కార్తీకదీపం జులై 18 సోమవారం ఎపిసోడ్ (Karthika Deepam july 18 Episode 1407)
సౌందర్య-ఆనందరావుతో నిరుపమ్ ఆవేదన
హిమంటే ఇష్టం..యంగేజ్ మెంట్ రోజు సడెన్ గా ఇష్టంలేదంది..ఇప్పుడు పెళ్లివరకూ వచ్చాక శౌర్యని పెళ్లిచేసుకోమని అడుగుతోంది. ఒకరి బలవంతంపై ఇష్టంలేకపోయినా షర్ట్ కొనగలం కానీ జీవిత భాగస్వామి అలా కాదు కదా నాకు ఏం మాట్లాడాలో అర్థంకావడం లేదు..మీరే ఓ పరిష్కారం ఆలోచించంచండి.. హిమ ఆలోచన కరెక్ట్ కాదు శౌర్యని పెళ్లిచేసుకోవడం అసంభవం అని చెప్పేసి నిరుపమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
వీళ్లిద్దరి గొడవలో ఎవరికి ఏం చెప్పినా మరొకరు బాధపడతారని అని సౌందర్య,ఆనందరావు అనుకుంటారు. ఇంతలో హిమ అక్కడకు వస్తుంది. ఏంటిందతా అని క్వశ్చన్ చేస్తే..నిరుపమ్ బావతో శౌర్యకి ఎలాగైనా పెళ్లిచేస్తాను అందుకు ఏమైనా చేస్తానంటుంది హిమ.ఇదంతా వింటుంది శౌర్య.
శౌర్య: హిమా నీకు నిజంగా నాపై ఇంత ప్రేమ ఉందా..డాక్టర్ సాబ్ ని నన్ను కలపడానికి నువ్వు ఇంతలా ఆరాటపడుతున్నావా? పెళ్లి ఫిక్స్ అయ్యాక కూడా నువ్వు నిరుపమ్ బావని నన్ను చేసుకోమని అంటున్నావంటే గ్రేట్ హిమా. నువ్వు మట్టి బుర్రవి.నాకోసం ఇంత చేస్తున్నా సరిగా అర్థం చేసుకోలేకపోయాను...సారీ హిమ...నిన్ను ఎన్నో మాటలన్నాను. అవన్నీ మర్చిపోయి మనం ఎప్పటిలా కలసి ఉందాం...
సౌందర్య, ఆనందరావు, హిమ అంతా శౌర్య మారిపోయిందనే ఆనందంలో ఉంటారు.
శౌర్య: ఏంటి నీ బుట్టలో పడతానని, మళ్లీ నీ మాయలో మునిగిపోతానని అనుకుంటున్నావా. హిమ ఏదో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే శౌర్య అస్సలు మాట్లాడనివ్వదు. బయట హోటల్ కి వెళ్లి మాట్లాడుకుని వచ్చి ఇప్పుడు డ్రామాలు వేస్తున్నావా. నువ్వు మేధావివే..మాహనటికి అమ్మమ్మవి..ఆ మొహంలో బాధ నటిస్తావ్ చూడు...
హిమ: నేను నటించడం లేదు ఇదంతా నిజమే...
శౌర్య: నిజమే అనిపించేంత సహజంగా నటిస్తావ్ నువ్వు..నీ ద్రోహం మరిచిపోలేను, నీ నటనను నమ్మను
Also Read: శౌర్యకి మళ్ళీ ఐ లవ్యూ చెప్పిన డాక్టర్ సాబ్- హిమ, నిరుపమ్ పెళ్లి చెడగొట్టేందుకు ప్రేమ్ స్కెచ్
ఇంటికి వచ్చిన నిరుపమ్ చిరాగ్గా ఉండడం చూసి స్వప్న వచ్చి ఏంట్రా హిమ దగ్గరకు వెళ్లావా అని మళ్లీ మొదలుపెడుతుంది. నిన్ను పెళ్లిచేసుకోను అని చెబుతున్నా దానివెంటే పడుతున్నావ్...నేను ఏం చెప్పినా వింటావ్ కానీ పెళ్లి విషయంలో నా మాట వినడం లేదు. నువ్వేంట్రా రేపో,మాపో పోయేదానిగురించి ఆరాటపడుతున్నావ్...
నిరుపమ్: అక్కడ హిమను పెళ్లిచేసుకోమని హిమ అడుగుతోంది, ఇక్కడ నువ్వు క్యాన్సర్ తో చనిపోతుందని చెబుతున్నావ్.. ఈ రెండూ అబద్ధాలు, జరగవని నాకు తెలుసు. హిమకు క్యాన్సర్ లేదని నాకు తెలుసు, హిమ గురించి నా పెళ్లి గురించి నువ్వు ఏమీ మాట్లాడొద్దు అనేసి కోపంగా వెళ్లిపోతాడు
స్వప్న: హిమ చనిపోయిన తర్వాత నిరుపమ్ తో జీవితం నీదేకదా అని శోభతో అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది.
Also Read: వసుని అవమానించిన సాక్షి, సపోర్ట్ చేసిన రిషి- సాక్షి, దేవయానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిపడేసిన జగతి
నా ఫ్రెండ్ వచ్చి శౌర్యతో అలా మాట్లాడేసరికి చాలా ఇబ్బంది పడ్డాను, ఏం చెప్పాలో, ఏం చెబితే శౌర్య బాధపడుతుందో అని ఆగిపోయాను అంటాడు ఆనందరావు. ఇంతలో అక్కడకు వచ్చిన శౌర్య..ఏంటి తాతయ్య ఆటో మనవరాలు అని చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారా. ఆ ఇంటి నుంచి వచ్చినప్పుడే చెప్పాను ఆటోనడుపుతానని...
సౌందర్య: నువ్వు కోపం తగ్గించుకుని వింటానంటే నీతో మాట్లాడుతాను.
ఆనందరావు: హిమ ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తుంటుంది
శౌర్య: అది నటన..ఏదో ఒక రోజు మీక్కూడా తెలుస్తుంది
అప్పుడే అక్కడకు వచ్చిన ఓ జంట...మా పాప పుట్టినరోజు ఈరోజు..కాన్పు కష్టమైతే ఆవిడే ఆపరేషన్ చేశారు. మా పాపకి శౌర్య అనే పేరుకూడా పెట్టారని చెబుతారు. వాళ్లని కూడా హిమ డబ్బులిచ్చి ఏర్పాటు చేసిందనే ఆలోచిస్తుంది శౌర్య. 20 వేలు ఇచ్చి ఇద్దర్ని పిలిపించి పాపకి సౌందర్య, బాబుకి ఆనందరావు అని పేరుపెట్టానని నేనుకూడా చెప్పించొచ్చు...ప్రేమ చెప్పుకోవడం కాదు తెలియాలి...
సౌందర్య: ఆ పాప పుట్టినరోజు కానుక ఇచ్చిందేమో అనుకోవచ్చు కదా
శౌర్య: మీ ప్రియమైన మనవరాలు కదా బాగానే సమర్థిస్తున్నారు...
Also Read: శాడిస్ట్ లా తయారైన శౌర్య - హిమ అనుకుని రౌడీబేబీకి మళ్లీ ఐ లవ్ యూ చెప్పిన డాక్టర్ సాబ్
డాడీ ఎప్పుడొస్తారు మమ్మీ..హిమతో ఓసారి మాట్లాడమంటాను అన్న నిరుపమ్ పై స్వప్న ఫైర్ అవుతుంది. అంతా అయ్యాక అది వేరేవాళ్లని చేసుకోమని అనడం..నువ్వు దాని మనసు మార్చాలని చూడడం..ఇది మంచితనమా, అమాయకత్వమా
నిరుపమ్: ప్రేమ అనుకోవాలి
స్వప్న: నీకెందుకింత పంతం..అర్థంకావడం లేదా
నిరుపమ్: పంతాలు,పట్టింపులు ఏమీ లేవు..హిమ నా భార్య నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను ఇందులో రెండో ఆలోచనే లేదు..
క్యాన్సర్ ఉంది అది పోతుందని అనుకున్నాను...ఇప్పుడు శోభకు నేను ఏమని సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తుంది స్వప్న....
ఎపిసోడ్ ముగిసింది..
Also Read: