'నువ్వు ఏం టెన్షన్ పడకు, ఎవ్వరికీ భయపడకు. నన్ను నమ్ము. నువ్వు చెప్పేదాన్ని బట్టే నేను ఏదైనా చెయ్యగలను. ఒక పక్క వేద, మరో పక్క నువ్వు ఇద్దరు నాలిగిపోయారు నష్టపోయారు, మీ ఇద్దరికీ అన్యాయం జరిగింది, మీకు నేను న్యాయం చేస్తాను, నేను నీకు ఉన్నాను భయపడకు' అని యష్ సారికకి భరోసా ఇస్తాడు. 'థాంక్యూ సర్ ఈ మాత్రం సానుభూతి ఇప్పటిదాకా ఎవ్వరూ ఇవ్వలేదు మీరు ఇచ్చారు, ఎవ్వరికీ చెప్పలేక చచ్చిపోతున్నాను సర్ ఇప్పుడు ధైర్యంగా ఉంది నా మనసుకి రిలీఫ్ గా ఉంది. నా పరిస్థితి అంతా చెప్తాను. మా అమ్మ చావుబతుకుల్లో ఉంది. నాకు మా అమ్మ తప్ప ఎవరు లేరు. తన వైద్యానికి చాలా ఖర్చు అవుతుంది. మా అమ్మని కాపాడుకోవాలంటే నాకు చాలా డబ్బు కావాలి. చిన్న ఉద్యోగం చేస్తున్నాను, వైద్యానికి ఆ డబ్బు సరిపోదు. మా అమ్మే నా బలహీనత, దాన్ని వాడుకుని ఒక దుర్మార్గుడు నన్ను లొంగదీసుకున్నాడు. ఆ దుర్మార్గుడు ఎవరో కాదు మీ సిస్టర్ హజ్బెండ్ ఖైలాష్. దుబాయి లో నాకు పరిచయం అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. ఖైలాష్ నాకు ప్రామిస్ చేశాడు మా అమ్మ ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు భరిస్తానని. నేను దాన్ని గుడ్డిగా నమ్మి మోసపోయాను' సర్ అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. తను చెప్పింది చేయకపోతే మా అమ్మని చంపేస్తానని బెదిరించాడు, అందుకే తను చెప్పినట్టు వినాల్సి వచ్చిందని యష్ కి చెప్తుంది. నువ్వు ఒంటరి దాన్ని కాదు నీకు అన్న లాగా నేను ఉంటాను, మీ అమ్మకి నేను ట్రీట్మెంట్ చేయిస్తాను, నువ్వేం దిగులు పడకు అని హామీ ఇస్తాడు. నా వల్ల వేద మేడమ్ కి అవమానం జరిగింది, నాకు న్యాయం చెయ్యడం కోసం స్టేషన్ కి తీసుకుని వెళ్లారు. కానీ ఆఖరి నిమిషంలో మాట మార్చి వేద మేడమ్ ని లాకప్ లోకి వెళ్ళేలా చేశాను నన్ను క్షమించండి సర్ అని సారిక ప్రాధేయపడుతుంది.
Also Read: పాపం మిస్టర్ యారగెంట్, వేద ముందు పరువు పోయే- ఎట్టకేలకు సారికను పట్టుకున్న యష్, నిజం బట్టబయలు
వేదకి, నీకు జరిగిన అవమానానికి అన్నిటికీ ఒక్కటే పరిష్కారం ఆ ఖైలాష్ కి గుణపాఠం చెప్పాలంటే అతనికి వ్యతిరేకంగా గట్టిగా ధైర్యంగా నిలబడాలి అని యష్ అంటాడు. అందుకు సారిక ఒప్పుకుంటుంది. నా భార్య ఏ తప్పు చేయలేదని భర్తగా నా బాధ్యతగా నిరూపిస్తానని యష్ మనసులో అనుకుంటాడు. ఇక వేద అక్క ఖైలాష్ మీద కేసు పెట్టాలని గొడవ చేస్తుంది. ఆ మాటలన్నీ కాంచన విని ఏడుస్తూ మాలిని దగ్గరకి వచ్చి చెప్తుంది. వాళ్ళు మన పరువు బజారున పడేయాలని నిర్ణయించుకున్నారని భోరున ఏడుస్తుంది. అది చూసి మాలిని వాళ్ళ అంతు చూస్తానని అరుస్తూ సులోచన వాళ్ళని పిలుస్తుంది. మా అల్లుడిగారి మీద పోలీసు కేసు పెడతారా అని నిలదిస్తుంది. కాసేపు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ మాటలకి వేద బాధగా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇక ఖైలాష్ యష్ కి నా మీద అనుమానం వచ్చిందంటే చంపేస్తాడు అర్జెంట్ గా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనుకుంటాడు. అప్పుడే కాంచన వచ్చే సరికి డ్రామా మొదలు పెడతాడు. ఇంట్లో నుంచి మనం వెళ్లిపోవాలి అని అనుకుంటారు. ఇక కాంచన, ఖైలాష్ బ్యాగ్ సర్దుకుని బయటకి రావడం చూసి మాలిని, రత్నం అడ్డుపడతారు. ఇంట్లో నుంచి వెళ్ళే టైం కి యష్ గుమ్మం దగ్గర ఎదురుపడతాడు.
ఏంటి మీరు చేస్తున్న పని స్వయంగా నేనే వచ్చి మిమ్మల్ని సాగనంపుతానని చెప్పాను కదా ఎందుకు మీకు అంత తొందర. మిమ్మల్ని కలిసేందుకు స్పెషల్ పర్సన్ వచ్చారు అని చెప్పి సారికను పిలుస్తాడు. ఈ అమ్మాయి వేద క్లినిక్ లో పని చేస్తుంది కదా ఇక్కడికి ఎందుకు వచ్చిందని మాలిని యష్ ని అడుగుతుంది. దానికి సమాధానం మీ అల్లుడిగారిని అడగండి అంటాడు. మళ్ళీ మా ఆయన మీద ఏవో నిందలు వేస్తున్నారు మేము వెళ్లిపోతామని కాంచన అంటే యష్ అడ్డుపడతాడు. ఈ అమ్మాయితో నీకు ఏంటి సంబంధమో చెప్పు అని మాలిని, యష్ ఖైలాష్ ని అడుగుతారు. ఇక వేద కుటుంబ సభ్యులు కూడా వస్తారు. సారిక నాకు ఇంతక ముందే పరిచయం కొంచమే పరిచయం అనేసరికి మొహం పగిలిపోతుందని యష్ వార్నింగ్ ఇస్తాడు. నిజం వీడు చెప్పలేడు నిజం ఏంటంటే ఈ నీచుడు ఆ అమ్మాయిని మోసం చేసి వదిలేశాడని యష్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇక సారిక జరిగింది అంతా చెప్తుంది. తనకి పెళ్లి అయిన విషయం దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని చెప్తుంది. 'తను ఎక్కడ కేసు పెడుతుందో అని భయపడి దుబాయి నుంచి పారిపోయి వచ్చాడు, ఇలాంటి ఎందరో అమ్మాయిల జీవితాలని నాశనం చేశాడు. మా అందరి కంటే ఎక్కువగా నిన్ను వేద నమ్మింది. అందుకే కాంచన కోసం నీ తరుపున నాదగ్గరకి వచ్చి బతిమలాడి నా చేత నీకు పది కక్షలు ఇప్పించింది, ఉద్యోగం కూడా ఇవ్వమని అడిగింది. కానీ నువ్వేం చేశావ్ నీకు చెల్లెలు లాంటి వేద జీవితంతో చెలగాటం ఆడావ్. పాపం సారిక వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోలేదు తనని అడ్డుపెట్టుకుని మోసం చేసేందుకు ప్రయత్నించావ్' అని యష్ ఖైలాష్ ని నిలదీస్తాడు. యశోధర్ గారు చెప్పిన ప్రతి మాట నిజమే ఇతను చెప్పినట్టు చేయకపోతే మా అమ్మని చంపేస్తానని బెదిరించాడని సారిక చెప్తుంది.
Also Read: వసుని అవమానించిన సాక్షికి మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్ ఇచ్చిన రిషి, మనసులో ప్రేమను చెప్పకనే చెప్పిన వసు
ఇక కాంచన ఇదంతా నిజం కాదని ఏడుస్తుంది. ఇంత జరిగిన ఖైలాష్ మాత్రం నిజం ఒప్పుకోడు. వేద ఎలాంటి తప్పు చేయలేదని నాకు ముందే తెలుసు క్షమించండి. మా అక్క జీవితం కోసం ఆరోజు మౌనంగా ఉన్నానని వేద కుటుంబ సభ్యులు అందరికీ క్షమాపణ చెప్తాడు. ఈ నీచుడికి ఇవ్వాల్సిన స్థానం ఎంతో నువ్వే చెప్పు సరైన గుణపాఠం నేర్పించమని వేదతో యష్ అంటాడు. వేద కోపంగా వచ్చి ఖైలాష్ చెంప పగలకొడుతుంది.
తరువాయి భాగంలో..
వేద నీకు న్యాయం జరిగింది కదా ఖైలాష్ జైలుకి వెళ్ళాడు కదా మరి కాంచన పరిస్థితి ఏంటి. నాకు ఫీలింగ్స్ లేవు కానీ నీకు ఉన్నాయ్ కదా ఎప్పుడు అందరి మంచే కోరుకుంటావ్ కదా ఎవరికి చెడు చెయ్యవ్ కదా మరి ఇంత జరుగుతుంటే నాకెందుకు చెప్పలేదు. నేను నీకు సహాయం చేయలేనని నేకు నువ్వే అనేసుకున్నవా. నేను ఇంత చేసిన ఇంకా ఏమైనా మిగిలి ఉంది అని ఒకవేళ ఎవరికైనా అనిపిస్తే సారీ. ఇంతకంటే నేనేమీ చెయ్యలేను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.