Horoscope Today 2023 August 19th


మేష రాశి 
ఈ రాశివారు ఈ రోజు స్నేహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. వైవాహిక జీవితంలో ఉండే ఇబ్బందులు దూరమైపోతాయి. విద్యార్థులు చదువుతో పాటూ వేరే ఉద్యోగం చేయాలనే ఆలోచనతో ఉంటారు. తమ అభిరుచిన నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇతరుల తప్పులను ఎగతాళి చేయొద్దు. నూతన పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ఇప్పుడంత శ్రేయస్కరం కాదు.


వృషభ రాశి
ఈ రాశివారు ఈ రోజు నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడకండి. పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచండి. ప్రేమ వ్యవహారాల విషయంలో కాస్త సున్నితంగా ఉంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలుంటాయి జాగ్రత్త. తప్పుడు ప్రాజెక్ట్‌ల వల్ల వ్యాపారంలో అడ్డంకులు ఏర్పడవచ్చు.


మిధున రాశి
ఈ రోజు ఈ రాశి ఉద్యోగులకు ఇతరులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆగిపోయిన పనులు పూర్తిచేయగలుగుతారు. కుటుంబంలో మీ గౌరవం తగ్గవచ్చు. తెలియని వ్యక్తులను ఎక్కువగా నమ్మవద్దు. మీ అభిప్రాయాలను మళ్లీ మళ్లీ మార్చుకోవద్దు. ఆస్తులపై పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. 


కర్కాటక రాశి 
ఈ రోజు ఈ రాశివారు అనుకున్న పనులను తొందరగా పూర్తిచేస్తారు. ఏదైనా కొత్త పనిపై పరిశోధన చేస్తారు. వ్యాపారంలో ముఖ్యమైన నిరమయాలు తీసుకుంటారు. కోర్టు-కేసు వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి.


Also Read: శని ఉందని ఎలా తెలుస్తుంది, చీమలకుఆహారం వేస్తే శని బాధల నుంచి ఎందుకు విముక్తి కలుగుతుంది


సింహ రాశి
ఈ రోజు ఈ రాశివారు కుటుంబంలో కొన్ని వివాద పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయవద్దు. అంకితభావంతో కష్టపడి పని చేయండి. మీ మాటతీరు ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తుంది.ఉద్యోగులు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుంది. 


కన్యా రాశి 
ఈ రాశివారు ఈ రోజు మీ తప్పులను మీరు తెలుసుకుంటారు. క్లిష్ట పరిస్థితులు ఏకాగ్రతను ప్రభావితం చేస్తాయి. సాంకేతిక సంబంధిత పనులలో మంచి ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో సమన్వయం బాగుంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది..ఖర్చులు కూడా పెరుగుతాయి. 


తులా రాశి 
ఈ రాశివారు ఈరోజు టైమ్ వేస్ట్ చేసే కార్యక్రమాలు చేయకపోవడమే మంచిది. మీ ప్రవర్తనా విధానం మీ పనిపై ప్రభావం చూపిస్తుంది. నిర్మాణ రంగంలో ఉండేవారికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కొత్తగా ప్రణాళికలు అమలుచేసేందుకు మంచి రోజు కాదు. 


వృశ్చిక రాశి 
ఈ రాశివారు ఈ రోజు చురుగ్గా ఉంటారు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. సంతానం పట్ల ఆందోళనలు తొలగుతాయి. ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు చాలా మంచిది. ముఖ్యమైన వ్యాపార ఒప్పందానికి అవకాశం ఉంది. వ్యాపారానికి సంబంధించిన సమస్యలు తొలగుతాయి. 


ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశివారు బాధ్యతలు తీసుకునేందుకు  సిద్ధంగా ఉంటారు. ప్రేమ జీవితం బావుంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఉండే వివాదాలు తొలగిపోతాయి. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. మీరు వ్యాపారంలో అనుకూల ఫలితాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది.


మకర రాశి 
ఈ రాశివారు ఈరోజు సంతోషంగా ఉంటారు. మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో ఉ్నన వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఉన్నత విద్యలో అడ్డంకులు ఎదుర్కోవాల్సి రావొచ్చు.


కుంభ రాశి 
ఈ రోజు ఈ రాశి వ్యాపారులకు శుభసమయం. నూతన పెట్టుబడులు బాగా కలిసొస్తాయి. ఉద్యోగులు అతి విశ్వాసానికి దూరంగా ఉండాలి. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. 


Also Read: శని మూడు రకాలు, మీకున్నది ఏ శని -ఎన్నాళ్లుంటుంది- ప్రభావం ఎలా ఉంటుంది, పరిహారాలేంటి!


మీన రాశి
ఈ రోజు ఈ రాశివారు వ్యాపారంలో వచ్చే కొన్ని ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు కలిసొస్తాయి.  ఆన్‌లైన్ వ్యాపారంలో పెద్ద మొత్తంలో లాభం పొందవచ్చు. 


గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.