అంత కోపం ఉంటే నా ఫోటో మీదే ఎందుకు నా మీదే విసురు. ఫోటో మీద చూపిస్తే నీ కోపం తగ్గుతుందా లేదు కదా నా మీదకే విసురు అని హిమ ఏడుస్తూ బాధగా అంటుంది. ఏంటి మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నావ్, నీ ప్లాన్ లో ఇదొక భాగమా అని శౌర్య కోపంగా అంటుంది. ప్లాన్ అంటూ ఏమి లేదు ఈ మాట నీకు ఎన్ని సార్లు చెప్పినా నువ్వు వినడం లేదు నన్ను చంపేయ్ అని హిమ బాధగా అంటుంది. మనుషుల ప్రాణాలు అవలీలగా తియ్యడం నీకు తెలుసు, నమ్మక ద్రోహం చెయ్యడం నీకు తెలుసు, చేసిందంతా చేసి ఇప్పుడు నీ ప్రాణాలు తీసుకోమని అంటున్నావా, ప్రాణం తీసేంత క్రూరత్వం లేదు చేసిన ద్రోహాన్ని క్షమించేంత మానవత్వం తనకి లేదని శౌర్య చెప్తుంది. ఆ మాటలన్నీ సౌందర్య, ఆనందరావు విని బాధపడతారు. 


Also Read: అదిత్యపై గెలిచిన మాధవ, దేవి వెళ్లిపోవడంతో కుమిలిపోయిన ఆదిత్య- నిజం ఎప్పటికైనా చెప్తానంటూ మాధవకి రాధ సవాల్


హిమ, నిరుపమ్ పెళ్లి జరగదని అమ్మకి అయితే మాట ఇచ్చాను కానీ ఇది ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదని ప్రేమ్ ఆలోచిస్తాడు. హిమ శౌర్య మాటలు తలుచుకుని కుమిలిపోతుంది. అమ్మా, నాన్నల ఆఖరి కోరికగా శౌర్యని జాగ్రత్తగా చూసుకుంటానని అన్నాను. శౌర్య ఆనందం కోసం ఏం చేయలేకపోయాను. శౌర్య కోరుకున్నట్టుగా నిరుపమ్ బావతో పెళ్లి చేయాలి కానీ ఎలా అని ఆలోచిస్తుంటుంది. నీ మనసు ఎప్పుడు మారుతుంది, నన్నెప్పుడు అర్థం చేసుకుంటావని బాధపడుతుంది. అటు శౌర్య కూడా కార్తీక్, దీపల ఫోటో ముందు నిల్చుని ఏడుస్తుంది. 'అమ్మా మీరు వెళ్లిపోయారు నేను ఎలా అయిపోయానో చూశారా. మన ఇంట్లోనే పరాయిదానిలా మారిపోయాను. నేను కోరుకున్నవి ఏవి నాకు దక్కడం లేదు, చివరికి డాక్టర్ సాబ్ కూడ' అని ఏడుస్తుంది. ఇక ఒక చోట శౌర్య కూర్చుని ఉండగా వెనుక నిరుపమ్ వస్తాడు. తన భుజం మీద చెయ్యి వేసి ఐ లవ్యూ అని చెప్తాడు. ఆ మాటకి శౌర్య మొదట సంతోషించినా తర్వాత నిరుపమ్  గతంలో అన్న మాటలు గుర్తు చేసుకుని వెనక్కి తిరిగి చూస్తుంది. శౌర్యని చూసి నిరుపమ్ షాక్ అవుతాడు. నేను.. నేను హిమ అనుకొని అని చెప్పడంతో శౌర్య కళ్ల నిండా నీళ్ళతో చూస్తూ ఉంటుంటే సారీ చెప్పి వెళ్ళిపోతాడు. 


Also Read: వసుని అవమానించిన సాక్షి, సపోర్ట్ చేసిన రిషి- సాక్షి, దేవయానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిపడేసిన జగతి


నిరుపమ్ హిమ గదికి వస్తాడు. నువ్వు అనుకొని శౌర్యతో మాట్లాడాను అని చెప్తాడు. మీరేంటి సేమ్ డ్రెస్స్ వేసుకున్నారని అడుగుతాడు. నానమ్మ వాళ్ళు ముచ్చట పడితే వేసుకున్నామని చెప్తుంది. మన పెళ్లి కాన్సిల్ గురించి ఏం ఆలోచించావ్ అని హిమ అడుగుతుంది. ఆ మాటకి నిరుపమ్ కోపంగా అరుస్తాడు. మన పెళ్లి కాన్సిల్ చేసి శౌర్యని పెళ్లి చేసుకో బావా అని హిమ అడుగుతుంది. ఇదేమన్నా వస్తు మార్పిడి అనుకుంటున్నవా, ప్రేమని ఎలా బదిలీ చేస్తావ్ అని అడుగుతాడు. శౌర్యకి నువ్వంటే చాలా ఇష్టం బావా అని చెప్తుంది. నాకు నువ్వంటే ప్రాణం, నువ్వు ఏం చెప్పిన చేస్తాను, తెచ్చిస్తాను కాని శౌర్యని పెళ్లి చేసుకోమని అడగటం ఏంటి అని కోప్పడతాడు. శౌర్య మీద నీకు గొప్ప ప్రేమ ఉండొచ్చు కానీ నేను శౌర్యని పెళ్లి చేసుకుంటే తను సంతోషపడుతుందేమో కానీ నా పరిస్థితి ఏంటి నాజీవితం గురించి ఆలోచించవా నేను ఎలా సంతోషంగా ఉంటానని అనుకుంటున్నావని నిలదీస్తాడు. వాళ్ళ మాటలన్నీ శౌర్య బయట వింటూ ఉంటుంది. 


తరువాయి భాగంలో.. 


హిమకి మీరైన చెప్పండి శౌర్యని పెళ్లి చేసుకోవడం జరగదు, తన మనసు మార్చనడాని నిరుపమ్ సౌందర్య వాళ్ళకి చెప్తాడు. ఏంటి హిమ ఇదంతా అని సౌందర్య అడుగుతుంది. నిరుపమ్ బావతో ఎలాగైన శౌర్య పెళ్లి చేస్తానని అంటుంది. అప్పుడే శౌర్య ప్రేమగా హిమా అని పిలుస్తుంది డాక్టర్ సాబ్ ని నన్ను కలపడానికి ఇంతలా ఆరాటపడుతున్నావ్, నా కోసం నువ్వు ఇంత చేస్తుంటే నిన్ను శత్రువులా చూశాను అని హిమని హగ్ చేసుకుని ఏడుస్తుంది.