బరువు తగ్గించుకోవడానికి ఒక్కొక్కరూ ఒక్కో విధానం ఫాలో అవుతూ ఉంటారు. ఆహారంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఉంటారు. మీకోక విషయం తెలుసా మన వంటింట్లో ఉండే సుగంధ ద్రవ్యాలు, ఇతర పదార్థాలు బరువు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అదనపు కొవ్వు కరిగించడంలో సహాయపడే అద్భుతమైనవి సోంపు గింజలు. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన సోంపు తీసుకుంటే ఫిట్ నెస్ కు చక్కగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది.


ఫెన్నెల్ విత్తనాలు ఎలా సహాయపడతాయి?


యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఖనిజాల గొప్ప మూలం సోంపు గింజలు. పోషకాల పవర్ హౌస్ గా పిలుస్తారు. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. అదనపు కొవ్వుని తగ్గిస్తుంది. కొవ్వు నిల్వలు తగ్గించి శరీరంలోని ఇతర పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది.


పొట్ట నిండుగా ఉంచుతుంది: ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పొట్టని ఎక్కువ సేపు నిండుగా ఉంచి అతిగా తినాలనే కోరికని తగ్గిస్తుంది. పీచు పదార్థం ఉండటం వల్ల మెరుగైన జీర్ణక్రియకు సహాయపడుతుంది. జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తికి సహాయపడుతుంది.


టాక్సిన్స్ తొలగిస్తుంది: యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీరం నుంచి విషాన్ని బయటకి పంపద్యంలో సహాయపడుతుంది. ఆక్సీకరణ ఒత్తిడి, నష్టాన్ని కూడా తగ్గిస్తుంది. జీవక్రియను పెంచుతుంది. శక్తిని వేగంగా ప్రాసెస్ చేయడంలో సహాయపడుతుంది. కొవ్వును త్వరగా కరిగించేస్తుంది.


ఎలా తీసుకోవాలి?


సోంపు వాటర్: ఒక గ్లాసు నిండా నీళ్ళు తీసుకుని అందులో కొన్ని సోంపు గింజలు వేసుకుని రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్నే పరగడుపున టీ లేదా కాఫీ తాగే బదులు ఈ సోంపు వాటర్ తాగొచ్చు. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.


టీ: హెర్బల్, గ్రీన్ టీలు బరువు తగ్గించే విధానంలో మునడుంటాయి. వాటిలో ఫెన్నెల్ టీ కూడా ఉంటుంది. వేడి నీటిలో ఒక టీ స్పూన్ లేదా రెండు టీ స్పూన్ల సోంపు గింజలు వేసుకోవాలి. వాటిని బాగా మరిగించాలి. రుచి కోసం పుదీనా ఆకులు, అల్లం వేసుకోవచ్చు. రుచి ఘాటుగా అనిపిస్తే అందులో కాస్త తేనె కలుపుకుని టీ తాగొచ్చు. శ్వాసకోశ సంబంధిత సమస్యలు, ఉబ్బరం తగ్గించడంలో సోంపు గింజలు సహాయపడతాయని ఆలూ అధ్యయనాలు వెల్లడించాయి.


అనేక రకాల క్యాన్సర్ లు రాకుండా తగ్గించడంలో ఫెన్నెల్ సీడ్స్ సహాయపడతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. ఇందులో జింక్, ఫాస్పరస్, సెలీనియం, మాంగనీస్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. సోంపు గింజలతో చేసుకునే ప్రత్యేక పానీయం కళ్ళకు చాలా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే ఆయుర్వేదంలో వీటిని నేత్రజ్యోతి అని కూడా పిలుస్తారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకూండా ఉండాలంటే ఈ డ్రింక్స్ దూరం పెట్టండి