అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టేది అవాంఛిత రోమాలు. వాటిని తొలగించుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి షేవింగ్ చెయ్యడం లేదా వాక్స్ చేసుకోవడం. అయితే ఈ రెండింటిలో ఏది మంచిది అనే సందేహం చాలా మందికి వస్తుంది. కొంతమంది షేవింగ్ బాగుంటుందంటే మరి కొంతమంది మాత్రం వాక్స్ చేయడానికి ఇష్టం చూపిస్తారు. ఇప్పుడైతే అవాంఛిత రోమాలు పోయేలా చేసుకునేందుకు సులువైన క్రీములు వస్తున్నాయి. ఇంతక ముందు మాత్రం ఎక్కువ శాతం మంది షేవింగ్ చేసుకునే వాళ్ళు. కాకపోతే ఇది సమయం ఎక్కువ తీసుకుంటుంది. అదే క్రీమ్స్ అయితే కొద్ది నిమిషాల్లోనే పని అయిపోతుంది. అందుకే ఎక్కువ శాతం మంది వాటికే మొగ్గు చూపుతున్నారు.


అవాంఛిత రోమాలు తీసుకునేందుకు వాక్స్ చేసుకోవడం పాత పద్ధతి. దీనికి ఎక్కువ సమయం కేటాయించాలి. దీనికి సంబంధించిన క్రీమ్ అప్లై చేసుకుని కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత గుడ్డతో శుభ్రం చేసుకోవాలి. ఇది కొంచెం నొప్పితో కూడుకున్నది. ప్రస్తుతం వాక్స్ కూడా తేలికగా మారిపోయింది. మార్కెట్లో అందుకు సంబంధించిన స్ట్రిప్స్ అందుబాటులో ఉంటున్నాయి.


ఇక షేవింగ్ చేసుకోవడం కోసం ఆడవాళ్ళ కోసం కూడా రెజర్స్ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా షేవింగ్ చేసుకోకపోతే సున్నితమైన ప్రదేశంపై గాట్లు పడటం, తెగడం వంటివి జరుగుతుంది. ఇవి రెండిటిలో మీ స్కిన్ కి ఏది బాగా సరిపోతుందనేది చూసుకుని ఆ పద్ధతిని ఫాలో అవ్వాలి.


వీటి వల్ల ఉపయోగాలు


హెయిర్ రిమూవ్ చేసుకునేందుకే కాదు చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ కూడా పోయే విధంగా వాక్స్ పనిచేస్తుంది. ప్రొఫెషనల్స్ సహాయం లేకుండా ఇప్పుడు ఇంట్లోనే సులభంగా వాక్స్ చేసుకునే మార్గం ఉంది. బిజీ జీవితం గడిపే వారికి షేవింగ్ చేసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించలేరు. అందుకే ఎక్కువ మంది వాక్స్ చేసుకునేందుకే ఇష్టపడతారు.


సైడ్ ఎఫ్ఫెక్ట్స్


వాక్సింగ్: మీది సున్నితమైన చర్మం అయినట్లైతే హాట్ వాక్స్ చెయ్యడం వల్ల చర్మం ఇరిటేషన్ గా నిపిస్తుంది. అంటే కాదు వాక్స్ చేసిన ప్రదేశం ఎర్రఆగా మారిపోవడం, దద్దుర్లు రావడంతో పాటు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. వాక్స్ సరిగా చేసుకోకపోతే హెయిర్ వెంటనే పెరుగుతుంది.


షేవింగ్: స్కిన్ ని బట్టి షేవింగ్ చేసుకోవాలి. సున్నితమైన చర్మం అయితే రేజర్ తో షేవింగ్ చేసుకోవడం వల్ల గాయాలు కావడం, రక్తం రావడం, మంటగా ఉండటం, దురదగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. అందుకే మీ స్కిన్ కి ఏది సరిపోతుందో చూసుకుని ఆ పద్ధతిని ఎంచుకోవడం ఉత్తమం. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also read: ముఖంపై కనిపించే ఈ లక్షణం ఉదర క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు


Also Read: గాల్లో వేలాడే రెస్టారెంట్ ఎప్పుడైనా చూశారా? ఆ రెస్టారెంట్ ఎక్కడ ఉందో తెలుసా?