పుల్ల పుల్లగా తియ్య తియ్యగా ఎంతో రుచిగా ఉండే ద్రాక్ష పండ్లు అంటే అందరూ ఇష్టపడతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కొవ్వుని కరిగించి బరువు తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. అలా అనుకునే ఒక మహిళ బరువు తగ్గడం కోసం తరచూ ద్రాక్ష పండ్లు తినడం అలవాటు చేసుకుంది. కానీ అదే తన ప్రాణాల మీదకి తెచ్చింది. చివరికి అది ఆమె కాలు తీసేసే పరిస్థితికి దారి తీసింది. దీనికి సంబంధించి ఒక షాకింగ్ స్టడీ బయటకి వచ్చి అందరినీ కలవరపెడుతోంది.


వాషింగ్టన్ కి చెందిన ఒక మహిళ బరువు తగ్గడానికి మూడు రోజుల పాటు వరుసగా ఉదయాన్నే ద్రాక్ష పండ్లు తీసుకుంది. ఎక్కువగా వాటిని తీసుకోవడం వల్ల సదరు మహిళ కాలులో రక్తం గడ్డకట్టింది. తొలుత ఆమె తన ఎడమ కాలు ఊదా రంగులోకి మారడం గమనించింది. తర్వాత చీలమండ నుంచి విపరీతమైన నొప్పి రావడం మొదలైంది. క్రమంగా కాలు నడవలేకపోవడం, తల తిరుగుతున్నట్లు అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైన లక్షణాలు గుర్తించింది. నొప్పి తట్టుకోలేక ఆమె హస్పిటల్ కి వెళ్ళగా వైద్యులు పరీక్షలు జరిపారు. అల్ట్రా సౌండ్ స్కాన్ ద్వారా ఆమె ఎడమ కాలు తుంటి నుంచి కాలు కింద వరకి రక్తం ప్రసరణ జరిగే సిరలో పెద్ద మొత్తంలో రక్తం గడ్డకట్టినట్టు నిర్థారించారు.


ఇలా రక్తం గడ్డకట్టడాన్ని గ్యాంగ్రీన్ అంటారు. ఇది అవయవ విచ్చేదనానికిదారి తీస్తుంది. సిరలోని గడ్డకట్టిన రక్తాన్ని కరిగించేందుకు వైద్యులు ఇంజెక్షన్స్ వేశారు. అది కరిగిన తర్వాత ఆమె తుంటిలోని పెద్ద సిరని దీర్ఘకాలికంగా తొలగించినట్లు వైద్యులు తెలిపారు. అది తొలగించకపోతే మరింతగా రక్తం గడ్డకట్టే అవకాశం ఉందని వెల్లడించారు. సిర ఎప్పటిలాగా క్రియాత్మకంగా పని చేసేలా స్టెంట్ వేయాలని తెలిపారు.


రక్తం గడ్డకట్టడానికి కారణం?


42 ఏళ్ల ఆ మహిళ గర్భం రాకుండా ఎక్కువగా పిల్స్ వేసుకుంది. దీని వల్ల ఈస్ట్రోజెన్ సింథటిక్ రూపాన్ని కలిగి ఉండేలా ఏర్పడింది. ఇదే కాదు రక్తం గడ్డకట్టే రుగ్మతతోముడిపడి ఉన్న ఫ్యాక్టర్ V లైడెన్ మ్యుటేషన్ అని పిలిచే జన్యు వైవిధ్యాన్ని తీసుకుంది. వీటి వల్ల డీప్ వెయిన్ థ్రాంబోసిస్ కి గురైంది. అంటే సిరల్లో రక్తం గడ్డకట్టడాన్ని వైద్య పరిభాషలో ఇలా పిలుస్తారు.


సదరు మహిళ బరువు తగ్గేందుకు వైద్యులని సంప్రదించకుండా ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఆహారపు అలవాట్లు మార్చుకుంది. బరువు తగ్గడం కోసం అతిగా ద్రాక్షపండ్లు తీసుకోవడం చేసింది. చివరికి ఇలా రక్తం గడ్డకట్టే పరిస్థితి వచ్చింది. ద్రాక్షపండు రసం CYP3A4 అనే ఎంజైమ్ చర్యను అడ్డుకుంది. ఇది గర్భనిరోధక హార్మోన్ ఈస్ట్రోజెన్‌ను విచ్ఛిన్నం చేసింది.


నివారణ ఎలా?


☀ బరువు తగ్గాలని అనుకున్నపుడు వైద్యుని సలహా లేకుండా ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఆహారంలో మార్పులు చెయ్యకూడదు.


☀ పైన పేర్కొన్న ఏవైనా పరిస్థితులు ఎదుర్కొంటుంటే ద్రాక్షపండ్లు లేదా రసాన్ని తీసుకోవడం పూర్తిగా ఆపేయాలి. డాక్టర్ అనుమతి లేకుండా ద్రాక్షపండ్లు తీసుకోవద్దు. ఇతర వ్యాధులకి సంబంధించి ఏవైనా మందులు వాడుతుంటే వాటిని ప్రభావితం చేసే ప్రధాన సమ్మేళనాలను ఫ్యూరానోకౌమరిన్స్ విడుదల చేస్తుంది.


☀ ఇవే కాదు నారింగిన్ వంటి కొన్ని ఫ్లేవనాయిడ్లు కూడా ఔషధ జీవక్రియని అడ్డుకుంటాయి. వాటి వల్ల మందుల ప్రభావం శరీరం మీద ఏమాత్రం ఉండదు.


☀ ఏవైనా సాధారణ ఔషధాలు ఉపయోగిస్తున్నపుడు అందులో ఉంటే ఆరోగ్య ఉత్పత్తులు ఏమిటి అనేసి లేబుల్ మీద చూసి తీసుకోండి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: ఇవి తింటే మధుమేహం ఆమడదూరం పారిపోవాల్సిందే


Also Read: వయాగ్రా అందుకే కాదు - ఈ భయానక వ్యాధిని సైతం నయం చేస్తుందట!