దయం నిద్ర లేవగానే చాలా మంది కాఫీ లేదా టీ తాగడానికి ఇష్టపడతారు. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు మాత్రం గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలుపుకుని తాగుతారు. రాత్రంతా నిద్రపోవడం వల్ల మరుసటి రోజు రీఫ్రెష్ గా ఉండాలంటే ఆరోగ్యకరమైన పానీయాలు తాగాలి. వాటితో రోజు ప్రారంభించడం వల్ల ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలుగుతారు. అందుకే ఉదయం లేవగానే ఒక గ్లాసు మంచి నీళ్ళు తాగితే చాలా మంచిదని నిపుణులు చెబుతారు. వివిధ ఆరోగ్యకరమైన పానీయాలు కూడా ఒక్కోసారి శరీరాన్ని డీ హైడ్రేట్ కి గురి చేస్తాయి. అందుకే ముందుగా నీరు తాగిన తర్వాత ఏదైనా కాఫీ లేదా టీ తీసుకోవాలని అంటారు. నీళ్ళు తాగడం వల్ల డీహైడ్రేట్ నుంచి నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకే నీటితో పాటు మరికొన్ని పానీయాలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అవేమిటంటే.. 


యాపిల్ సిడర్ వెనిగర్


ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేసే వాటిలో యాపిల్ సిడర్ వెనిగర్ ముందు వరుసలో ఉంటుంది. దీన్ని నీటితో కలిపి తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇవి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ సాధారణ పానీయం జీర్ణక్రియని మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది.


గ్రీన్ టీ


గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది. జీవక్రియని పెంచి కొవ్వుని కరిగించేందుకు సహాయపడుతుంది. మెదడు పని తీరుకి సహాయపడుతుంది. క్యాన్సర్ నుంచి రక్షణగా నిలుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది.


బ్లాక్ కాఫీ


అపారమైన ప్రయోజనాలతో కూడిన ఆరోగ్యకరమైన పానియాలలో కాఫీ ఒకటి. అది కూడా బ్లాక్ కాఫీ తాగడం అన్నీ విధాలుగా మంచిది. ఉదయం కాఫీని తీసుకోవడం వల్ల కారిస్టల్ అనే హార్మోన్ ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. కార్టిసాల్ అనేది కిడ్నీలోని అడ్రినల్ గ్రంథులు ఉత్పత్తి చేసే స్టెరాయిడ్ హార్మోన్. రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటుని ప్రభావితం చేస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి జీవక్రియని మెరుగుపరుస్తుంది.


ఆలోవెరా జ్యూస్


గాయాలు, చర్మ సమస్యలను నయం చేయడానికి ఆలోవెరాకి మించిన గొప్ప ఔషధం లేదు. శరీర ఆరోగ్యానికే కాదు అందానికి కూడా కలబంద చాలా మంచిది. కలబంద రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి జీర్ణాశయాంతర పేగుల వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. పేగుల్లో వచ్చే వ్యాధులని నియంత్రించడంలో కీలక పాత్ర వహిస్తుంది. మధుమేహ రోగులకి కలబంద చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఉదయాన్నే కొద్దిగా కలబంద గుజ్జు నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.


టమాటో రసం


టమాటో జ్యూస్‌తో రోజును ప్రారంభించడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. అసిడిటీ సమస్యని ఎదుర్కోవడమే కాకుండా సులభంగా లభించే పోషకాలను సరఫరా చేయడం ద్వారా అవయవాలను సక్రియం చేస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: భోజనం తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు


Also Read: బరువు తగ్గేందుకు రోజూ ద్రాక్ష పండ్లు తీసుకున్న మహిళ - దారుణం జరిగిపోయింది!