Shravan Shaniwar 2023: శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువుకి మాత్రమే కాదు శివునికి కూజా ప్రీతకరం. 2023 శ్రావణ మాసం ఇప్పటికే ప్రారంభంకాగా అధికమాసం రావడంతో మొదటి నెల రోజులు పరిగణలోకి తీసుకోరు. ఆగష్టు 17 నుంచి నిజ శ్రావణం ప్రారంభమైంది. శ్రావణమాసంలో ప్రతి రోజూ ముఖ్యమే. మంగళవారం, శుక్రవారం అమ్మవారిని పూజిస్తారు. శ్రావణ సోమవారాలు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరం. అయితే శనివారాలు కూడా శివ పూజకు చాలా విశిష్టమైనవి. ఈ రోజు శివుడి అనుగ్రహం పొందితే శని బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం.
ఈ పుష్పాలను శివలింగానికి సమర్పించండి
శ్రావణ మాసంలో, శివుని అనుగ్రహం పొందడానికి శ్రావణ శనివారం శివలింగంపై 5 రకాల పత్ర, పుష్పాలను సమర్పించాలి. ఉదాహరణకు శివుడికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రం, శమీ, అగస్త్య, అవిసె పువ్వు, గంట పుష్పం సమర్పించవచ్చు.
Also Read : శంకరునికి ప్రీతిపాత్రమైన బిల్వపత్రం గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
శమీ (జమ్మి) పుష్పం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం నాడు శివునికి శమీ పుష్పాలు సమర్పించడం వల్ల శని దోషం తగ్గుతుంది. ఇది కాకుండా, ఏటినాటి శని దోషం, శని మహాదశ, అర్ధాష్టమి సహా ఇతర శని సంబంధిత దోషాల ప్రభావం తగ్గుతుంది.
Also Read: ఆగష్టు 19 రాశిఫలాలు, ఈ రాశులవారు నిర్ణయాలు తీసుకునేందుకు తొందరపడకండి!
అవిసె పువ్వులు
శ్రావణ శనివారం నాడు పరమేశ్వరుడిని అవిసె పువ్వులు, బిల్వ పత్రాలతో పూజించడం వలన త్వరగా ప్రసన్నుడవుతాడు. మీరు కోరిన కోర్కెలు త్వరగా తీరతాయి. అందువల్ల కొన్నాళ్లుగా మీకు తీరని కోరిక ఏదైనా ఉంటే దానిని నెరవేరేలా చూడాలని మనసులో కోరుకుంటూ ఈ పువ్వులను శివుడికి సమర్పించడం చాలా శుభప్రదం.
అగస్త్య (కుసుమ) పుష్పం
శనివారం నాడు శివునికి అగస్త్య పుష్పాన్ని సమర్పించడం వలన, మీకు మోక్షాన్ని అనుగ్రహిస్తాడని శాస్త్ర వచనం. శివలింగానికి అగస్త్యపుష్పం సమర్పించడం వల్ల సమాజంలో గౌరవ, ప్రతిష్ఠలు పెరుగుతాయి.
ధాతుర (ఉమ్మెత్త) పుష్పం
మత విశ్వాసాల ప్రకారం, ధాతుర పుష్పం శివునికి ఇష్టమైన పుష్పంగా భావిస్తారు. ఈ రోజు శివాలయంలో ధాతుర మొక్కను నాటితే మీకు శివానుగ్రహంతో పాటు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అంతేకాక, మీ జీవితం నుంచి దుఃఖం, పేదరికం కూడా తొలగిపోతాయి.
Also Read : భోళా శంకరుడికీ అవతారాలున్నాయి
ఈ మొక్కను శివాలయంలో నాటండి
శ్రావణ శనివారం నాడు శివాలయంలో పారిజాత మొక్కను నాటడం వల్ల భార్యాభర్తల మధ్య బంధం బలోపేతం అవుతుంది ఇద్దరి మధ్య ప్రేమ మరింత ఇనుమడిస్తుంది. మీరు శివాలయంలో మల్లె మొక్కను నాటడం ద్వారా శివ, పార్వతి, గణపతి అనుగ్రహాన్ని పొందుతారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.