కొంతమంది మొహం చూసే మన వయస్సు ఎంత ఉంటుందో అంచనా వేసి చెప్తారు. వయస్సు ఎక్కువగా ఉన్నప్పటికి మొహంలో అది తెలియకపోతే చాలా సంతోషిస్తారు. కానీ కొంతమందికి మాత్రం వయస్సు తక్కువగా ఉన్న చర్మం ముడుచుకుపోయి ఏజ్ ఎక్కువగా అనిపిస్తుంది. కారణం చర్మానికి అవసరమైన ప్రోటీన్స్ అందకపోవడం, అధిక ఒత్తిడి, పోషకాహారం సరిగా తీసుకోకపోవడం. వయసు కనిపించకుండా దాచేందుకు క్రీములు రాసుకోవడం మేకప్ చేసుకోవడం చేస్తారు. ఇది కాసేపు మాత్రమే అందాన్ని ఇస్తుంది. అలా కాకుండా సహజమైన అందాన్ని పొందాలంటే పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందటం కోసం, ముడతలు తగ్గించుకునేందుకు కొన్ని రకాల పండ్లు తింటే ఈ సమస్య నుంచి బయట పడొచ్చు. ఈ పండ్లు తింటే మీ వయస్సు ఎక్కువగా ఉన్నప్పటికీ యవ్వనంగా కనిపించవచ్చు. ఫ్రూట్స్ తినడం వల్ల చర్మం మీద వచ్చే ముడతలు తగ్గిపోతాయి. 


అప్రికాట్ 


ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుండి. ఇది చర్మం దృఢంగా ఉండేందుకు దోహద పడుతుంది. ఈ పండు గుజ్జుని చర్మ సంరకాశం కోసం వాడే సౌందర్య ఉత్పత్తులలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని నేరుగా తినవచ్చు లేదా ఫేస్ ప్యాక్ లాగా కూడ వేసుకోవచ్చు. ఇలా చెయ్యడం వల్ల అందమైన మెరిసే మొహం మీ సొంతం అవుతుంది. 


యాపిల్  


యాపిల్ లో అన్నీ రకాల పోషకాలు ఉంటాయి. వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేసే గుణం ఇందులో ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఒక యాపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండొచ్చు అని అంటారు. అంతే కాదు కాంతివంతమైన చర్మాన్ని కూడా మీకు అందిస్తుంది. యాపిల్ సైడ్ వెనిగర్ ని మృదువైన చర్మం కోసం వాడుకునే సౌందర్య సాధనల్లో ఉపయోగిస్తారు. 


అంజీరా 


అంజీరా లేదా అంజూర పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముందస్తు వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుని. మహిళలకి అవసరమైన ఈస్ట్రోజెన్ తగ్గినప్పుడు ఈ అంజీరా తింటే చాలా బాగా పని చేస్తుంది. అందుకే వీటిని నీళ్ళల్లో నానబెట్టుకుని తింటారు. ఈ పండు మీ చర్మానికి సహజమైన అందాన్ని ఇవ్వడమే కాకుండా వయసు కనిపించకుండా చేస్తుంది. 


పైనాపిల్ 


ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగ్గా ఉండేలా చేయడంతో పాటు కణాలకు పోషణ అందిస్తుంది. వృద్ధాప్య ప్రక్రియ మందగించేలా చేసేందుకు అవసరమయ్యే  ఆల్ఫా-హైడ్రాక్సీ యాసిడ్స్ ఇందులో మెండుగా ఉంటాయి. 


పుచ్చకాయ 


వేసవి కాలంలో లభించే పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరం డీ హైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. వడదెబ్బ నుంచి కొలుకునేల చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్స్, ఖనిజాలు వృద్ధాప్యాన్ని నివారించడంతో పాటు చర్మ ఛాయను మెరుగుపరుస్తాయి.


దానిమ్మ 


దీనిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తం పెరిగేందుకు సహాయపడటమే కాదు చర్మాన్ని ప్రకాశవంతంగాను చేస్తుంది. చర్మం ముడతలు రాకుండా చేసే కొల్లాజెన్ ప్రోటీన్ ను ఇది అందిస్తుంది. 


బొప్పాయి 


చర్మ సంరక్షణకి ఉపయోగపడే విటమిన్ ఎ, సి, ఇ ఇందులో పుష్కలంగా ఉంటాయి. వయస్సు కనిపించకుండా చేసే గుణం ఇందులో ఉంది. క్రమం తప్పకుండా బొప్పాయి తీసుకోవడం వల్ల మీ చర్మం కాంతివంతంగా ఉంటుంది. 


పీచ్(Peach)


లుటీన్ మరియు జీయాక్సిటీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్  ఉన్నాయి. సూర్యరశ్మి నుంచి మీ చర్మాన్ని ఇది రక్షిస్తుంది. ఏజ్ కనిపించకుండా చేసే పలు సౌందర్య ఉత్పత్తులలో ఈ పండుని ఉపయోగిస్తారు. ఇది చూసేందుకు యాపిల్ ని పోలి ఉంటుంది. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: వాక్సింగ్- షేవింగ్ లో ఏది మంచిది? మీ స్కిన్ కి ఏది సరిపోతుందో తెలియడం లేదా?


Also read: చారు పొడి కొనుక్కుంటున్నారా? ఇలా సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు