చెస్ పోటీలు ప్రారంభమవుతాయి. అన్నీ రౌండ్స్ లో దేవి ప్రతిభ కనబరుస్తుంది. నా బిడ్డ ఈ ఆటలో గెలవాలి ఆఫీసర్ సారు మీ నాయన అని చెప్పాలని రుక్మిణి మనసులో అనుకుంటుంది. నా కూతురు ఛాంపియన్ కావాలని ఆదిత్య ఆశపడతాడు. ఇక సత్య ఆదిత్య దేవి నా బిడ్డ అని చెప్పిన మాటలు తలుచుకుంటూ ఉంటుంది. అప్పుడే కమల అక్కడికి వస్తుంది. దేవి ఇక్కడికి వచ్చిన తర్వాత పటేల్ మొహం చూశావా ఎంత సంతోషంగా ఉన్నదో అని కమల అంటుంది. అవునక్క దేవి అంటే అదిత్యకి మొదటి నుంచి ఇష్టమని సత్య చెప్తుంది. 'బిడ్డ అన్నాక ఏ బిడ్డ అయిన దగ్గరకి తీస్తాం ప్రేమ చూపిస్తాం అది అందరూ చేసేదే కానీ నేను పటేల్ ని చూసినా కదా దేవిని స్వంత బిడ్డ లాగా చూస్తున్నాడు. తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే దేవి నిజంగానే తన బిడ్డ' అనుకుంటారు. పిల్లలు లేరు కాబట్టి కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు దాన్ని మనం తప్పు పట్టలేం కదా అని సత్య అంటుంది.
Also Read: మిస్టర్ యారగెంట్ అదరగొట్టాడు, వేద నిజాయితీని నిరూపించిన యష్- ఖైలాష్ చెంప పగలగొట్టిన వేద
'పటేల్ బిడ్డల కోసం ఎంత బాధపడ్తున్నాడో అర్థం అవుతుంది. అందుకే నువ్వు అమెరికా పోయి వచ్చినాక శుభవార్త చెప్పాలి. అత్తమ్మని చూస్తుంటే పరేషాన్ గా ఉంది, ఇటు పటేల్ తన బిడ్డ మీద చూపించాల్సిన ప్రేమ్ ఎవరి బిడ్డ మీదో చూపిస్తున్నాడు. గందుకే నీ కడుపు కాయాలి. నీకు ఒక బిడ్డ పుడితే అప్పుడే ఈ ఇంట్లో సంబరాలు జరుగుతాయి. పటేల్ ని చూసినక నీకు ఈ మాట చెప్పాలని' అనిపించిందని చెప్తుంది. నాకు తెలుసక్క ఆదిత్య పిల్లల కోసం ఎంతగా అల్లాడుతున్నాడో అందుకే నా కడుపున పుట్టకపోయిన అక్కకి పుట్టిన బిడ్డని తన బిడ్డ లాగా ప్రేమిస్తున్నాడు. ఈ మాట నీకు చెప్పలేను వద్దు అని అదిత్యకి అడ్డుపడలేను. దేవిని స్వంత బిడ్డ లాగా చూసుకుంటున్నాడు, కాబట్టి ఆటలో గెలిపిస్తాడు అన్నిటిలో గెలిపిస్తాడని సత్య అనుకుంటుంది. మీ ఇద్దరి టెన్షన్ చూస్తుంటే దేవి గెలవడం చాలా అవసరం అనుకుంటా అని మాధవ రుక్మిణితో అంటాడు. ఆ మాటకి అవును చాలా అవసరం మా బిడ్డ గెలవాలని మేము గాక నువ్వు కోరుకుంటావా అని రుక్మిణి అంటుంది. అంతేనా నా బిడ్డని నాకు దూరం చెయ్యాలని ఏమైనా ప్లాన్ వేశారా, అలాంటిది ఉంటే ముందే నాకు చెప్పండి నేను ప్రిపేర్ అవ్వాలి కదా అని మాధవ అంటాడు. ఇక పోటీల్లో దేవి విజయం సాధిస్తుంది. అది చూసి ఆదిత్య, రుక్మిణి మురిసిపోతారు. వెంటనే దేవి వెళ్ళి అదిత్యని కౌగలించుకోవడంతో మాధవ రగిలిపోతాడు. జూనియర్ చెస్ ఛాంపియన్ దేవి అని ప్రకటిస్తారు. ఏదో జరుగుతుంది రాధ మొహంలో ఆ ఆనందం దేవి గెలిచిందనే కాదు ఇంకేదో ఉందని మాధవ అనుమానపడతాడు.
Also Read: రౌడీ బేబీ తగ్గట్లేదు, డాక్టర్ సాబ్ మారడంలేదు - మధ్యలో ఉక్కిరి బిక్కిరవుతున్న హిమ
పోటీలో గెలిచినందుకు గాను ఆదిత్య ట్రోఫీని అందిస్తాడు. 'నేను ఈ కప్పు గెలవడానికి కారణం మా ఆఫీసర్ సారె. సార్ దగ్గర ఉండి ఎలా ఆడాలో నేర్పించారు. నేను ఓడిపోయిన అని బాధపడితే ఒడిపోయానని బాధపడటం కాదు ఎక్కడ తప్పు చేశావో అని ఆలోచిస్తే ఆ తప్పు తెలుస్తాది, ఆ తప్పు దిద్దుకుంటే గెలుస్తావని చెప్పాడు. నేను ఓడిపోయిన ప్రతి సారీ మా సర్ చెప్పినట్టు చేశాను. గెలిచాను, కాదు మా సారె నన్ను గెలిచేలా చేశాడు' అని చెప్తుంది. ఆ మాటలకి మాధవ కుళ్ళుకుంటుంటే ఆదిత్య, రుక్మిణి సంబరపడతారు. ఇది మన ఆలోచనలకి పదును పెట్టె ఆట, బోర్డు మీద కాయిన్స్ కదుపుతుంటే జీవితంలో ఎలా ఎదగాలో నేర్పిస్తుంది. చెక్ పెట్టిన ప్రతిసారీ గెలవాలని పట్టుదల పెరుగుతుంది. ఇది ఆట కాదు జీవితం. ఈ ఆట ఆడిన అందరికీ అల్ ది బెస్ట్ అని చెప్తాడు. ఇక గెలిచినందుకు సంతోషంగా దేవిని దగ్గరకి తీసుకుని ముద్దుపెడతాడు. ఇప్పుడు నా మనసుకి నిమ్మళంగా ఉంది పెనిమిటి నేను ఏమనుకున్నానో అది జరుగుతుంది, బిడ్డ ఆటలో గెలిచింది, నీ గురించి గొప్పగా చెప్తుందని రుక్మిణి సంతోషంగా అంటుంది. దేవి గెలిస్తే చాలు నా గురించి గొప్పగా చెప్పాలసిన పని లేదని ఆదిత్య అంటాడు. ఇప్పుడు ఆటలో గెలిచిన ఆనందంలో ఉంది ఇప్పుడే నువ్వే నాయనవి అని దేవమ్మకి తెలియాలని రుక్మిణి అంటుంది.