ప్రముఖ దర్శకుడు మణిరత్నం కరోనా బారిన పడ్డారు. దాంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే, కంగారు పడాల్సిన అవసరం లేదని... కోవిడ్ 19 పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. మణిరత్నానికి ప్రస్తుతం అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. 


తమిళంతో పాటు తెలుగులోనూ మణిరత్నానికి అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలు తెలుగునాట భారీ విజయాలు సాధించాయి. సెప్టెంబర్ 30న విడుదల కానున్న 'పొన్నియన్ సెల్వన్' కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఆయనకు కరోనా బారిన పడటం చిత్ర బృందానికి ఆందోళన కలిగించే అంశమే.


చియాన్ విక్రమ్ (Chiyaan Vikram), 'జయం' రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా ధూళిపాళ ప్రధాన తారలుగా రూపొందుతోన్న 'పొన్నియన్ సెల్వన్' (Ponniyin Selvan 1 Movie) టీజర్ ఇటీవల విడుదల అయ్యింది. దానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మరోవైపు విమర్శలు కూడా వస్తున్నాయి.


Also Read : రష్మికకు మరో కోలీవుడ్ ఆఫర్? పాన్ ఇండియా సినిమాకు 'ఎస్' అంటుందా?


టీజర్ విడుదలైన తర్వాత 'పొన్నియన్ సెల్వన్' వివాదంలో చిక్కుకుంది. చోళులు, చోళ రాజవంశాన్ని సినిమాలో తప్పుగా చూపిస్తున్నారని... చరిత్రను వక్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ ఒకరు కోర్టులో కేసు వేశారు. దాంతో విక్రమ్, మణిరత్నానికి నోటీసులు జారీ అయ్యాయి. 


Also Read : చిరంజీవి అబద్ధాలకు పడతారు కానీ పవన్ కళ్యాణ్‌ను కన్వీన్స్ చేయడం కష్టమే!