తాజా పండ్లు తినడం ఆరోగ్యానికి ఎప్పుడైనా చాలా మంచిది. ఒక్కోపండు ఒక్కోరకమైన రుచి, ఒక్కోరకమైన ఆరోగ్య ప్రయోజనాలతో దేనికదే ప్రత్యేకం. అన్ని రకాల పండ్లు తినాలి. అన్ని రకాల కాయగూరలు కూడా తప్పని సరిగా తినాలి.  కానీ మీకు తెలుసా? కొన్ని పండ్లు కలిపి తీసుకోకూడదట. అలాగే కొన్ని పండ్లు, కాయగూరలు కూడా కలిపి తినకడదట.  అలా కలిపి తింటే జీర్ణసమస్యలు మాత్రమే కాదు ఓవరాల్ హెల్త్ మీదే చెడు ప్రభావం ఉండవచ్చని న్యూట్రిషనిస్టులు అంటున్నారు. ముఖ్యంగా పిల్లలకు పెట్టే ముందు కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకుని ఉండడం అవసరం.


క్యారెట్ – ఆరెంజ్


క్యారెట్, ఆరెంజ్ కలిపి తీసుకోకూడదు. ఇలా కలిపి తీసుకుంటే గుండెల్లో మంట రావచ్చు. కిడ్నీలకు కూడా నష్టం జరుగుతుందట. కనుక క్యారెట్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ ఒకేసారి తీసుకోవడం లేదా కలిపి తీసుకోవడం చెయ్యకూడదు.


బొప్పాయి – నిమ్మ


బొప్పాయి, నిమ్మకాయ చాలా ప్రమాదకరమైన కాంబినేషన్. ఇలా తీసుకుంటే అనిమియాకు దారి తీస్తుంది. హీమోగ్లోబిన్ సమతుల్యత తప్పుతుంది. పిల్లలకైతే చాలా ప్రమాదకరం కూడా. కనుక బోప్పాయి నిమ్మ కలిపి తీసుకోకూడదు.


పాలు – ఆరెంజ్


పాలు, ఆరెంజ్ ఒకే సారి తీసుకుంటే జీర్ణక్రియ కు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాదు రకరకాల ఆనారోగ్యాలు కూడా కలుగవచ్చు. ఆరెంజ్ సిరియల్స్ లో ఉండే పిండిపదార్థాల సంశ్లేషణకు దోహదం చేస్తాయి. పాలతో ఉన్న సిరియల్ తోపాటు ఆరెంజ్ కూడా ఇస్తే కచ్చితంగా అజీర్తి సమస్యలు వస్తాయి.


జామ – అరటి


జామ పండు, అరట పండు కలిపి ఎప్పుడూ తీసుకోకూడదు. ఈ కాంబినేషన్ అసిడోసిస్, వికారం, కడుపులో గ్యాస్ చేరడానికి, తలనొప్పి కి కూడా కారణం కావచ్చు.


కాయగూరలు, పండ్లు కలపకూడదు


సలాడ్ గా చేసుకుని తింటున్నపుడు కాయగూరలకు ప్రత్యేకంగా సలాడ్ చేసుకోవాలి. ఫ్రూట్ సలాడ్ వేరుగా చేసుకోవాలి. రెండు కలిపి ఒకే సలాడ్ గా చేసుకుని తినకూడదు. రెండు సలాడ్లు ఒకే సారి తినకూడదు. ఎందుకంటే పండ్లలో ఎక్కువ షుగర్ ఉంటుంది. కనుక జీర్ణం కావడానికి కొంచెం ఎక్కువ సమయం కూడా పడుతుంది. కనుక కడుపులో ఎక్కువ సమయం పాటు ఉంటాయి. కూరగాయలు కలిపి తీసుకున్నపుడు పండ్లు ఎక్కువ సమయం పాటు కడుపులో ఉండడం వల్ల ఫర్మెంట్ అవుతాయి. అందువల్ల కడుపులో టాక్సిన్స్ తయారవుతాయి. ఫలితంగా డయేరియా, తలనొప్పి, కడుపులో ఇన్ఫెక్షన్, కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు.


పైనాపిల్ – పాలు


పైనాపిల్ లో బ్రొమోలిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది పాలతో కలిసినపుడు కడుపులో రకరకాలుగా ఉండొచ్చు. ఎన్నో రకాల సమస్యలు కూడా రావచ్చు. వికారం, కడుపులో గ్యాస్, ఇన్ఫెక్షన్, తలనొప్పి, కడుపునొప్పి ఇలా రకరకాల అనారోగ్యాలు కలిగే ప్రమాదం ఉంటుంది.


అరటి పండు – పుడ్డింగ్


అరటి పండైనా, పుడ్డింగ్ అయినా రెండూ కూడా నెమ్మదిగా అరుగుతాయి. కనుక రెండూ కలిపి తీసుకున్నపుడు కడుపులో మరింత హెవీగా మారి ఎక్కువ సమయం పాటు కడుపులో ఉండడం వల్ల టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ కాంబినేషన్ పిల్లలకు ప్రమాదకరం.