Nambi Narayanan Biopic OTT Release Date : నంబి నారాయణన్... ఇస్రో శాస్త్రవేత్త. ఏపీజే అబ్దుల్ కలాం సహచరుడు. దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త. అయితే... ఆయన జీవితంలో అంతులేని విషాదం ఉంది. సరైన ఆధారాలు లేకుండా ఆయన్ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన కుటుంబం పట్ల సమాజం ఎలా ప్రవర్తించింది? ఏమైంది? అనేది కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ మాధవన్ సినిమా తెరకెక్కించారు.


మాధవన్ (Madhavan) కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకుడిగా పరిచయమైన చిత్రం 'రాకెట్రీ - ది నంబి ఎఫెక్ట్' (Rocketry Movie). ఈ సినిమా నిర్మాతల్లోనూ మాధవన్ ఒకరు. రాకెట్ సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా జూలై 26 నుంచి (Rocketry The Nambi Effect Movie OTT Release Date) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.


Also Read : అది పాస్తా వల్ల వచ్చిన కడుపు, ప్రెగ్నన్సీ కాదు - రూమర్లకు చెక్ పెట్టిన కరీనా కపూర్


థియేటర్లలో 'రాకెట్రీ'కి చక్కటి ప్రశంసలు లభించాయి. నటుడిగా ఆకట్టుకోవడంతో పాటు దర్శకుడిగా మాధవన్ చక్కటి ప్రతిభ కనబరిచారని ప్రేక్షకులు, విమర్శకులు పేర్కొన్నారు. ముఖ్యంగా సెకండాఫ్ కన్నీళ్లు పెట్టిస్తుందని చాలా మంది చెప్పారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం... నాలుగు దక్షిణాది భాషల్లో 'రాకెట్రీ' సినిమా ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల కానుంది.  


Also Read : పూరితో విజయ్ హ్యాట్రిక్ సినిమా ప్లాన్ - ఈసారి సోషియో ఫాంటసీ స్టోరీ!