సినిమా రివ్యూ : హత్య 
రేటింగ్ : 2/5
నటీనటులు : విజయ్ ఆంటోనీ, మురళీ శర్మ, మీనాక్షి చౌదరి, జాన్ విజయ్, రాధిక శరత్‌కుమార్, సిద్ధార్థ్ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు
ఛాయాగ్రహణం : శివకుమార్ విజయన్
సంగీతం : గిరీష్ గోపాలకృష్ణన్
నిర్మాతలు : కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్‌విఎస్ అశోక్ కుమార్
తెలుగులో విడుదల : గ్లోబల్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్
రచన, దర్శకత్వం : బాలాజీ కుమార్
విడుదల తేదీ: జూలై 21, 2023


విజయ్ ఆంటోనీ (Vijay Antony) కొత్త కథలతో సినిమాలు చేస్తుంటారు. ఇంతకు ముందు చేసిన సినిమాలకు భిన్నంగా ఏదో ఒక కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'హత్య' (Hatya Telugu Movie). తమిళంలో 'కొలై'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హీరోయిన్లు మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary), రితికా సింగ్ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నేడు విడుదలైంది. 


కథ (Hatya Movie Story) : ముంబై నుంచి రెండు నెలల క్రితం హైదరాబాద్  సిటీకి వచ్చిన ఫేమస్ మోడల్ లైలా (మీనాక్షీ చౌదరి) తన ఫ్లాట్‌లో విగత జీవిగా పడి ఉంటుంది. కొత్తగా డ్యూటీలో చేరిన ఐపీఎస్ సంధ్య (రితికా సింగ్)కి ఆ కేసును అప్పగిస్తారు. బాయ్ ఫ్రెండ్ సతీష్ (సిద్ధార్థ శంకర్), ముంబైలో మోడల్ కో ఆర్డినేటర్ ఆదిత్య కౌశిక్ (మురళీ శర్మ), ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అర్జున్ వాసుదేవ్ (అర్జున్ చిదంబరం), అనాథ ఆశ్రమంలో తనను పెంచిన మహిళ కుమారుడు బబ్లూ (కిషోర్ కుమార్)... నలుగురిలో సంధ్యను హత్య చేసింది ఎవరు? ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో సంధ్యకు ప్రముఖ డిటెక్టివ్ వినాయక్ (విజయ్ ఆంటోనీ) ఏ విధమైన సహాయం చేశారు? దర్యాప్తులో ఎదురైన సవాళ్ళను, అడ్డుగోడలను ఆయన ఎలా పరిష్కరించారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.  


విశ్లేషణ (Hatya Movie Review) : మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'హత్య'. అయితే... ఇందులో థ్రిల్ ఇచ్చే అంశాలు చాలా అంటే చాలా తక్కువ. ప్రీ క్లైమాక్స్ నుంచి కొంచెం థ్రిల్ ఉంటుంది. డ్రామాతో ముడిపడిన ఇన్వెస్టిగేషన్ ఫిల్మ్ ఇది.


రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్స్, ఇన్వెటిగేషన్ డ్రామాల మధ్య 'హత్య'ను కొంచెం కొత్తగా చూపించిన ఘనత ప్రొడక్షన్ డిజైనర్ & సినిమాటోగ్రాఫర్... ఇద్దరికీ దక్కుతుంది. డిఫరెంట్ కలర్ టోన్, ఫ్రేమింగ్‌లతో సినిమా స్టార్టింగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. తెరపై ఏదో కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించారు. అయితే... కాసేపటికి స్లో నేరేషన్ ఇబ్బంది కలిగించడం మొదలు పెడుతుంది. కేవలం మర్డర్ మిస్టరీకి మాత్రమే పరిమితం అయితే బావుండేది. కుటుంబ ప్రేక్షకుల కోసం అన్నట్లు మధ్యలో విజయ్ ఆంటోనీ పాత్రకు ఫ్యామిలీ, డాటర్ సెంటిమెంట్ సీన్లు రాశారు. 


'హత్య'లో రెగ్యులర్ హీరో హీరోయిన్లు లేరు. రొటీన్ రొమాంటిక్ సీన్లు లేవు. అందుకు దర్శకుడిని మెచ్చుకోవాలి. అయితే... ఇన్వెటిగేషన్ ప్రాసెస్ రెగ్యులర్ పంథాలో తీసి విసిగించారు. హత్యకు ముందు వెనుక ఏం జరిగిందనేది విజయ్ ఆంటోనీ చెబుతుంటే... 'అజ్ఞాతవాసి'లో సంపత్ రాజ్ సీన్లు గుర్తుకు వస్తాయి. క్లైమాక్స్ కంటే కొంచెం ముందు క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ఎండింగ్ కొంచెం పర్వాలేదు. రీ రికార్డింగ్ జస్ట్ ఓకే. కథగా చూసిన సరే... ఎవరు చంపారు? అనేది ఊహించడం పెద్ద కష్టం ఏమీ కాదు. సినిమా స్టార్టింగులో కొంచెం కాన్సంట్రేట్ చేస్తే ఈజీగా అర్థం అయిపోతుంది.


నటీనటులు ఎలా చేశారు? : నటనలో విజయ్ ఆంటోనీ కొత్తగా చేసింది ఏమీ లేదు. ఆ పాత్రకు అవసరమైన సీరియస్ ఎక్స్‌ప్రెషన్స్ మైంటైన్ చేశారు. లుక్ పరంగా గ్రే హెయిర్‌తో కొంచెం కొత్తగా కనిపించారు.


మీనాక్షీ చౌదరి మోడల్ రోల్ చేశారు. స్క్రీన్ మీద ఆమెను చూస్తే సైజ్ జీరో బాడీతో మోడల్ అన్నట్లు ఉన్నారు. నటిగా ఆమెకు ఎక్కువ స్కోప్ దక్కలేదు. ఉన్నంతలో పర్వాలేదు. బాగా చేశారు. ఐపీఎస్ సంధ్య పాత్రలో రితికా సింగ్ ఓకే. రాధికా శరత్ కుమార్, జాన్ విజయ్ పాత్రలు కొన్ని సన్నివేశాలకు పరిమితం అయ్యింది. మురళీ శర్మ నటన బావుంది. కానీ, వేరొకరితో డబ్బింగ్ చెప్పించడం బాలేదు. సిద్ధార్థ శంకర్, అజిత్ చిదంబరం, కిషోర్ కుమార్... పాత్రల పరిధి మేరకు చేశారు.  


Also Read : 'హిడింబ' రివ్యూ : మనుషులను తినే గిరిజన జాతి మహానగరానికి వస్తే?


చివరగా చెప్పేది ఏంటంటే? : రెగ్యులర్ రొటీన్ సినిమాలతో పోలిస్తే... డిఫరెంట్ ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీతో వచ్చిన సినిమా 'హత్య'. ఇప్పటికే బోలెడు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూసిన ప్రేక్షకులకు 'హత్య' థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఏమీ ఇవ్వదు. ఇక, థియేటర్లకు వెళ్ళాలా? వద్దా? అనేది మీ ఇష్టం.  


Also Read 'బేబీ' రివ్యూ : ఆనంద్, విరాజ్ - ఇద్దరిలో వైష్ణవి చైతన్య ఎవరి పిల్ల? లేడీ అర్జున్ రెడ్డి అనే సినిమానా?









ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial