పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెంచుకోవడం కోసం ఎక్కువ మంది వయాగ్రా వాడుతూ ఉంటారు. ఇది కొన్ని సార్లు ప్రమాదకరం అయినప్పటికీ మంచి కూడా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ కణాలు తగ్గించడంలో సహాయపడుతోందని పరిశోధకులు కనుగొన్నారు. వయాగ్రాలో కనిపించే ఫాస్ఫోడీస్టేరేస్ టైప్ 5(PDE5) అనే రసాయనం అన్న వాహికలో కనిపించే కణితులని తగ్గించడంలో సహాయపడుతుందని వెల్లడైంది. ఈ చిన్న మాత్ర క్యాన్సర్ చికిత్స కీమోథెరపీని మరింత ప్రభావవంతంగా పని చేసేలా చేస్తుంది. ఇది ఇతర క్యాన్సర్లని చంపడానికి కూడా సహాయపడుతుందని అంటున్నారు.
యూకేలో ప్రతి సంవత్సరం సుమారు 7,9000 మంది అన్న వాహిక క్యాన్సర్ తో మరణిస్తున్నారు. కేన్సర్ బారిన పడిన వారు ఐదేళ్లకు మించి బతికే అవకాశం 20 శాతం మాత్రమే ఉంటుంది. అన్నవాహిక క్యాన్సర్ నోటిని కడుపుతో కలిపే మార్గానికి సోకుతుంది. ఈ వ్యాధికి ఇతర క్యాన్సర్లతో పోలిస్తే చాలా తక్కువ చికిత్స ఉంటుంది. ఈ క్యాన్సర్ తో బాధపడుతున్న వారిలో 80 శాతం మంది కీమోథెరపీకి కూడా స్పందించడం లేదని పరిశోధనలో తేలింది. వయాగ్రాలోని PDE 5 క్యాన్సర్ కణితి వృద్ధి చెందకుండా చేస్తుంది. సౌతాంప్టన్ బృందం ల్యాబ్‌లోని క్యాన్సర్ కణాలపై, ఎలుకలపై PDE5 నిరోధక మందులను పరీక్షించారు. వయాగ్రా వాడిన ప్రతి 75 కేసులలో కీమోథెరపీ ప్రభావవంతంగా ఉందని నిపుణులు కనుగొన్నారు.
అన్నవాహిక క్యాన్సర్ లక్షణాలు
❂ బరువు తగ్గడం
❂ ఆహారం మింగడం కష్టంగా మారడం
❂ రొమ్ము ఎముక నొప్పి
❂ గొంతు బొంగురు పోయి దగ్గు రావడం
❂ అజీర్ణం, గుండెల్లో మంట
❂ ఎక్కువగా ధూమపానం, ఆల్కహాల్ తీసుకోవడం
ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వహించకుండా తగిన వైద్య పరీక్షలు చేయించుకుని వ్యాధి గురించి తెలుసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి చివరి దశకి చేరితే ప్రాణాలు కాపాడటం చాలా కష్టం. క్యాన్సర్ కణితి పరిమాణాన్ని బట్టి పొట్టలో కొంత భాగం తొలగించాల్సి కూడా వస్తుంది.
వయాగ్రా ఎంత వరకు పని చేస్తుందనే దాని మీద ఇంకా పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం y ఎలుకల మీద పరీక్షిస్తుండగా త్వరలోనే మానవుల మీద కూడా పరీక్షలు ప్రారంభించాలని బృందం భావిస్తోంది. క్యాన్సర్ కోసం కొత్త ఔషధాలని అభివృద్ధి చేయడం చాలా క్లిష్టరమైనది. సవాలుతో కూడుకున్నది కనుక విశ్లేషాత్మక పరిశోధనలు అవసరం ఉంది. ఇది విజయవంతం అయితే ఈ క్యాన్సర్ బారిన పడిన వాళ్ళకి చికిత్స చేయవచ్చు. ఇతర వ్యాధులకి పని చేసే మందులు క్యాన్సర్ చికిత్స కి కూడా ప్రభావవంతంగా ఉంటాయా లేదా అనే దాని మీద మరింత పరిశోధనలు చెయ్యడానికి ఆసక్తిగా ఉన్నామని నిపుణుల బృందం వెల్లడించింది.
గత నలబై సంవత్సరాలలో అన్నవాహిక క్యాన్సర్ చికిత్సలో పురోగతి మెరుగ్గా ఉన్నప్పటికీ అది పూర్తి స్థాయిలో ఉండేలా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ లో కీమోథెరపీతో PDE 5 ఉపయోగించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయనే దాని గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు నిపుణులు తెలిపారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మహిళలూ, మీరు ఈ వయస్సుకు వస్తే ఈ ఐదు పరీక్షలు తప్పనిసరి! లేకపోతే..
Also read: గుండెపోటు వచ్చిన తరువాత ఆ వ్యక్తికి ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి?