ఎముకల బలంగా ఉండటం చాలా అవసరం. ఏ పని చెయ్యాలన్నా వాటి అవసరం లేకుండా సాధ్యపడదు. శరీరంలోని ఇతర భాగాల మీద చూపించే శ్రద్ద ఎముకల మీద కూడా చూపించాలి. వాటికి అవసరమైన కాల్షియం అందించాలి. లేదంటే అవి పెళుసుగా మారిపోతాయి. చాలా మంది ఎముకల ఆరోగ్యం గురించి నిర్లక్ష్యం చేస్తారు. శరీర బరువు ఎముకల నిర్మాణంపైనే ఆధారపడి ఉంటుంది. ఎముకలు అరిగిపోయినా వాటికి దెబ్బలు తగిలినా దాని ప్రభావం శరీరం మొత్తం మీద చూపిస్తుంది. వయసు రీత్యా ఎముకలు బలహీనంగా మారిపోతాయి. అందుకే వివిధ రకాల ఆహారం తీసుకుంటే జీవినశైలిలో మార్పులు చేసుకుంటే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే ఎముకలు ధృడంగా మారతాయి. మరి కొన్నింటి వల్ల ఎముకలు బలహీన పడిపోతాయి. అవేంటో చూద్దామా..
ఎముకలకి నష్టం కలిగించేవి
☀ శీతల పానీయాల్లో చక్కెర, కెఫీన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఫాస్పోరిక్ యాసిడ్ ప్రిజర్వేటివ్‌గా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఎముకలకి నష్టం వాటిల్లుతుంది.
☀ జంతువుల ప్రోటీన్ అధికంగా తీసుకోవడం వల్ల కాల్షియం తగ్గుతుంది.
☀ టీ, కోకో, చాక్లెట్లు, కాఫీలోని కెఫీన్ కాల్షియం శోషణ తగ్గిస్తాయి.
☀ నికోటిన్ కాల్షియం శోషణని ప్రభావితం చేస్తుంది. అందుకే ధూమపానం, పొగాకు నమలడం వంటి వాటికి దూరంగా ఉండాలని చెబుతారు. ఇవి శరీరంలోనిన్ కాల్షియంని హరిస్తాయి.
☀ అధికంగా ఉప్పు, చక్కెర తీసుకోవడం కూడా కాల్షియాన్ని తగ్గిస్తుంది. దాని వల్ల ఎముకలు బలహీనపడతాయి.
☀ వాకింగ్, రన్నింగ్, జాగింగ్ వంటి శారీరక శ్రమ చేసేటప్పుడు ఎముకల నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది.
☀ కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. తరచుగా వ్యాయామం చేయడం వల్ల ఎముకలు, కండరాలు బలంగా మారతాయి.
ఎముకలు బలంగా లేకపోతే వచ్చే నష్టాలు
శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో కాల్షియం ఒకటి. ఇది సరిగా అందకపోతే ఎముకలు బలహీనంగా మారతాయి. ఎముకలు, దంతాల పెరుగుదలలో కాల్షియం కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి కావాల్సిన కాల్షియం అందకపోతే ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులు రావచ్చు. మహిళల్లో 30 ఏళ్లు దాటిన వారిలో ఎముకల్లో కాల్షియం తగ్గిపోవడం సమస్య తరచూ గమనిస్తూనే ఉంటారు. ఎముకలు అరిగిపోయి కొద్దిసేపు నడిస్తేనే కాళ్ళు నొప్పులు రావడం జరుగుతుంది. ప్రస్తుత రోజుల్లో చిన్న వయసులోనే ఎముకలు బలహీనంగా మారి ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఎముకలకి బలాన్ని ఇచ్చే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.
కాల్షియం పొందే ఆహారం
పాలు, చేపలు, గుడ్లు, సీజనల్ వారీగా వచ్చే పండ్లు, కూరగాయలు, కొవ్వు రహిత ప్రోటీన్లు, నట్స్, పాలకూర, యాపిల్, బొప్పాయి వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత కాల్షియం అందుతుంది. అవసరం అయితే వైద్యుని సలహా మేరకు కాల్షియం సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: బ్రౌన్ షుగర్ Vs వైట్ షుగర్? ఆరోగ్యానికి ఏది మంచిది?
Also Read: టీ, కాఫీలు కాదు - ఉదయాన్నే ఈ పానీయాలు తాగితే బోలెడంత ఆరోగ్యం!