The Gray Man: ధనుష్ 'ది గ్రే మ్యాన్' - తీయడానికి తొమ్మిదేళ్లు! ఎందుకంటే?

ధనుష్ కీలక పాత్రలో నటించిన హాలీవుడ్ సినిమా 'ది గ్రే మ్యాన్' శుక్రవారం (జూలై 22న) నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా తీయడానికి తొమ్మిదేళ్లు సమయం పట్టిందని టాక్.

Continues below advertisement

'ది గ్రే మ్యాన్' (The Gray Man Movie)... ఈ శుక్రవారం (జూలై  22న) నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో విడుదల కానున్న సినిమా. ఇందులో ర్యాన్ గోస్లింగ్ (Ryan Gosling) కథానాయకుడు. క్రిస్ ఇవాన్స్,  అనా డి ఆర్మాస్, ఇండియన్ యాక్టర్ ధనుష్ (Dhanush) కీలక పాత్రల్లో నటించారు. యాక్షన్ ఎంట‌ర్‌టైనర్స్‌కు పెట్టింది పేరైన రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించారు.
  
'ది గ్రే మ్యాన్' ప్రచార చిత్రాలు చూస్తే... ఇదొక యాక్షన్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ అని ప్రేక్షకులకు అర్థం అవుతోంది. మార్క్ గ్రీనీ రాసిన బుక్ ఆధారంగా, సినిమాకు తగ్గట్టు మార్పులు చేసి రూసో బ్రదర్స్ తెరకెక్కించారు. ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే... 'ది గ్రే మ్యాన్' తీయాలనే ప్లాన్ ఇప్పటిది కాదు. తొమ్మిదేళ్ల క్రితానిది. ఈ విషయం రూసో బ్రదర్స్ చెప్పారు.
 
''ఈ సినిమా తీయడానికి మాకు తొమ్మిది సంవత్సరాలు పట్టింది. బిజీ షెడ్యూల్స్ వల్ల కుదరలేదు. అయితే... మార్క్ గ్రీనీ రైటింగ్, రీసెర్చ్ చూసి ఆశ్చర్యపోయాం. మేం 70లలో వచ్చిన థ్రిల్లర్ సినిమాలు చూస్తూ పెరగడంతో... వాటి స్ఫూర్తితో కొత్తగా తీశాం. ప్రేక్షకులు 'ది గ్రే మ్యాన్' ప్రపంచంలోకి లీనం అవుతారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రేక్షకులు చూసేటప్పుడు ఉత్కంఠకు గురి అవుతారు'' అని రూసో బ్రదర్స్ చెప్పారు.

Continues below advertisement

Also Read : చలో ఇంటర్నేషనల్ - అనుష్క 48వ సినిమాలో ఆమె రోల్ అదే
 
'ది గ్రే మ్యాన్'ను లాస్ ఏంజిల్స్, ఫ్రాన్స్, చెక్ రిపబ్లిక్, థాయిలాండ్, క్రొయేషియా, ఆస్ట్రియా, అజర్‌ బైజాన్‌ తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ చేశారు. ఈ సినిమా కోసం విక్కీ కౌశల్ స్పెషల్ వీడియో చేశారు. భారతీయ ప్రేక్షకుల్లోనూ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

Also Read : చెన్నై అపోలో ఆస్పత్రిలో మణిరత్నం, ఆందోళనలో ఫ్యాన్స్ - ఆయనకు ఏమైందంటే?

Continues below advertisement