వతహాగా స్టంట్ మాన్. 'జాన్ విక్' ఫ్రాంఛైజీలో ప్రతి సీన్, యాక్షన్ ఎపిసోడ్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. 'జాన్ విక్ 4'లో క్రియేటివిటీ మరింత చూపించారు. గులాబీ మొక్కకు అంటు కట్టినట్లు చాలా పద్ధతిగా తీశారు. గన్ ఫైరింగ్ చూస్తే మంటలు రావడం ఏమిటి? కొత్తగా ఉంటుంది. ఒక అపార్ట్మెంట్ లోపలు టాప్ యాంగిల్ వ్యూలో సింగిల్ షాట్ ఎపిసోడ్ తీశారు. ఫెంటాస్టిక్ సీక్వెన్స్ అది. 


సినిమాటోగ్రాఫర్ డాన్ లాస్టెన్స్, సంగీత దర్శకులు టైలర్ బ్యాట్స్ & జోయెల్ జె. రిచర్డ్ ప్రతి యాక్షన్ సీక్వెన్సుకు ప్రాణం పోశారు. స్టార్టింగ్ టు ఎండింగ్ కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. స్క్రీన్ మీద ఏం జరుగుతుందో చూసేలా మ్యూజిక్ ఉంది. టెక్నికల్ పరంగా హై స్టాండర్డ్స్ మైంటైన్ చేశారు. సినిమాకు ప్లస్ & మైనస్ యాక్షన్ అని చెప్పాలి. స్క్రీన్ మీద యాక్షన్ ఉన్నంత సేపూ అలా చూస్తూ ఉంటాం. కథలోకి వెళ్లిన తర్వాత స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. కథలో ట్విస్టులు, టర్నులు కూడా పెద్దగా లేవు.  


నటీనటులు ఎలా చేశారు? : జాన్ విక్ పాత్రకు కీనూ రీవ్స్ మరోసారి ప్రాణం పోశారు. యాక్షన్ సీక్వెన్సుల్లో ఆయన సింప్లీ సూపర్బ్. అయితే, కీనూని డోనీ యెన్ డామినేట్ చేశారని చెప్పాలి. అంధుడిగా డోనీ చేసే యాక్షన్ స్టయిలుగా ఉంటుంది. అదే సమయంలో కొంచెం టెన్షన్ పడుతుంది. మిస్టర్ నోబడీ పాత్రలో షామిర్ ఆండర్సన్ యాక్టింగ్ కూడా ఆకట్టుకుంటుంది. 


Also Read : 'దాస్ కా ధమ్కీ' రివ్యూ : 'ధమాకా'లా ఉందా? లేదంటే విశ్వక్ సేన్ కొత్తగా తీశాడా?


చివరగా చెప్పేది ఏంటంటే : 'జాన్ విక్' ఫ్రాంఛైజీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. జస్ట్ యాక్షన్ ఎంజాయ్ చేయడానికి ఆ సినిమాకు వెళ్ళే ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళను 'జాన్ విక్ 4' అమితంగా ఆకట్టుకుంటుంది. సగటు ప్రేక్షకులను సైతం ఈ సినిమా ఏమాత్రం డిజప్పాయింట్ చేయదు. ఇంతకు ముందు మూడు సినిమాలను మీరు చూడకపోయినా సరే... 'జాన్ విక్ 4'లో యాక్షన్ ఎంటర్టైన్ చేస్తుంది. పర్ఫెక్ట్ యాక్షన్ కుదరడంతో సినిమా బావుంది. ఫెంటాస్టిక్ యాక్షన్ రైడ్! యాక్షన్ ప్రేమికులకు పండగ!


Also Read 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా