Heroine seized: పంజాబ్, ముంబయి పోలీసులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో... వందల కోట్ల విలువ చేసే హెరాయిన్ పట్టుబడింది.  దుబాయ్ నుంచి నవాషెవా పోర్టుకు చేరిన ఆ కంటైనర్,, పాత ముంబయి-పుణె జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న రాయ్ గఢ్ జిల్లా పన్వెల్ లోని ఓ ప్రైవేటు యార్డులో కనిపించింది. దాన్ని నిశితంగా పరిశీలించి చూడగా.. కనిపించిన దృశ్యం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. వెంటనే తేరుకొని అందులో ఉన్న 168 ప్యాకెట్ల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదక ద్రవ్యం విలువ మొత్తం బరువు 72.51 కిలోలుగా ఉందని.. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 362.59 కోట్లు ఉంటుందని ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు వివరించారు. 


సినిమా తరహాలో డ్రగ్స్ రవాణా..


అయితే అక్రమార్కులు ఈ హెరాయిన్ ను ఎవరికీ కనిపించకుండా కంటైనర్ లోని తలుపుల్లో, ఇంధన ట్యాంకర్ ఛాంబర్లలో, వస్తువుల మధ్య దాచి పెట్టారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిశితంగా పరిశీలిస్తే తప్పు దీన్ని పట్టుకోలేరు. ఈ అక్రమార్కులు సినిమా చూసి.. ఈ తరహాలో స్మగ్లింగ్ చేస్తున్నారేమో. అచ్చం సినిమాల్లో లాగానే హెరాయిన్ ను దాచారు. కానీ ముంబయి పోలీసులు స్మగ్లర్ల ఆటలు కట్టించి మరీ మత్తు పదార్థాలను పట్టుకున్నారు. అంతే కాకుండా మహారాష్ట్ర పోలీసులతో కలిసి మరోచోట 72 కిలోల నల్ల మందును చేజిక్కించుకున్నట్లు పంజాబ్ డీబీపీ తెలిపారు. 


ఆర్మీ వాహనమంటూ నల్లమందు తరలింపు..


అస్సాంలోని కరీంగంజ్, కర్బీ అంగ్లాంగ్ జిల్లాల్లోనూ 4 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ పోలీసుల తనిఖీల్లో వెలుగు చూసింది. మిజోరం నుంచి అటుగా రాకపోకలు సాగిస్తున్న వాహనాలను తనిఖీ చేయగా... ఇంధన ట్యాంకరులో రహస్య ఛాంబర్ బయట పడింది. అందులో 39 సబ్బు పెట్టెల్లో ఉంచిన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు అంగ్లాంగ్ పోలీసులు సీఆర్పీఎఫ్ బలగాలతో కలిసి ఖక్రాజన్ వద్ద తనిఖీలు చేపట్టారు. నాగాలాండ్ లోని దిమాపుర్ నుంచి ఆర్మీ ఆన్ డ్యూటీ స్టిక్కర్లు వేస్కొని మత్తు పదార్థాల రవాణా సాగిస్తున్నారు. 


దేశవ్యాప్తంగా పోలీసుల దాడులు...


వాహనంలోని ఇంజిన్ వద్ద 46 ప్యాకెట్ల ఉంచిన 477 కిలోల గంజాయి వెలుగు చూసింది. దీని విలువ 50 లక్షల పైమాటే. ద్విచక్ర వాహనంలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీటి మొత్తం విలువ అంతర్జాతీయ మార్కెట్లో 80 లక్షల రూపాయల వరకూ ఉంటుందని పోలీసులు వివరించారు. అలాగే మధ్య ప్రదేశ్ లోని నర్సింగ్ పుర్ జిల్లాకు చెందిన నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు సిబ్బంది.. అక్రమార్కులు ఓ ట్రక్కులో తరలిస్తున్న 1200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.