జ్ఞాపకశక్తిని దెబ్బతీసే వ్యాధి డిమెన్షియా.. దీన్నే చిత్త వైకల్యం అని కూడా పిలుస్తారు. ఒకరకంగా చెప్పాలంటే మతిమరుపు. చిన్న చిన్న విషయాలు ఏవి గుర్తు పెట్టుకోలేకపోతారు. అయితే మనకి చిత్త వైకల్యం ఉందో లేదో మన కళ్ళు చెప్పేస్తాయని అంటున్నారు నిపుణులు. మెదడుకి కళ్ళు కిటికీలు వంటివి. అందుకే ఇవి మతిమరుపు సమస్యని ఇట్టే తెలియజేస్తాయని చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో డిమెన్షియా ఇకటి. 2019లో ఈ వ్యాధి కారణంగా దాదాపు 1.8 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి నివారణ మార్గాలు కనుగొంటే పరిస్థితిని మరణం వరకు తీసుకురాకుండా జాగ్రత్త పడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అలసట, వినికిడి లోపం, నిద్ర రుగ్మతలు వంటి పరిస్థితులు డిమెన్షియా ప్రమాదాన్ని అంచనా వేయగలవని కొన్ని అధ్యయనాలు కనుగొన్నారయి. ఇప్పుడు జ్ఞాపకశక్తి సమస్యలు తలెత్తే ముందు చిత్త వైకల్యంకి సంబంధించి కళ్ళు నాలుగు సంకేతాలని చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ సంకేతాలు సూక్ష్మంగా ఉండవచ్చు. వెంటనే గుర్తించలేరు. మరికొన్ని సందర్భాల్లో వెంటనే పసిగట్టేస్తారు.
దృష్టిలో మార్పు
చిత్తవైకల్యం ఉం వ్యక్తులు దూరంగా ఉన్న వస్తువులు, రంగులని గుర్తించడంలో ఇబ్బంది పడతారు. కంటి చూపు మందగించడం వల్ల సరిగా చూడలేరు.
చదవడంలో ఇబ్బంది
డిమెన్షియా ఉండే చదవడం, రాయడం, చిహ్నాలు, సంఖ్యలు గుర్తు పెట్టుకోవడం, అర్థం చేసుకోనే విషయంలో తడబాటు పడతారు.
విజువల్స్
చిత్తవైకల్యం ఉన్న కొందరిలో లేని వస్తువులు ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే మన కళ్ళు మనలనే మోసం చేస్తాయి. అక్కడ ఏమి లేకపోయినా ఉన్నట్టు చూపిస్తాయి.
బలహీనమైన విజువల్ మెమరీ
ముఖాలు, వస్తువులు, స్థలం కూడా గుర్తుకు ఉండదు. అప్పుడే చూసిన వారిని వెంటనే మర్చిపోయే అవకాశం ఉంటుంది.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. రెటీనా సన్నగిల్లుతుంది. రెటీనా సున్నితమైన కణజాలం. కంటి వెనుక భాగంలో ఉంటుంది. దీన్ని పరిశీలిస్తే అల్జీమర్స్ ని ప్రారంభంలోనే గుర్తించడంలో సహాయపడుతుంది. వయోజనుల్లో అయితే అభిజ్ఞా పనితీరు మందగిస్తుందని మునుపటి పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఇతర సంకేతాలు
ఎన్ హెచ్ ఎస్ ప్రకారం చిత్త వైకల్యం వచ్చే ముందు కనిపించే లక్షణాలు
⦿జ్ఞాపకశక్తి కోల్పోవడం
⦿ఏకాగ్రత దెబ్బతినడం
⦿షాపింగ్ చేసేటప్పుడు గందరగోళానికి గురవుతారు
⦿మాట్లాడేటప్పుడు ఒక్కసారిగా ఏం మాట్లాడాలో తెలియదు. సరైన పదాలు వెతుక్కోవడంలో ఇబ్బంది పడతారు
⦿మానసిక స్థితిలో మార్పులు
⦿రోజువారీ కార్యకలాపాలు చేసుకోవడం కష్టమవుతుంది
డొనానెమాబ్, లెకనెమాబ్ అనే రెండు కొత్త మందులు వృద్ధుల్లో ఈ వ్యాధిని నెమ్మదించేలా చేస్తాయని నిరూపితమైంది. ఇవి ట్రయల్ దశలోనే ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వ్యాధిని ముందుగానే తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
చురుకైన జీవనశైలి, పోషకాహారం తినడం, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం వంటి వాటి ద్వారా డిమెన్షియాను తగ్గించుకోవచ్చు. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉన్న ఆహారం తీసుకుంటే మెదడులో మార్పులు జరుగుతాయి. మతిమరుపు నుంచి బయట పడొచ్చు. కొవ్వు చేపలు, వాల్ నట్స్ తీసుకున్న తర్వాత జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పాల మీద మీగడ ఎందుకు పడుతుందో తెలుసా?