చుట్టూ ఆహ్లాదకర వాతావరణం అందమైన పచ్చిక బయళ్ళు, కనుచూపు మేరలో మంచు దుప్పటి కప్పుకున్న కొండలు ఎంత అందంగా ఉంటాయో కదా. అటువంటి వాతావరణంలో ఉండాలంటే ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి. మరి అటువంటి చోట గాల్లో వేలాడుతూ తింటుంటే ఎలా ఉంటుందంటారు. వామ్మో అనిపిస్తుందా? అలాంటి థ్రిల్లింగ్ కావాలనుకున్న వాళ్ళు మనాలిలోని ఈ ప్రపంచంలోనే ఎత్తైన వేలాడే రెస్టారెంట్ కి తప్పకుండా వెళ్ళాల్సిందే. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి అద్భుతమైన అందమైన కొండ ప్రాంతం. పారాగ్లైడింగ్, పర్వతారోహన, బంగి జంప్ వంటి సహసా క్రీడలకి ఇది బెస్ట్ ప్లేస్. ఇవే కాదు అక్కడ మరో అద్బుతం కూడా ఉంది. అదే గాల్లో వేలాడే రెస్టారెంట్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాల్లో వేలాడే రెస్టారెంట్.
ఓల్డ్ మనాలి రోడ్డులో ఇది ఉంది. భూమికి 165 అడుగుల ఎత్తులో ఇది ఉంటుంది. ఇందులో కూర్చుని విందు ఆరగించడమే కాదు మనాలి అందాలను వీక్షించవచ్చు. అంతే కాదండోయ్ మంచుతో కప్పబడిన హిమాలయ అందాలు కూడా వీక్షకులకి కనువిందు చేస్తాయి.
ఇందులో 24 మంది అతిదులు, 4 స్టాఫ్ ఉండే సౌకర్యం కలిగించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హ్యాంగింగ్ రెస్టారెంట్‌గా దీన్ని పిలవడానికి కారణం ఏమిటంటే ఇందులోని సీట్స్ గాల్లో వేలాడుతూ ఉంటాయి. రెస్టారెంట్ టేబుల్ సముద్ర మట్టానికి 2,250 మీటర్ల ఎత్తులో వేలాడుతూ ఉంటుంది. అందుకే దీన్ని ప్రపంచంలోనే ఎత్తైనదిగా పేర్కొన్నారు.
ఈ రెస్టారెంట్ లో 5 రకాల ప్యాకేజీలు ఉన్నాయి. రోజు మొత్తం మీద 5 రైడ్స్ మాత్రమే ఉంటాయి. రుచికరమైన భోజనం తింటూ ఆహాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తుంటే అద్బుతంగా ఉంటుంది. ఫస్ట్ రైడ్ మధ్యాహ్నం 1.30 నుంచి 2.15 గంటల వరకు ఉంటుంది. మళ్ళీ సెకండ్ రైడ్ 3.30 నుంచి 4.15 వరకు లంచ్ సర్వ్ చేస్తారు.ఆ తర్వాత సాయంత్రం 5.15 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. ఇది అ తర్వాత రెస్టారెంట్ వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు. మళ్ళీ రాత్రి వేళ 7.4 5 నుంచి 8.30 వరకు డిన్నర్ ఏర్పాటు చేస్తారు. ఇక చివరిగా 9 గంటల నుంచి 9.45 వరకు డిన్నర్ సర్వ్ చేసి క్లోజ్ చేస్తారు.
మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా గాల్లో వేలాడుతూ తినాలని అనుకుంటే వెంటనే మనాలి చెక్కేయండి. అక్కడి అందాలని చూస్తూ విందు ఆరగించెయ్యండి.
Also Read: మీ శరీరానికి కావల్సినంత కొల్లాజెన్ లేదా? ఈ ఫుడ్ తింటే అందమైన స్కిన్ మీ సొంతం అవ్వాల్సిందే