Viral Video : "ప్రేమంటే సులువు కాదురా - అది నీవు గెలువలేవరా " అని... ఖుషీ సినిమాలో ఓ పాటలో చెప్పించారు కానీ అది అవాస్తవమేమీ కాదు. ప్రేమలో పడిన ప్రతి ఒక్కరికీ అనుభవమే అయి ఉంటుంది. చాలా మంది మనసులోనే దాచుకుంటూ ఉంటారు. కొంత మందివి మాత్రం ఈ సోషల్ మీడియా యుగంలో వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి జంటే ఒకటి ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో కెమెరాకు చిక్కింది.
ఢిల్లీ మెట్రో రైల్లోకి ఓ జంట ఎక్కింది. చూడముచ్చటగా ఉన్నారు. అయితే మాస్కులు పెట్టుకుని ఉన్నారు. ఆధునిక వేషధారణతో ఉన్నారు. అంటే మంచి బ్రాండ్ దుస్తులు... యాక్సెసరీస్ అన్నమాట. అయితే వీరి మధ్య చిన్నగా గొడవ ప్రారంభమయింది. దీంతో మెట్రో ప్రయాణికుల్లో ఒకరు వీడియో తీశారు. ఆ గొడవ ఎక్కడి దాకా వెళ్లిందంటే చివరికి ఆ అమ్మాయి .. లవర్‌ని చెడామడా తిట్టేసి.. టప టపామని కొట్టేసి తర్వాత వచ్చిన స్టేషన్‌లో దిగిపోయి తన దారిన తాను వెళ్లిపోయింది. తర్వాత అతనూ అదే పని చేశాడు.
ఇంతకూ వాళ్ల మధ్య గొడవ ఎందుకొచ్చిందంటే.. డ్రెసింగ్ మీద. ఆ పాప వేసుకున్న టాప్ ఖర్చు వంద ఉంటుందని ... వర్జిన్ జారా బ్రాండ్ టాప్ కాదని.. రోడ్ సైడ్‌న అమ్మేదని అతను అన్నాడు. ఆ మాటలకు ఆ అమ్మాయికి కోపం వచ్చింది. లవర్‌తో గొడవ పెట్టుకుంది. అయితే ప్రేమలో ఉన్న ఆ లవర్ తగ్గాల్సిన చోట తగ్గలేదు. పైగా ఒకటికి రెండు మాటలన్నాడు. దీంతో ఆ అమ్మాయి చేతలకు.. చేతులతో పని చెప్పి వెళ్లిపోయింది.
వీరి గొడవను సీరియస్‌గా చూసిన మెట్రో ప్రయాణికులందరూ.. వాళ్లు వెళ్లిపోయిన తర్వతా ఒక్క సారి భళ్లుమని నవ్వారు. ప్రేమంటే అంత సులువు కాదని సెటైర్లు వేసుకున్నారు.