హనీ చైన్ పెరట్లో దొరికిందని చెప్పి దివ్య తెచ్చి ఇస్తుంది. దాన్ని తీసుకుని తులసి సామ్రాట్ ఇంటికి బయల్దేరుతుంది. అసలు ఈ తలనొప్పి అంతా బాబాయ్ వల్లే చెప్పా పెట్టకుండా తులసిని జైల్ నుంచి విడిపించాడు. అది ఏకు మేకయి కూర్చుంటుంది. నా పరపతి ఏంటో తెలిసి కూడా తెగించి బిహేవ్ చేస్తుందని సామ్రాట్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే తులసి వస్తుంది. నాకు కావలసింది నువ్వు రావడం కాదు హనీ గొలుసు తెచ్చి ఇవ్వడం అని సామ్రాట్ అనడంతో తులసి చైన్ తీసి ఇస్తుంది. భయమంటే ఇలా ఉండాలని అంటాడు. నేను భయపడి దాన్ని తీసుకుని తెచ్చి ఇవ్వలేదు దొరికింది కాబట్టి తెచ్చి ఇచ్చానని చెప్తుంది.
సామ్రాట్: మా వాళ్ళు ఇల్లంతా వెతికినా దొరకని చైన్ ఇప్పుడు ఎలా పుట్టుకొచ్చిందో.. మా గార్డెన్లో దొరికిందనేగా నువ్వు చెప్పబోయే అబద్ధం.
తులసి: అది అబద్ధం కాదు నిజం. మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వనివి రెండే రెండు. ఒకటి మనసులో అనుమానం, రెండు జరిగిన అవమానం. మీరు అనుమానంతో ప్రశాంతంగా ఉండటం లేదు. అవమానిస్తు ప్రశాంతనని కూడా చంపేస్తున్నారు.
సామ్రాట్: నా హనీ గొలుసుని నువ్వే దొంగిలించవని ఒప్పుకో అప్పుడు నిన్ను అనుమానించడం ఆపేస్తాను.
తులసి: వ్యక్తిత్వాన్ని కోల్పోయే మనిషిని కాదు
సామ్రాట్: బుకాయించిన మాత్రాన మీరు చెప్పే అబద్ధాలు నిజాలు అయిపోవు
తులసి: మీరు అనుమానించినంత మాత్రాన దొంగని అయిపోను. కొద్దిగా అయిన ఆలోచించండి మీ బుద్ధి తెలిసి కూడా రెండో సారీ మీ పాప జోలికి ఎలా వస్తానని అనుకున్నారు. పాపని ఇంటికి రమ్మని నేనేం పిలవలేదు. మీకు మనుషులని నమ్మే అలవాటు లేదనుకుంటా
సామ్రాట్: నేను మధ్య తరగతి వాళ్ళని అసలు నమ్మను. వాళ్ళంత డబ్బు మనుషులు ఎవరు ఉండరు అవసరం అయితే ప్రాణాలైన తీస్తారు.
తులసి: మధ్య తరగతి వాళ్ళకి ఉండేది డబ్బు పిచ్చి కాదు ఆత్మీయతలు, ప్రేమనురాగాలు అవి మీ డబ్బున్న వాళ్ళకి అర్థం కావు. నిజంగానే నేను డబ్బు పిచ్చి ఉన్నదాన్ని అయితే గొలుసు తీసుకురాకుండా ఉండేదాన్ని ఇప్పుడు ఏం చేయగలిగే వాళ్ళు. మీరు ఇలా అనుమణిస్తారని తెలిసే మా వాళ్ళు ఈ ఇంటికి వెళ్లొద్దని చెప్పారు. ఎందుకో తెలుసా ఇది మీ చెల్లెలి జ్ఞాపకం అని చెప్పారు కాబట్టి. దూరమైన ఆ జ్ఞాపకాల విలువ నాకు తెలుసు కాబట్టి మీకు తెచ్చాను. డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి అవి తెలుసుకుని మనిషిగా మారండి అని చెప్పి వెళ్ళిపోతుంది.
హనీ తులసి బొమ్మ గిస్తూ నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని బాధపడుతుంది. అప్పుడే అక్కడికి సామ్రాట్ వస్తాడు. డబ్బు కోసం కొంతమంది చాలా చేస్తారు. ఆ తులసి కూడా అలాంటిదే. నువ్వు తులసి ఆంటీ కి దూరంగా ఉండమని చెప్తాడు. తులసిని నమ్మడానికి వీల్లేదు అందుకే ప్రేమ నటిస్తూ నిన్ను దగ్గర చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని చెప్తాడు.
ప్రేమ్ సూపర్ సింగర్ ట్రోఫీ గెలిచినట్టు పేపర్లో వార్తా చూస్తాడు మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడే శ్రుతి కాఫీ తీసుకుని వస్తుంది. ఈరోజు నుంచి పని మానేస్తున్న అని చెప్పడంతో పేపర్లో ఫోటో పడిన తర్వాత ని లెవల్ పెరిగిపోయిందని వెటకారంగా మాట్లాడతాడు. ఇక ప్రేమ్ పేపర్లో ఫోటో పడిన విషయం చూపించాలని అనుకుంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి వస్తాడు. అప్పుడే శ్రుతిని చూసి షాక్ అవుతాడు. ఏంటి సర్ అలా షాక్ లో ఉన్నారు మీ ఆవిడ పని మానేస్తుందనా అంటు నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. ఆ మాటలకి ప్రేమ్ కొప్పడతాడు. పెళ్ళాం సంపాదించే డబ్బుతో బతికే వాడివి నువ్వా మాట్లాడేది అని ప్రేమ్ ని బాగా అవమానిస్తాడు.ఆ మాటలకి ప్రేమ్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు.
తులసిని సంజన ఒక డాన్స్ స్కూల్ కి తీసుకొస్తుంది. సంగీతం క్లాసులు చెప్తునడాని స్కూల్ ప్రిన్సిపల్ కి పరిచయం చేస్తుంది. తులసిని స్కూల్ లో హనీ చూస్తుంది. నా కోసమే ఆంటీ ఇక్కడికి వచ్చినట్టు ఉన్నారని పలకరిస్తుంది. తులసిని చూసి నేనే కిందకి వస్తానని చెప్పి లిఫ్ట్ ఎక్కుతుంది. సరిగ్గా అదే సమయానికి సామ్రాట్ హనీ లంచ్ బాక్స్ మర్చిపోయిందని చెప్పి తీసుకుని వస్తూ ఉంటాడు. స్కూల్లో కరెంట్ పోవడం వల్ల లిఫ్ట్ ఆగిపోతుంది అందులో హనీ ఇరుక్కుపోతుంది. ఆంటీ లోపల చీకటిగా ఉంది నాకు భయంగా ఉంది లిఫ్ట్ ఓపెన్ చెయ్యమని అరుస్తుంది. ఇక అప్పుడే సామ్రాట్ స్కూల్ కి వస్తాడు.
Also Read: మిస్టర్ యారగెంట్ అదరగొట్టాడు, వేద నిజాయితీని నిరూపించిన యష్- ఖైలాష్ చెంప పగలగొట్టిన వేద